close
Choose your channels

హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ రీమేక్.. హీరో ఎవరంటే!

Wednesday, August 4, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ రీమేక్.. హీరో ఎవరంటే!

సైకో థ్రిల్లర్ గా తెరకెక్కిన రాక్షసుడు చిత్రం మంచి విజయం సాధించింది. క్రైమ్, అద్భుతమైన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం ఆధ్యంతం ప్రేక్షకులని ఆకట్టుకుంది. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు.

ఇదీ చదవండి: 'RRR'కి ముందు రాజమౌళి పరిశీలించిన కాంబినేషన్స్ ఇవే.. అలియా ప్రతి సీన్ లో..

సైకోగా మారిన ఓ విచిత్రమైన వ్యక్తి అమ్మాయిలని అంతుచిక్కని విధంగా కిడ్నాప్ చేసి, అతి కిరాతంగా హత్య చేస్తుంటాడు. పోలీసులని ముప్పుతిప్పలు పెడుతుంటాడు. ఆ సైకోని హీరో ఎలా అంతమొందించాడు అనేదే ఈ చిత్ర కథ.

ప్రేక్షకులకు ఈ చిత్రం అద్భుతమైన థ్రిల్ అందించడంతో మంచి విజయం సాధించింది. రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. తమిళంలో విజయం సాధించిన రాక్షసన్ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రానికి కోనేరు సత్యనారాయణ నిర్మాత. ఇటీవల ఈ మూవీకి సీక్వెల్ గా రాక్షసుడు 2 ప్రకటించారు. రమేష్ వర్మ దర్శకత్వంలోనే సీక్వెల్ ని 100 కోట్ల బడ్జెట్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు.

హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ రీమేక్.. హీరో ఎవరంటే!

ఇదిలా ఉండగా రాక్షసుడు చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. బాలీవుడ్ క్రేజీ హీరో అక్షయ్ కుమార్ రీమేక్ లో హీరోగా నటించబోతున్నాడు. ఆసక్తికర అంశం ఏమిటంటే హిందీ రీమేక్ కూడా రమేష్ వర్మ దర్శకత్వంలోనే తెరకెక్కనుంది. బాలీవుడ్ లో అవకాశం రావడంతో దర్శకుడు రమేష్ వర్మ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ రీమేక్.. హీరో ఎవరంటే!

తన డెబ్యూ చిత్రంతోనే అక్షయ్ కుమార్ లాంటి హీరోని డైరెక్ట్ చేయనుండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాక్షసుడు పెద్ద హిట్. దీనితో అక్షయ్ కుమార్ సినిమాపై అంచనాలు ఇంకా పెరుగుతాయి. ఆయనతో మ్యాజిక్ చేసేందుకు రెడీగా ఉన్నా. త్వరలోనే స్క్రిప్ట్ పై వర్క్ మొదలు పెడతాం అని అక్షయ్ అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.