'సవ్యసాచి' లో భూమిక ప్రయోగం

  • IndiaGlitz, [Saturday,December 30 2017]

'ప్రేమ‌మ్' వంటి హిట్ చిత్రం త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి కాంబినేష‌న్‌లో 'స‌వ్య‌సాచి' పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో త‌మిళ న‌టుడు మాధ‌వ‌న్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు. కాగా, ఈ చిత్రంలో సీనియ‌ర్ క‌థానాయిక భూమిక ఓ కీల‌క పాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

నాగ‌చైత‌న్య‌కి అక్క పాత్ర‌లో క‌నిపించ‌నున్న భూమిక‌.. ఈ సినిమా కోసం త‌న పాత్ర‌కి త‌నే డ‌బ్బింగ్ చెప్పుకోనుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి 'ఎం.సి.ఎ' చిత్రంలోనే భూమిక డ‌బ్బింగ్ చెప్పుకోవాల్సి ఉంద‌ట‌. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల అది కుద‌ర‌లేదు. అయితే 'స‌వ్య‌సాచి'లో మాత్రం త‌ను చేస్తున్న అతిథి పాత్ర కోసం డ‌బ్బింగ్ చెప్పుకోబోతుంద‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ వ‌స్తుంది. ఎం.ఎం.కీర‌వాణి సంగీత‌మందిస్తున్న ఈ చిత్రం వేస‌వి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

మెగాహీరోతో నందమూరి నటుడు?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.ఇంతకీ అదేమిటంటే..

'టచ్ చేసి చూడు'.. మళ్ళీ వాయిదా?

రాజా ది గ్రేట్ తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు మాస్ మహారాజా రవితేజ.

సెన్సార్ పూర్తి చేసుకొన్న'హార్ట్ బీట్'

ధృవ, వెంబ జంటగా దేవాస్ మీడియా & ఎంటర్ టైన్మెంట్ పతాకంపై శ్యామ్ దేవభక్తుని నిర్మాణ సారధ్యంలో ద్వారక్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'హార్ట్ బీట్'.

టైటిల్ మారేస్తేనే రిలీజట‌...

బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకునే టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'ప‌ద్మావ‌తి'. రాజపుత్ర మ‌హారాణి ప‌ద్మావ‌తి జీవిత‌క‌థ‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను సంజ‌య్ లీలా భన్సాలీ తెర‌కెక్కించారు. ఇందులో ఖిల్జీ పాత్ర‌లో ర‌ణ‌వీర్ సింగ్‌, రాజా ర‌త‌న్ సింగ్ పాత్ర‌లో షాహిద్ క‌పూర్ న‌టించారు.

నెక్ట్స్ కూడా రీమేకేనట..

యంగ్ హీరో నిఖిల్ చాలా వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు.