మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ని తెలుగులో అనువ‌దిస్తున్న బిచ్చ‌గాడు నిర్మాత‌లు..!

  • IndiaGlitz, [Friday,September 02 2016]

ప్ర‌చారంలో కొత్త ఒర‌వ‌డి, అసాధార‌ణ‌మైన కంటెంట్ ఉంటే ఆ సినిమా హిట్టే. ఇటీవ‌లి కాలంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించిన అనువాద చిత్రం బిచ్చ‌గాడు నేర్పిన పాఠ‌మిది. ఓ అనువాద చిత్రం ఈ స్థాయి విజ‌యం సాధించిందంటే నిర్మాత‌లు చేసిన అద్భుత ప్ర‌చార‌మే అందుకు కారణం. ఓ స్ట్రెయిట్ సినిమాకి ధీటుగా ఈ సినిమాకి ప్ర‌మోష‌న్ చేశారు నిర్మాత‌లు. శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకం పై చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు. కేవ‌లం కోటిన్న‌రతో తెర‌కెక్కి 25 కోట్లు పైగా వ‌సూళ్లు సాధించిన రేర్ మూవీ ఇది. 50 థియేట‌ర్ల నుంచి 200 థియేట‌ర్ల‌కు అంచెలంచెలుగా రేంజు పెంచుకుంటూ వెళ్లి బంప‌ర్ హిట్ కొట్టిన చిత్ర‌మిది. ఈ స్థాయి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన నిర్మాత‌ చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి మ‌రో అరుదైన చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నారు.

మ‌ల‌యాళంలో ఇటీవ‌ల రిలీజై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించిన‌ ఆన్ మ‌రియ క‌లిప్పిలాను చిత్రాన్ని తెలుగులో అందించ‌నున్నారు. ఓకే బంగారం ఫేం దుల్కార్ స‌ల్మాన్ ఓ ముఖ్య అతిధిగా న‌టించ‌గా.. నాన్న‌ (విక్ర‌మ్ సినిమా) చిత్రంలో క్యూట్ అప్పియ‌రెన్స్‌, చ‌క్క‌ని పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకున్న బేబి సారా అర్జున్ ఈ చిత్రంలో టైటిల్ పాత్ర‌లో న‌టించారు. మిథున్ మాన్యూల్ థామ‌స్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌న్ని వాయ్‌నే, అజు వ‌ర్గీస్ ఇత‌ర‌ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.

ఇటీవ‌లే రిలీజైన ఈ చిత్రం మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించ‌డంతో తెలుగు అనువాద హ‌క్కుల కోసం భారీ పోటీ ఏర్ప‌డింది. పోటీలో ఫ్యాన్సీ రేటు చెల్లించి రిలీజ్ హ‌క్కుల్ని ద‌క్కించుకున్నారు. ఓ ఫ్రాడ్‌స్ట‌ర్‌తో చిన్నారి చేసిన సావాసం ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీసింద‌న్న‌దే సినిమా. థామ‌స్ ఓ సింపుల్ స‌బ్జెక్ట్‌ని రియ‌లిస్టిక్ పంథాలో ఆవిష్క‌రిస్తూనే... స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో ఆద్యంతం ర‌క్తిక‌ట్టించేలా తెర‌కెక్కించారని మ‌ల్లూవుడ్‌లో క్రిటిక్స్ ప్ర‌శంసించారు. కేర‌ళ‌లో 70 పైగా థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ చిత్రం రికార్డ్ వ‌సూళ్లు సాధించింది. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్ర‌మిద‌ని మ‌ల‌యాళ యంగ్ హీరో, సూప‌ర్‌స్టార్ దుల్కార్ స‌ల్మాన్ ప్ర‌శంసించ‌డం విశేషం.

More News

ట్విట్టర్ లో ఎంటరైన చిరు డాటర్..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150.డైనమిక్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో

కూతురు కోసం...రేణు దేశాయ్ మార్చిందిలా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమార్తె ఆద్య అమ్మ రేణు దేశాయ్ కి ఓ మాట చెప్పిందట.

5 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్..!

గత కొన్ని రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటకు గుడ్ బై చెప్పేస్తారు అని ప్రచారం జరిగింది.

చిన్ని చిన్ని ఆశ‌లు నాలో రేగెనే ప్లాటిన‌మ్ డిస్క్ వేడుక‌

పి.ఆర్‌. మూవీ మేక‌ర్స్ తెర‌కెక్కిస్తున్న సినిమా `చిన్ని చిన్ని ఆశ‌లు నాలో రేగెనే`. ప‌వ‌న్, గ‌ట్టు మ‌ను హీరోలుగా న‌టించారు. సోనియా దీప్తి హీరోయిన్‌. ష‌క‌ల‌క శంక‌ర్‌, తాగుబోతు ర‌మేశ్‌, బాషా, షానీ, పింగ్ పాంగ్‌, చిట్టిబాబు, చంద్ర‌మౌళి, శ్రీనివాస్ కీల‌క పాత్ర‌ధారులు. సోనీ ప‌వ‌న్‌, గ‌ట్టు ర‌జిని నిర్మాత‌లు. సంతోష్ నేలంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హ

దసరా కానుకగా కళ్యాణ్‌రామ్‌, పూరి జగన్నాథ్‌ల 'ఇజం'

డేరింగ్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇజం.  నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై  నందమూరి కళ్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.