'బెంగాల్ టైగర్' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Monday,October 19 2015]

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై రవితేజ, తమన్నా, రాశిఖన్నా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం బెంగాల్‌టైగర్‌'. సంపత్‌నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని శ్పికళావేదికలో జరిగింది. థియేట్రికల్‌ట్రైలర్‌ను తమన్నా విడుదల చేశారు. బిగ్‌ సీడీని బోమన్‌ ఇరాని ఆవిష్కరించారు. ఆడియో సీడీలను కె.కె.రాధామోహన్‌ విడుద చేశారు. ఈ సందర్భంగా...

మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ ఎప్పుడూ నా నిర్మాతలకు బాగుండాలని కోరుకుంటాను. అలాగే ఈ సినిమా పెద్ద హిట్టయి నిర్మాత రాధామోహన్‌కు మంచి పేరు, లాభాలు రావాలి. భీమ్స్ లో చాలా విషయం ఉంది. తనకి మంచి ఫ్యూచర్‌ ఉంది. తనకి మంచి మ్యూజిక్‌ నాలెడ్జ్‌ ఉంది. తనతో కలిసి చాలా సినిమాకు పనిచేయానుంది. తమన్నా, రాశిఖన్నాతో మంచి డేడికేషన్ ఉన్న హీరోయిన్స్. వారితో మళ్ళీ మళ్లీ పనిచేయానుకుంటున్నాను. దర్శకుడు సంపత్‌ నంది బెంగాల్ టైగర్ తో హ్యట్రిక్‌ హిట్‌ కొడతాడు. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌'' అన్నారు.

డైరెక్టర్ సంపత్‌నంది మాట్లాడుతూ భీమ్స్‌ అంటే నిన్నటి వరకు నాకు మాత్రమే తెలుసు. రేపటి నుండి ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది. అంత మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. రవితేజ ఎనర్జీ గురించి చెప్పాంటే నాకు మాటు సరిపోవు. సింగిల్‌ సిటింగ్‌లోనే కథను ఓకే చేశారు. ఆయన మనసున్న బంగారుకొండ. నాకు ఆకలేసినప్పుడు అన్నం పెట్టిన వ్యక్తి. రాధామోహన్‌గారు నన్ను డైరెక్టర్‌ చేశారు. ఆయన ఈ సినిమాతో మరింత పెద్ద నిర్మాత అవుతారు. ఈ చిత్రంతో రవితేజగారి నాపై ఉంచిన నమ్మకాన్ని నిబెట్టుకుంటాను. రవితేజ ఫ్యాన్స్‌ను థౌజండ్‌ టైమ్స్‌ శాటిస్ఫై చేసే సినిమా అవుతుంది'' అన్నారు.

నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ 2007 నుండి సంపత్‌తో మంచి పరిచయం ఉంది. ఏమైంది ఈవేళ సినిమాతో తనని డైరెక్టర్ ను చేశాను. అలాగే బెంగాల్ టైగర్ సినిమాకు సంపత్ మంచి కథను అందించడమే కాకుండా అద్భుతంగా డైరెక్ట్‌ చేశాడు. తమన్నా సినిమా చేయాని అడగ్గానే వెంటనే ఒప్పుకుంది. అలాగే రాశిఖన్నా, అక్ష, హంసానందిని అందరికీ థాంక్స్‌. భీమ్స్‌ మంచి టాలెంటెడ్‌. తనకు నేను ఇచ్చిన చిన్న సపోర్ట్‌తో నేను అందించిన సపోర్ట్‌కు మూడు రెట్లు మంచి సంగీతాన్నందించాడు. ఫ్యూచర్‌లో ఇంకా పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవుతాడు. సౌందర్‌రాజన్‌ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్‌, ప్రతి ఒక ఆర్టిస్ట్‌, టెక్నిషియన్‌ తమ సినిమాగా భావించి చేశారు. అందరికీ థాంక్స్‌'' అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్‌ మాట్లాడుతూ సినిమా ఫీల్డ్ లో ఏం సంపాదించావ్‌..రా అన్నానంటే ఏం లేదంటాను కానీ, ఏం సాధించావ్‌..రా అని అడిగితే మాత్రం మాస్‌ మాహారాజా రవితేజతో సినిమా చేశానని చెబుతాను. ఈ రోజు ఇక్కడ మాట్లాడటానికి చాలా ఎమోషనల్‌గా ఫీవుతున్నాను. నాకు తండ్రి, స్నేహితుడు అన్నీ సంపత్‌ నంది. ఆయన మాటపై నమ్మకంతో ఏమీ అడగకుండా మ్యూజిక్‌ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. నిర్మాత రాధామోహన్‌గారు ఫుల్‌ సపోర్ట్‌ చేశారు. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

బోమన్‌ ఇరాని మాట్లాడుతూ బెంగాల్ టైగర్ సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది. తన ఫ్యాన్స్ ను సంతోషపెట్టానే రవితేజగారు ఆలోచిస్తుంటారు. ఆ ఆలోచన నుండే తనకి ఎనర్జీ వస్తుంది. రాధామోహన్‌గారి సపోర్ట్‌ మరచిపోలేను. భీమ్స్‌ ఎక్సలెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు.

