మరో తమిళ రీమేక్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్..

  • IndiaGlitz, [Friday,April 30 2021]

2019లో ధనుష్ ప్రధాన పాత్రలో రూపొంది.. మంచి సక్సెస్ సాధించిన తమిళ చిత్రం 'రాక్షసన్‌'ను తెలుగులోకి 'రాక్షసుడు' పేరుతో తెలుగులో రీమేక్‌ చేసి ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అద్భుతమైన విజయం సాధించిన సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ తరువాతి రెండు సినిమాలు కూడా రీమేక్సే కావడం విశేషం. ఇక ఈ యంగ్ హీరో బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై వి.వి.వినాయక్ దర్శకత్వంలో బాలీవుడ్‌లోకి ‘ఛత్రపతి’ సినిమాను రీమేక్ చేస్తున్నారు.

‘ఛత్రపతి’ సినిమా రీమేక్ ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కోసం ఇప్పటికే హైదరాబాద్‌లో భారీ సెట్ సైతం వేశారు. అయితే ఈ సినిమా వాయిదా పడటంతో ఇప్పుడు ఈ యంగ్‌ హీరో మరో తమిళ రీమేక్‌లో నటించడానికి సన్నద్ధమవుతున్నట్లు తమిళ చిత్ర సీమ సమాచారం. వివరాల్లోకి వెళితే, ధనుశ్‌ హీరోగా నటించిన 'కర్ణన్‌' సినిమా ఏప్రిల్‌ 9న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా తెలుగు రీమేక్‌ హక్కులను బెల్లంకొండ సురేష్‌ దక్కించుకున్నారట. త్వరలోనే తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఈ సినిమాను రీమేక్‌ చేయబోతున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో ధనుష్ మంచి యాక్షన్ ప్యాక్డ్‌ రోల్‌లో నటించి మెప్పించాడు. ఈ సినిమాను చూసిన బెల్లంకొండ శ్రీనివాస్ ఫిదా అయిపోయాడట. వెంటనే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. త్వరలోనే ఈ రీమేక్‌కు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తమిళంలో 'కర్ణన్‌' చిత్రాన్ని మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మించారు.

More News

రానా మరో పాన్ ఇండియా సినిమా

'లీడర్', 'కృష్ణంవందే జగద్గురుమ్', 'బాహుబలి', 'ఘాజీ', 'నేనే రాజు నేనే మంత్రి' - కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన కథలు, విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకొనే కథానాయకుడు రానా దగ్గుబాటి.

కొవిడ్‌ వచ్చిన విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు?: ఏపీ హైకోర్టు ఫైర్

ఓవైపు కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాలు పదో తరగతితో పాటు ఇంటర్ పరీక్షలను రద్దు చేయడమో లేదంటే వాయిదా

తప్పుడు కేసు పెట్టారు.. ప్రాపర్ డీటైల్స్‌తో వస్తా: యాంకర్ శ్యామల భర్త

ప్రముఖ యాంకర్, బిగ్‌బాస్ ఫేం శ్యామల భర్త నర్సింహారెడ్డి తనపై నమోదైన చీటింగ్ కేసు విషయమై తాజాగా స్పందించాడు.

తెలంగాణలో కొత్తగా 7,646 మందికి కరోనా..

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. 7 వేలకు పైగా కేసులు నమోదవుతూ ఆందోళనకు గురి చేస్తోంది.

మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ ఇక లేరు..

మాజీ అటార్నీ జనరల్ సోలి సోరాబ్జీ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.