close
Choose your channels

'భీష్మ' టీజర్ విడుదల

Sunday, January 12, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

భీష్మ టీజర్ విడుదల

నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం 'భీష్మ'. ఈ చిత్రం టీజర్ ఈరోజు ఉదయం విడుదల అయింది.

చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ...ఈ చిత్రం టీజర్ ను ఈరోజు విడుదల చేయటం జరిగింది. పూర్తి స్థాయి వినోద ప్రధానంగా ఈ చిత్రం 'భీష్మ'ఉంటుంది అనటానికి ఈ టీజర్ ఒక శాంపిల్ మాత్రమే. దానికి తగినట్లుగానే చిత్రం కధ,కధనాలు,సన్నివేశాలు,సంభాషణలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల. ఈ ఏడాది ఫిబ్రవరి లో చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.