తమన్నా మాట్లాడుతూ భీమ్స్‌ మంచి సంగీతాన్నందించాడు. సినిమాని తన మ్యూజిక్‌తో మరో లెవల్‌కి తీసుకెళ్ళారు. సంపత్‌ కథను అద్భుతంగా నెరేట్‌ చేస్తారు. చాలా మంచి వ్యక్తి. ఇంకా గొప్ప దర్శకుడవుతారు. రవితేజగారితో పనిచేయాని ఎప్పట్నుంచో కోరుకుంటున్నాను. ఈ సినిమాకు ఆ క నేరవేరింది. ఏ సీన్‌ చేసినా లీనమైపోతారు. ఆయనతో మళ్ళీ పనిచేయానుకుంటున్నాను. నిర్మాత రాధామోహన్‌గారు ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. సౌందర్‌రాజన్‌గారు ఎక్సలెంట్‌ సినిమాటోగ్రఫీ ఇచ్చారు. ప్రతి ఒక టెక్నిషియన్‌ మంచి అవుట్‌పుట్‌ ఇచ్చారు. ఆడియో, సినిమాని పెద్ద హిట్‌ అవుతుంది'' అన్నారు.

రాశిఖన్నా మాట్లాడుతూ సినిమాలో మంచి క్యారెక్టర్‌ చేశాను. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతకు థాంక్స్‌'' అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ఆడియో ,సినిమా పెద్ద హిట్‌ కావాలని చిత్రయూనిట్‌ను అభినందించారు.

బోమన్‌ ఇరాని, బ్రహ్మానందం, రావు రమేష్‌, షాయాజీ షిండే, నాజర్‌, పోసాని కృష్ణమురళి, తనికెళ్ళ భరణి, హర్షవర్ధన్‌ రానే, సురేఖా వాణి, అక్ష, శ్యామ, ప్రియ, ప్రభు, ప్రగతి, నాగినీడు, ప్రభ, రమాప్రభ ఇతర తారాగణంగా నటించారు.

ఈ చిత్రానికి కెమెరా: సౌందర్‌రాజన్‌, ఎడిటర్‌: గౌతంరాజు, ఆర్ట్‌: డి.వై.సత్యనారాయణ, ఫైట్స్‌: రామ్‌'క్ష్మణ్‌, సంగీతం: భీమ్స్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, మాటు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్‌నంది.

More News

త్రివిక్రమ్ బ్రేక్ వేస్తాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా యువ కథానాయకుడు నితిన్ కి టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది.

సమంత.. రెండు హ్యాట్రిక్ ముచ్చట్లు

ఈ జనరేషన్ లో సక్సెస్ రేట్ ని బాగా మెయిన్ టెయిన్ చేసిన నాయిక సమంత.అందుకే అటు టాప్ డైరెక్టర్లు,ఇటు టాప్ స్టార్స్ ఆమెతో మళ్లీ మళ్లీ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతారు.

'మేము' ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సూర్య

‘పసంగ,మెరీనా,కేడి బిల్లా-కిలాడి రంగా’వంటి బ్లాక్బస్టర్స్ తో ‘స్టార్ డైరెక్టర్’ఇమేజ్ సొంతం చేసుకొన్న పాండీరాజ్ దర్శకత్వంలో..తమిళ సూపర్ స్టార్ సూర్య నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం‘పసంగ-2.

నన్ను మించిన మాస్ డైరెక్టర్ ఉన్నాడా...

గమ్యం చిత్రంతో దర్శకుడిగా పరిచయమై...వేదం,క్రిష్ణం వందేజగద్గురుమ్..చిత్రాలతో మంచి సినిమాల దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ క్రిష్.

ర‌వితేజ ఎన్నాళ్లెన్నాళ్ల‌కు

మాస్ ప్రేక్ష‌కుల‌కు కిక్ ఎక్కించే అంశాల్లో ఒక‌టి ఏమిటంటే.. ఇద్ద‌రు హీరోయిన్స్‌తో క‌లిసి మ‌న హీరో మాంచి హుషారైన సాంగేసుకోవ‌డం. ఇప్పుడు ఇదే ఫార్ములాని మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ కూడా అప్ల‌య్ చేస్తున్నాడు