అది ఫేక్ న్యూస్.. నమ్మకండి: భారత్ బయోటెక్

  • IndiaGlitz, [Saturday,July 04 2020]

ప్రముఖులకు సంబంధించిన ఫోటో కనిపిస్తే చాలు.. దాని పూర్వాపరాలు తెలుసుకోకుండా.. ఆ ఫోటో చుట్టూ ఓ కథ అల్లేసి వైరల్ చేయడం సోషల్ మీడియాలో పరిపాటిగా మారిపోయింది. భారత్ బయోటెక్ సంస్థ ఉపాధ్యక్షుడి విషయంలోనూ సోషల్ మీడియా ఇలాంటి అత్యుత్సాహాన్నే చూపించింది. భారత్ బయోటెక్ సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్ వీకే శ్రీనివాస్ చేతి నుంచి ఓ నర్స్ ఇంజెక్షన్ గుచ్చుతున్నట్టుగా ఉన్న ఓ ఫోటోను చూసి ఓ కథ అల్లేసి కొందరు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఇది చూసిన భారత్ బయోటిక్ సంస్థ వెంటనే వివరణ ఇచ్చింది.

అసలు విషయం ఏంటంటే.. భారత్ బయోటెక్ సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్ వీకే శ్రీనివాస్ చేతికి ఓ నర్సు ఇంజెక్షన్ గుచ్చుతున్నట్టుగా ఓ ఫోటో బయటకు వచ్చింది. ఇంకేముంది.. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా శ్రీనివాస్ కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగిపోయింది. దీంతో వెంటనే ఆ సంస్థ స్పందించి.. అది ఫేక్ న్యూస్ అని.. దానిని నమ్మవద్దని తెలిపింది. తమ ప్రొడక్షన్ స్టాఫ్‌కు నిత్యం వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటామని.. అందులో భాగంగానే శ్రీనివాస్‌కు రక్తం సేకరిస్తుండగా తీసిన ఫొటో మాత్రమేనని భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా.. కరోనా వ్యాక్సిన్‌ను ఆగస్ట్ 15 నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.

More News

ఏపీ కరోనా బులిటెన్ విడుదల..

ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. నేడు ఏపీలో మొత్తంగా 765 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

నాడు జగన్.. నేడు టీడీపీ నేతల్లో ‘శుక్రవారం’ టెన్షన్

కొద్ది రోజుల క్రితం వరకూ ఏపీ సీఎం జగన్‌ను పట్టుకున్న ‘శుక్రవారం’ టెన్షన్ ఇప్పుడు టీడీపీ నేతలను పట్టుకుందా?

‘ఆమె కథ’.. మొన్న నవ్యకు.. నేడు రవికృష్ణకూ కరోనా..

ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో బుల్లితెర షూటింగ్‌లు నిర్వహిస్తోంది. కరోనా గైడ్‌లైన్స్ పాటిస్తున్నప్పటికీ పలువురు మాత్రం కరోనా బారిన పడుతూనే ఉన్నారు.

బ్రేకింగ్: కరోనాతో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. క్రమక్రమంగా అది అన్ని రంగాలకూ వ్యాపిస్తోంది. సినీ ఇండస్ట్రీకి కూడా కరోనా వ్యాపించింది.

తెలంగాణలో మహిళా ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. వైద్యులతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు.