'భరత్ అనే నేను' ... షూటింగ్ అప్ డేట్స్

  • IndiaGlitz, [Tuesday,February 06 2018]

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం భరత్ అనే నేను'. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల క్లైమాక్స్ కి సంబంధించిన పోరాట సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఈ నెల 10 వరకు రామోజీ ఫిలిం సిటీలో మరికొన్ని సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. మిగిలిన నాలుగు పాటలలో...పూణేలో ఒక పాటను, హైదరాబాద్‌లో రెండు పాటలను ఈ నెలాఖరు కల్లా చిత్రీకరించనున్నట్టు సమాచారం.

ఇక మిగిలిన పాటను, కీలక సన్నివేశాలను షూట్ చేయడం కోసం విదేశాలకు వెళ్లనుంది చిత్ర బృందం. అక్కడ 16 రోజుల పాటు సాగే చిత్రీకరణతో సినిమాకి సంబంధించి షూటింగ్ పార్ట్ ముగుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వాని కథానాయికగా నటిస్తోంది. శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, దేవరాజ్, ఆమని, సితార, రమాప్రభ, పోసాని, దేవదాస్ కనకాల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మహేష్, కొరటాల కాంబినేషన్‌లో వ‌చ్చిన గ‌త చిత్రం శ్రీమంతుడు' ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 27న విడుదల కానుంది.

More News

నాని సినిమాతో పూర్తిస్థాయి విలన్ గా..

నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం 'కృష్ణార్జునయుద్ధం'.

15 ఏనుగులతో రానా సందడి

విభిన్నమైన కథలతో...భిన్నమైన నటనతో ఇండస్ట్రీని,ప్రేక్షకులని తనవైపు తిప్పుకున్న యువ నటుడు దగ్గుబాటి రానా.

ఐటమ్ సాంగ్ పనిలో 'రంగస్థలం'

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,అందాల తార సమంత జంటగా నటిస్తున్న చిత్రం 'రంగస్థలం'.

'ఇంటిలిజెంట్ ' సెన్సార్ పూర్తి - ఫిబ్రవరి 9 విడుదల

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్గా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో

నితిన్ - పవన్ కళ్యాణ్ చిత్రం రిలీజ్ డేట్

'నితిన్,మేఘా ఆకాష్'జంటగా శ్రేష్ట్ మూవీస్,పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఒక్క పాట మినహా పూర్తయింది.