భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న బెల్లంకొండ?

  • IndiaGlitz, [Saturday,October 12 2019]

హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఐదేళ్ల పాటు భారీ సినిమాలే చేశాడు. స‌క్సెస్ రాక‌పోయిన‌ప్ప‌టికీ గుర్తింపు మాత్రం బాగానే ద‌క్కింది. ఐదేళ్ల త‌ర్వాత ఈ యువ హీరో కాన్సెప్ట్‌ను న‌మ్ముకుని చేసిన సినిమా 'రాక్ష‌సుడు'తో భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో శ్రీనివాస్ త‌దుప‌రి సినిమాల‌పై చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలో ఈ హీరో భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్నాడ‌ని టాక్‌.

రీసెంట్‌గా ఓ డైరెక్ట‌ర్ సాయి శ్రీనివాస్‌ను క‌లిసి క‌థ‌ను చెబితే 10 కోట్ల రూపాయ‌లు డిమాండ్ చేశాడ‌ట. అందుకు కార‌ణం ఈ హీరోకి హిందీ యూ ట్యూబ్ మార్కెట్ 6-7 కోట్ల రూపాయ‌లే ఉంద‌ట‌. ఇక థియేట్రిక‌ల్ రైట్స్ 4-5 కోట్ల రూపాయ‌ల‌ను తీసుకున్నా సేఫ్ బిజినెస్ అవుతుంద‌ట‌. అయితే అంత వ‌ర‌కు బాగానే ఉన్నా... సాయిశ్రీనివాస్‌కు అంత భారీ రెమ్యున‌రేష‌న్ అంటేనే నిర్మాత‌లు ఆలోచ‌న‌లో ప‌డ‌తారు. 5-6 కోట్ల రెమ్యున‌రేష‌న్ అనుకుంటే స‌రిపోతుంది. ఈ హీరోకి మంచి డిమాండ్ కూడా ఏర్ప‌డుతుంద‌ని టాక్‌.

More News

'వనవాసం' అక్టోబర్ 25న విడుదల

నవీన్ రాజ్ శంకరాపు , శశి కాంత్, బందెల కరుణ శ్రావ్య, శృతి, హీరో హీరోయిన్లు గా పరిచయం అవుతున్న చిత్రం "వనవాసం".

'RRR' లో అజయ్ దేవగణ్ పాత్ర ఇదే ?

ద‌ర్శ‌క ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న చిత్రం `RRR`. టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌,

మాస్ డైరెక్ట‌ర్‌తో ర‌జ‌నీ?

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త‌దుప‌రి చిత్రం ఖ‌రారైన‌ట్లు కోలీవుడ్‌లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

మందు వ‌ల్ల అనారోగ్యానికి గురయ్యాను : శ్రుతి హాస‌న్‌

స్టార్ హీరోయిన్‌గా ఇటు తెలుగు, త‌మిళంతో పాటు అటు బాలీవుడ్‌లోనూ వ‌రుస సినిమాల్లో న‌టించిన శ్రుతిహాస‌న్ కొంత‌కాలం సినిమాల‌కు దూరంగా ఉండిపోయింది. లండ‌న్‌కు చెందిన మైకేల్‌తో ప్రేమాయ‌ణం నెరిపింది.

స‌మంత‌, రానాకు సాయిప‌ల్ల‌వి ఛాలెంజ్‌

స‌మంత అక్కినేని, రానాద‌గ్గుబాటికి హీరోయిన్ సాయిప‌ల్ల‌వి ఛాలెంజ్ చేశారు. ఇంత‌కు సాయిప‌ల్ల‌వి ఏ విష‌యంలో వీరిద్ద‌రికీ ఛాలెంజ్ చేశారో తెలుసా? గ‌్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్య‌క్ర‌మంలో...