close
Choose your channels

ఆధ్యాత్మిక సౌరభం.. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 14 వరకూ భక్తి టీవీ కోటి దీపోత్సవం

Monday, October 10, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆధ్యాత్మిక సౌరభం.. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 14 వరకూ భక్తి టీవీ కోటి దీపోత్సవం

అజ్ఞానాంధకారాన్ని తొలగించి, ప్రపంచానికి వెలుగునిచ్చే దీపాన్ని ఆరాధించడమే భారతీయ ఆధ్యాత్మికత గొప్పదనం. భక్తి టీవీ కోటి దీపోత్సవం గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎంతో ప‌విత్రమైన కార్తీక మాసంలో నిర్వహించే ఈ మహాకార్యానికి ఎంతటి పేరుందో తెలుగు ప్రజలకు తెలియనిది కాదు.కార్తీకమాసం అనగానే శివార్చన, అభిషేకాలు మాదిరిగానే కోటి దీపోత్సవం గుర్తొచ్చేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఎన్టీవీ అధినేత న‌రేంద్ర చౌద‌రి ,ఈ భక్తి కార్యాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఒక యజ్ఞంలా దశాబ్ద కాలంగా కొనసాగిస్తున్నారు.తెలుగు రాష్ట్రాలే కాదు ...దేశం నలు మూలల నుంచి ప్రజలు..ప్రముఖ స్వామిజీ లు ఈ వేడుకల్లో పాల్గొంటారు.దీనికి ఏటేటా భక్తుల ఆదరణ పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. ఒక్కసారి అక్కడ పాదం మోపితే ఇల కైలాసానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. వేడుకలు జరిగినన్ని రోజులు నిత్యం ఆ మహాదేవునికి ఇష్టమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు భక్త జనాన్ని ఆకట్టుకుంటాయి.

కార్తీకమాసంలో కొండల మీద నుంచి దివ్వెలు దిగివస్తాయి. కోటిదీపోత్సవంలో దీపశిఖలు రెపలాడుతూ కోటికాంతులను పంచుతాయి. ప్రదోష వేళ మహాదేవునికి ప్రీతికరమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీదేవతల కల్యాణాలు, విశేష పూజల వంటివి ఎన్నో భక్తుల మనసులను భక్తిపారశ్యంలో మునకలు వేయిస్తాయి.

ఈ ఏడాది ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తిటీవీ కోటిదీపోత్సవం ఈ నెల 31 నుంచి నవంబరు 14 వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. తొలిసారిగా 2012లో లక్ష దీపాలతో ప్రారంభమైన ఈ భక్తి దీపం 2013 నుంచి ఆధ్యాత్మిక ప్రపంచంలో అప్రతిహాతంగా వెలుగుతూనే ఉంది. భక్తి టీవీ యాజమాన్యం అత్యంత భక్తిప్రవత్తులతో నిరాటంకంగా ఈ మహోత్సవాన్ని కొనసాగిస్తోంది.

శరీరంతో కైలాస దర్శనం కుదరదు.. కానీ కోటిదీపోత్సవాన్ని తిలకించిన వారికి కైలాస దర్శన కలిగిన భావన కలుగుతుంది. కార్తీక మాసాన ఇలలో కైలాస దర్శనం చేయాలంటే కోటిదీపోత్సవం వేడుకలకు వెళ్లాల్సిందే అనేది భక్తుల మాట. కోటిదీపోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రసిద్ద జగద్గురువులు, పీఠాధిపతులు తరలివస్తారు. ఆశీర్వచనపూర్వకంగా అనుగ్రహభాషణం చేస్తారు. ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా ప్రసిద్ధ పీఠాధిపతులు, జగద్గురువులు తరలివస్తున్నారు.

కోటి దీపోత్సవ వేడుకలు ఆద్యంతం ఆధ్యాత్మిక భావనతో అలరారుతాయి. వేడుకలు జరిగే పక్షం రోజులు ..జయ జయ శంకర...శివ శివ శంకర ..హర హర మహాదేవ ..శంభో శంకర అంటూ హైదరాబాద్‌ ఎన్టీయార్‌ స్టేడియం మార్మోగుతుంది. ఆద్యంతం వేలాది మంది భక్తుల కరతాళ ధ్వనులు మిన్నంటుతాయి.

కోటిదీపోత్సవం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు. ఇందిలో పాల్గొనే ప్రతీ భక్తుడికి ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు పదిలపర్చుకునే మహాపర్వం. కూర్చున్నచోటు నుంచే మహాదేవునికి జరిగే సహస్రకలశాఖి షేకాన్ని వీక్షించవచ్చు. శివలింగానికి స్వయంగా బిల్వార్భనలు చేయవచ్చు. భస్మంతో అభి షేకించవచ్చు. రుద్రాక్షలతో పూజించవచ్చు. పసుపుకొమ్ములతో అమ్మవారిని ఆరాధించవచ్చు. సౌభాగ్యం కోసం అమ్మవార్లకు కోటి కుంకుమార్చన చేయవచ్చు.దేవతల కల్యాణాన్ని చేయించినా... వీక్షించినా మహాపుణ్యప్రదమని అంటారు. ఈ రెండు అదృష్టాలు భక్తిటీవీ కోటిదీపోత్సవంలో కలుగుతాయి.

న్యూస్ చానల్స్ కి సరికొత్త నిర్వచనం గా ఎన్టీవీ అయితే.. అసలు ఆధ్యాత్మిక ఛానల్ అనే ఆలోచనకే అంకురమైందిభక్తి టీవీ. ఇప్పుడు ఎన్టీవీ తెలుగులో నెంబర్ వన్ ఛానల్ గా కొనసాగుతోంది. ఏ బాధ్యతతో, ఏ కట్టుబాటుతో ప్రయాణాన్ని ప్రారంభించిందో నేటీ ఆ నిబద్ధతను మరవలేదు. పీఠాలను పీఠాధిపతులను ధర్మకర్తలను ఇలా ఎంతోమందిని కోటి దీపోత్సవం పేరుతో సామాన్యులకు చేరువ చేసింది. మరోసారి ఆ వేడుకలను చూసి తరిద్దాం!!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.