close
Choose your channels

ఆ స్టార్ డైరెక్ట‌ర్స్ క‌థ‌ల‌ను దొంగ‌లిస్తారట‌!!

Monday, January 6, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆ స్టార్ డైరెక్ట‌ర్స్ క‌థ‌ల‌ను దొంగ‌లిస్తారట‌!!

కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్స్‌గా పేరున్న వారిలో ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ఒక‌రు కాగా.. మ‌రొక‌రు అట్లీ. వీరిద్ద‌రిపై ఓ అప‌వాదు ఉంది. అదేంటంటే వీరిద్ద‌రూ క‌థ‌ల‌ను కొట్టేస్తార‌ని. ఈ విష‌యంపై ఆరోప‌ణ‌లు చేస్తుంది ఎవ‌రో కాదు.. ర‌చ‌యితల సంఘం అధ్య‌క్షుడిగా చెప్పుకుంటున్న సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కె.భాగ్య‌రాజా. ఈయన త‌న‌కు కుదిరిన‌ప్పుడ‌ల్లా వీరిద్ద‌రి సినిమా క‌థ‌ల‌పై ఆరోప‌ణ‌లు చేస్తూనే ఉంటారు. తాజాగా ఓ పుస్తకావిష్క‌ర‌ణ స‌భ‌లో ఆయ‌న త‌న‌దైన శైళిలో విమ‌ర్శ‌లు చేశారు. కొంద‌రు ద‌ర్శ‌కులు గొప్ప గొప్ప క‌థ‌ల‌తో సినిమాలు చేస్తారు. కానీ అవి వారి క‌థ‌లు కావు. వారి క‌థ‌లే అన‌డానికి ఆధారాలు కూడా లేవు. ఆ క‌థ‌ల‌పై నాకు ఫిర్యాదులు కూడా అందాయి. వాటి గురించి హెచ్చరించినా కూడా ఎవ‌రు ప‌ట్టించుకోవ‌డం లేదు.

కొత్త‌గా ఆలోచించేవారే ఇండ‌స్ట్రీలోకి రావాలి. లేకుంటే క‌థ‌ల చౌర్యం జ‌రుగుతాయి. ఇద్ద‌రినీ ప‌క్క ప‌క్క‌న కూర్చోపెట్టి మాట్లాడినా కూడా ఆ క‌థ త‌మ‌ది కాద‌ని వారు ఒప్పుకోవ‌డం లేదు. ఇద్ద‌రూ ఒకేలా ఆలోచిస్తార‌ని అనుకుందాం. అయితే మీకంటే ముందే ఆ క‌థ రిజిష్ట‌ర్ చేయించార‌ని అంటే కూడా..నాకేంటి సంబంధం అన్న‌ట్లు చూస్తారు. అలా ఉండేవారిని ఏమ‌నాలి అంటూ భాగ్య‌రాజా ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.