టెన్ష‌న్ లో బెంగాల్ టైగ‌ర్

  • IndiaGlitz, [Friday,October 30 2015]

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం బెంగాల్ టైగ‌ర్. ఈ చిత్రాన్ని సంప‌త్ నంది తెర‌కెక్కించారు. శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్ పై కె.కె.రాథామోహ‌న్ ఈ సినిమాని నిర్మించారు.ర‌వితేజ‌ స‌ర‌స‌న త‌మ‌న్నా, రాశి ఖ‌న్నా న‌టించారు. కిక్ 2 తో విజ‌యం సాధించ‌లేక‌పోయిన ర‌వితేజ బెంగాల్ టైగ‌ర్ తో ఎలాగైనా స‌రే విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌లతో ఉన్నాడ‌ట‌. అయితే న‌వంబ‌ర్ 5న బెంగాల్ టైగ‌ర్ ను రిలీజ్ చేయాల‌నుకున్నారు.

కానీ..అఖిల్ మూవీ న‌వంబ‌ర్ 11న రిలీజ్ అవుతుండ‌డంతో బెంగాల్ టైగ‌ర్ వాయిదా వేసారట‌. దీంతో కాస్త టెన్ష‌న్ ప‌డుతున్నాడ‌ట మాస్ రాజా ర‌వితేజ అలాగే సినిమా రిలీజ్ కి చాలా టైం ఉండ‌డంతో బెంగాల్ టైగ‌ర్ కి రిపేర్లు చేస్తున్నార‌ట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ మూవీని న‌వంబ‌ర్ 27న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్.