close
Choose your channels

రామ్ కెరీర్‌లోనే బెస్ట్‌

Sunday, July 21, 2019 • తెలుగు Comments

రామ్ కెరీర్‌లోనే బెస్ట్‌

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ మూవీ `ఇస్మార్ట్ శంక‌ర్‌`. ఈ సినిమాకు ముందు వ‌ర‌కు క్లాస్ ఇమేజ్‌తోనే మెప్పించిన రామ్ తొలిసారి ప‌క్కా మాస్ ఇమేజ్‌తో ఆకట్టుకున్న చిత్ర‌మిది. హీరోల‌ను మాస్ యాంగిల్‌లో చూపించే డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌డంతో పాటు ఛార్మితో క‌లిసి నిర్మించారు. ఈ గురువారం(జూలై 18)న విడుద‌లైన ఈసినిమా మూడురోజుల్లోనే 36 కోట్ల‌ను వ‌సూలు చేసింది. ఇది గ్రాస్ క‌లెక్ష‌న్స్‌... కాగా షేర్ క‌లెక్ష‌న్స్ 16.73 కోట్ల రూపాయ‌లు అని ట్రేడ్ వ‌ర్గాల అని అంచ‌నా. ఇది రామ్ కెరీర్‌లోనే అతి పెద్ద క‌లెక్ష‌న్స్. పూరీకి కూడా టెంప‌ర్ త‌ర్వాత ద‌క్కిన భారీ హిట్‌. 

Get Breaking News Alerts From IndiaGlitz