నితిన్ ప్లేస్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌

  • IndiaGlitz, [Friday,January 04 2019]

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన 'రాక్ష‌స‌న్' సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో హీరో నితిన్ రీమేక్ చేయ‌డానికి హ‌క్కుల‌ను సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు నితిన్ చేతుల నుండి ఆ ప్రాజెక్ట్ చేతులు మారింద‌ట‌. వివ‌రాల ప్ర‌కారం ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఈ రీమేక్‌లో నటించే అవ‌కాశాలున్నాయి. తేజ, శ్రీనివాస్ సినిమా పూర్తి కావ‌చ్చింది.

ఇది పూర్తి కాగానే.. శ్రీనివాస్ అనీల్ సుంక‌ర‌, వంశీకృష్ణతో క‌లిసి టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు బ‌యోపిక్‌లో న‌టించ‌బోతున్నాడు. అలాగే మ‌రో వైపు అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా, ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్నాట్ట‌. మ‌రి ఈ గ్యాప్‌లో రీమేక్‌లో ఎప్పుడు న‌టిస్తాడో తెలియ‌దు. లేదా ర‌మేష్ వ‌ర్మ‌, అజ‌య్ భూప‌తిల్లో ఎవ‌రైనా ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తారో తెలియ‌దు. త్వ‌ర‌లోనే స‌మాచారం వెలువ‌డ‌నుంది.