బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ

  • IndiaGlitz, [Friday,November 27 2020]

టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. కొన్ని రోజులుగా బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీపై సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల‌ను నిజం చేస్తూ చిత్ర యూనిట్ అధికారిక ప్ర‌క‌ట‌న‌ను వెలువ‌రిచారు. తెలుగులో స్టార్ హీరో ప్ర‌భాస్‌ను మాస్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర చేసిన మూవీ ‘ఛ‌త్ర‌ప‌తి’ని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. శ్రీనివాస్‌ను తెలుగు ప్రేక్ష‌కులకు ‘అల్లుడు శీను’ సినిమాతో ప‌రిచ‌యం చేసిన డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్‌.. బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారు. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే.. వినాయ‌క్‌కు కూడా ఇదే బాలీవుడ్ డెబ్యూ మూవీ.

ద‌ర్శ‌కధీరుడు తెర‌కెక్కించిన ఛ‌త్ర‌ప‌తి సినిమాను వినాయ‌క్ ఎలా ప్రెజంట్ చేస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై జ‌యంతి లాల్ గ‌డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టుల గురించి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. మ‌ద‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధాన పాయింట్‌గా స‌ముద్ర తీర ప్రాంతంలో దందా చేసే ఓ మాఫియా చేతిలో చిక్కుకున్న యువ‌కుడు డాన్ రేంజ్‌కు ఎలా ఎదిగాడు.. ఆ క్ర‌మంలో దూర‌మైన త‌న త‌ల్లి ప్రేమ‌ను ఎలా ద‌క్కించుకున్నాడ‌నే క‌థాంశ‌మే ఇది. ఈ సినిమాను వినాయ‌క్ ఎలా తెర‌కెక్కిస్తాడ‌నేది అంద‌రిలో తెలియ‌ని ఓ ఆస‌క్తిని రేపుతోంది.

More News

అదరగొట్టేసిన అఖిల్, సొహైల్...

ఓపెనింగే.. హారిక.. అభి ఫీల్ అయిన విషయాన్ని మోనాల్‌కు చెప్పింది. గతంలో తనకు.. అభికి మధ్య జరిగిందంతా హారికకు మోనాల్ చెప్పింది.

ప‌దేళ్ల త‌ర్వాత సునీల్‌తో జోడీ క‌డుతున్న హీరోయిన్‌

క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన సునీల్‌కు అందాల రాముడు, పూల‌రండు, మ‌ర్యాద‌రామ‌న్న వంటి రెండు, మూడు త‌ప్ప చెప్పుకునేంత విజ‌యాలు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా మారిపోయాడు.

ఆ విషయం సీఎం కేసీఆరే బయటపెట్టాలి: కిషన్ రెడ్డి

కొన్ని అరాచక శక్తులు తెలంగాణలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నాయంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై

జీహెచ్ఎంసీ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టో విడుదల..

గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ నేడు విడుదల చేసింది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు.

రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..

తమిళనాడులో భారీగా డ్రగ్స్ పట్టుబడిన ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దాదాపు రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్‌‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.