బెల్లంకొండ కూడా అదే రోజున‌..

  • IndiaGlitz, [Thursday,November 02 2017]

చూస్తుంటే.. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 9 సినిమా ప్రియుల‌కు వినోదానికి చిరునామాలా మారేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ రోజున రెండు సినిమాలు రాబోతున్నాయంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. సాయిధ‌ర‌మ్ తేజ్‌, వి.వి.వినాయ‌క్ కాంబినేష‌న్‌లో రాబోతున్న ఇంటెలిజెంట్‌ ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానుండ‌గా.. అదే రోజు వ‌రుణ్‌తేజ్‌, నూత‌న ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి కాంబినేష‌న్‌లో రానున్న కొత్త చిత్రం కూడా రిలీజ్ కాబోతున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

వీటితో పాటు మ‌రో చిత్రం కూడా తోడు కానుంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ముచ్చ‌టించుకుంటున్నారు. అల్లుడు శీను, స్పీడున్నోడు, జ‌య‌జాన‌కి నాయ‌క చిత్రాల‌తో సంద‌డి చేసిన యువ క‌థానాయ‌కుడు బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్‌.. ప్ర‌స్తుతం సాక్ష్యం పేరుతో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ల‌క్ష్యం ఫేమ్ శ్రీ‌వాస్ ద‌ర్శ‌కుడు.

జ‌గ‌ప‌తిబాబు, శ‌ర‌త్‌కుమార్‌, మీనా ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంద‌ట‌. మ‌రి.. ఒకే రోజు ముగ్గురు యువ క‌థానాయ‌కులు బ‌రిలోకి దిగుతున్నార‌న్న‌మాట‌. ఫైన‌ల్‌గా.. ఆ రోజు ఎవ‌రు వ‌స్తారో.. ఎవ‌రు త‌ప్పుకుంటారో చూడాలి.

More News

చై, సామ్ రిసెప్ష‌న్‌...

చైత‌న్య అక్కినేని, హీరోయిన్ స‌మంత‌లు అక్టోబ‌ర్ నెల‌లో ఓ ఇంటివారైన సంగ‌తి తెలిసిందే. గోవాలో ప‌రిమితంగా కుటుంబ స‌భ్యులు, శ్రేయోభిలాషుల స‌మ‌క్షంలో వీరి పెళ్లి హిందూ, క్రిస్టియ‌న్ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో జ‌రిగింది.

నాగ‌శౌర్య‌.. ముగ్గురు కొత్త ద‌ర్శ‌కులు

ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో ఆక‌ట్టుకున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌ శౌర్య‌. ఆ త‌రువాత జో అచ్యుతానంద‌లాంటి చిత్రాల‌తో త‌న ఉనికిని చాటుకున్న ఈ యంగ్ హీరో.. ప్ర‌స్తుతం చేతిలో ఐదు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

రాజ‌శేఖ‌ర్ ఇంట మ‌రో విషాదం...

సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్‌కు మ‌రో విషాద ఘ‌ట‌న ఎదురైంది. ఇటీవ‌ల రాజ‌శేఖ‌ర్ అమ్మ‌గారు గుండె పోటుతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆ బాధ‌ను మ‌ర‌చిపోక‌పోకముందే,  రాజశేఖ‌ర్ బావ మ‌రిది, జీవిత సోద‌రుడు ..ముర‌ళీ శ్రీనివాస్ అనారోగ్యంతో క‌న్నుమూశారు.

అన్న‌ పై ప‌వ‌న్ ప్రేమ‌...

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న అన్న‌య్య మెగాస్టార్ చిరంజీవి అంటే త‌న‌కు అభిమాన‌మో మ‌రోసారి చేత‌ల‌తో చాటుకున్నారు. ప‌వ‌న్‌కు అక్టోబ‌ర్ నెల‌లో కొడుకు పుట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ కొడుక్కి ప‌వ‌న్ మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్ అనే పేరును పెట్టారు.

నటుడిగా మారుతున్న ర‌సూల్ పూకుట్టి....

2009లో విడుద‌లైన స్ల‌మ్ డామ్ మిలియ‌నీర్ భార‌తీయుల‌కు మ‌ర‌చిపోలేని జ్ఞాపకం. ఎందుకంటే ఆ సినిమాకు పనిచేసిన ఇద్ద‌రు టెక్నిషియ‌న్స్‌కు ఆస్కార్ అవార్డులు వ‌చ్చాయి. అందులో ఒక‌రు ఎ.ఆర్‌.రెహ‌మాన్ కాగా..మ‌రొక‌రు, ర‌సూల్ పూకుట్టి.