close
Choose your channels

బెల్లంకొండ హీరో మ‌రో రెండు సినిమాలు...

Monday, September 10, 2018 • తెలుగు Comments

బెల్లంకొండ హీరో మ‌రో రెండు సినిమాలు...

కెరీర్‌లో వినాయ‌క్‌, భీమ‌నేని శ్రీనివాస్‌, శ్రీవాస్ వంటి స్టార్ డైరెక్ట‌ర్స్‌, సీనియ‌ర్ డైరెక్ట‌ర్స్‌తో ప‌నిచేసిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒక‌టి తేజ ద‌ర్శ‌క‌త్వంలో అనిల్ సుంక‌ర నిర్మాణంలో చేస్తున్నారు.

కాగా మ‌రో చిత్రం శ్రీనివాస్ అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో చేస్తున్నారు. న‌వీన్ సొంఠినేని నిర్మాత‌. ఈ రెండు సినిమాల్లో కాజ‌ల్ అగ‌ర్వాల్ మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ఈ సినిమాలు కాకుండా మ‌రో రెండు సినిమాలు కూడా బెల్లంకొండ శ్రీనివాస్ చేయ‌బోతున్నారు. అందులో ఒక‌టి స్టార్ డైరెక్ట‌ర్‌తో చేయ‌నుండ‌గా.. మ‌రో సినిమాను డెబ్యూ డైరెక్ట‌ర్‌తో చేస్తాడ‌ట‌.