భీమవరం టాకీస్ 'సైలెన్స్ ప్లీజ్'

  • IndiaGlitz, [Monday,February 11 2019]

బెంగళూర్ లోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని జీవితంలో జరిగిన ఓ సంఘటన స్ఫూర్తిగా తీసుకుని కన్నడలో రూపొంది ఘన విజయం సాధించిన థ్రిల్లర్ 'నిశ్శబ్ద-2'. ఈ చిత్రాన్ని తెలుగులో 'సైలెన్స్ ప్లీజ్' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో రూపేష్ శెట్టి, ఆరాధ్య శెట్టి హీరోహీరోయిన్లు. దేవరాజ్ కుమార్ దర్శకత్వం వహించారు. వల్లూరిపల్లి రమేష్ సమర్పణలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు.
మార్చ్ 1న, మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

చిత్ర నిర్మాత-భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. 'స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే టెరిఫిక్ థ్రిల్లర్ 'సైలెన్స్ ప్లీజ్'. అన్ని పనులు పూర్తయ్యాయి. మహాశివరాత్రికి భక్తులంతా మౌనవ్రతం పాటిస్తుంటారు కాబట్టి, మా 'సైలెన్స్ ప్లీజ్' చిత్రాన్ని ఆ రోజు విడుదల చేస్తున్నాం. 2018లో కన్నడలో ఘన విజయం సాధించిన చిత్రాల్లో ఒకటైన ఈ చిత్రం తెలుగులోనూ సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాం' అన్నారు!

అవినాష్, పెట్రోల్ ప్రసన్న ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి.. కెమెరా: వీనస్ మూర్తి, మ్యూజిక్: సతీష్ ఆర్యన్, సమర్పణ: వల్లూరిపల్లి రమేష్, నిర్మాత: తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శకత్వం: దేవరాజ్ కుమార్!!

More News

మోడీ నేను రెడీ.. ఢిల్లీ వేదికగా చంద్రబాబు ఛాలెంజ్

ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ప్రముఖులకు నివాళులు అర్పించిన అనంతరం ఏపీ భవన్ ప్రాంగణంలో బాబు దీక్ష ప్రారంభించారు.

'మ‌హానాయ‌కుడు' విడుద‌ల ఫిక్స‌య్యింది...

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ నిర్మిస్తోన్న చిత్రం 'య‌న్‌.టి.ఆర్'. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను రెండు భాగాలుగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నంలో ఆయ‌న సినిమా

ఫిబ్ర‌వరి 22న 'క్రేజీ కేజీ ఫీలింగ్' విడుద‌ల‌

విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం  " క్రేజీ క్రేజీ ఫీలింగ్ ". సంజయ్ కార్తీక్ దర్శకుడు.

ఆకాష్‌పూరి కొత్త చిత్రం టైటిల్ 'రొమాంటిక్‌'

పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు `మెహ‌బూబా` త‌ర్వాత ఓ సినిమాకు సంత‌కం చేశారు. ఈ సినిమాకు `రొమాంటిక్‌` అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

సీత కుమార్తె నిశ్చితార్థం

తెలుగువారికి సుప‌రిచితురాలు సీత‌. ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ఇప్పుడు కేర‌క్ట‌ర్ ఆర్టిస్ట్ ఆమె. ఆమె పెద్ద కుమార్తె నిశ్చితార్థం ఇటీవ‌ల జ‌రిగింది.