'భవంతి 108'

  • IndiaGlitz, [Monday,May 15 2017]

నలుగురు జంటలు అడవిలో దారితప్పి ఓ ఆసుపత్రికి వెళ్ళిన నేపథ్యంలో సాగే కథతో 'భవంతి 108' చిత్రం రూపొందింది. తోట కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్‌. పద్మిని, వి. వెంకటేశ్వరరావు నిర్మించారు. సోమవారంనాడు ఫిలింఛాంబర్‌లో ట్రైలర్‌ ప్రదర్శన జరిగింది.

అనంతరం చిత్ర సమర్పకులు ఎస్‌విఎన్‌. రావు మాట్లాడుతూ... కథ ప్రకారం మెదక్‌, గూడూరు ప్రాంతాల్లో చిత్రించాం. కొత్తవారైనా నటీనటులు బాగా నటించారు. ఆసుపత్రిలో దెయ్యాల్లా వుండే మనుషులు ఏం చేశారనేది ఆసక్తికరం. దర్శకుడు కృష్ణ చక్కగా తెరకెక్కించారు. ఈనెల 26న సినిమాను విడుదల చేయనున్నామని తెలిపారు.

సత్యారెడ్డి మాట్లాడుతూ... ట్రైలర్‌ క్వాలిటీగా వుంది. ఈ చిత్రాన్ని 50 థియేటర్లలో విడుదలచేయడం తొలి విజయంగా భావిస్తున్నాం. త్వరలో ఇతర భాషల్లోనూ విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలున్నారని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ... చిత్రంలోని క్లెమాక్స్‌ హైలైట్‌గా వుంటుంది. నాయిక అశ్లేష మాంత్రికుడి బారినుంచి ఎలా తప్పించుకున్నదనేది కథ సారాంశం. సిజి ఎఫెక్ట్స్‌ చిత్రానికి మరో ఆకర్షణగా వుంటాయని తెలిపారు.

ఇందులో నటించిన అశ్లేష, శిరీష, పావని, మేఘన, సంజయ్‌ మాట్లాడుతూ... చిత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

More News

వరంగల్ లో ఎస్ పి ఐ సినిమాస్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్ గ్రాండ్ లాంచ్

చైన్నైలో పేరు గాంచిన ఎస్ పి ఐ సినిమాస్ మల్టీప్లెక్స్ చైన్ తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించింది. తెలంగాణ రాష్ట్రంలో

డాన్సర్ పాత్రలో ఎన్టీఆర్

జనతా గ్యారేజ్ వంటి హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో

వెంకీ ప్లేస్ లో పవన్ కళ్యాణ్

బాలీవుడ్ సినిమా 'జాలీ ఎల్ఎల్ బి2' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారని అందుకు సన్నాహాలు జరుగుతున్నాయని

స్టార్ హీరో డ్రైవర్ పై కేసు..

స్టార్ హీరో అల్లుఅర్జున్ కారు డ్రైవర్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదైంది. వివరాల్లోకెళ్తే..అల్లుఅర్జున్ , శనివారం జూబ్లీహిల్స్లోని మొకాబాక్కు వెళ్ళారు.

స్వచ్ఛ బళ్ళారికి రాజమౌళి విరాళం...

కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారి మునిసిపాలిటీని స్వచ్ఛంగా మార్చడానికి ప్రభుత్వ జిల్లా అధికారి డా.వి.రామప్రశాత్ చేపట్టిన బృహత్తర ఉద్యమ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి,