ఏ.వి.ఎం. మేకర్స్'బిచ్చగాడా..మజాకా'

  • IndiaGlitz, [Saturday,March 11 2017]

ప్రముఖ దర్శకులు కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకత్వంలో.. "ఆల్ వెరైటీ మూవీ మేకర్స్" పతాకంపై నూతన నిర్మాత బి.చంద్రశేఖర్ నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం "బిచ్చగాడా మజాకా..". అర్జున్-నేహాదేశ్ పాండే జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో.. సుమన్, బాబూమోహన్, బాలాజీ, రామసత్యనారాయణ, గౌతంరాజు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాత బి.చంద్రశేఖర్ ఈ చిత్రానికి కథ మరియు సంభాషణలు అందించడం విశేషం.
మూడు పాటలు, రెండు ఫైట్స్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ చేసేందుకు ఫిలిం ఛాంబర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో.. చిత్ర నిర్మాత బి.చంద్రశేఖర్, దర్శకులు కే.ఎస్.నాగేశ్వరరావు, హీరో అర్జున్, హీరోయిన్ నేహాదేశ్ పాండే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఎస్.కే.రహమాన్, ఎస్.ఎం.భాషా, కెమెరామెన్ అడుసుమిల్లి విజయ్ కుమార్, ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించిన బాలాజీ, గౌతంరాజు పాల్గొన్నారు.
"బిచ్చగాడా మజాకా" చిత్రం ద్వారా ఓ మంచి నిర్మాతను పరిశ్రమకు పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉందని చిత్ర దర్శకులు కే.ఎస్.నాగేశ్వరరావు పేర్కొనగా.. తాను తయారు చేసుకున్న కథను కే.ఎస్.నాగేశ్వరరావు అద్భుతంగా తెరకెక్కించారని.. అడుసుమిల్లి విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణ అని.. మే లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత బి.చంద్రశేఖర్ అన్నారు. "బిచ్చగాడా మజాకా" వంటి మంచి చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని హీరోహీరోయిన్స్ అర్జున్, నేహాదేశ్ పాండే చెప్పారు. ఈ సినిమాలో తాము చాలా మంచి పాత్రలు పోషించామని బాలాజీ, గౌతంరాజు తెలిపారు.
చిత్రం శ్రీను, చిట్టిబాబు, రాజశ్రీ నాయర్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి.. ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం: శ్రీవెంకట్, ఫైట్స్: రామ్ సుంకర, కెమెరా: అడుసుమిల్లి విజయ్ కుమార్, కో-డైరెక్టర్: రమేష్ రెడ్డి పూనూరు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఎస్.కె.రహమాన్-ఎస్.ఎం.బాషా, కథ-మాటలు-నిర్మాత: బి.చంద్రశేఖర్, స్క్రీన్ ప్లే-డైరెక్షన్: కె.ఎస్.నాగేశ్వరరావు!!

More News

తెలుగు సినిమాని ఉరితీయకండి....'కత్రిన,కరీన,మద్యలో' కమల్ హసన్ దర్శకుడు రత్న

తెలుగు సినిమా ని ఉరితీయకండి.. ఉరితీయకండి ఇదే సెన్సారు సభ్యులకి మా నినాదం అంటున్నారు కత్రినా కరీనా మధ్యలో కమల్హసన్ దర్శకుడు రత్న. మేము తీసిన ఈ సినిమా నిర్మాణంలోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొని కష్టపడి చిత్రాన్ని కంప్లీట్ చేసి,

సమంత అప్పుడు చెప్పేస్తుందట...

తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా సినీ నటి సమంత నియమించబడిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సమంత దుబ్బాక సహకారం సంఘాన్ని వెళ్లి చూసింది.

చైతు మొదటి షెడ్యూల్ పూర్తి...

అక్కినేని నాగచైతన్య ఏకంగా రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది.

2.0 షూటింగ్ పూర్తిః శంకర్

సూపర్స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ప్రెస్టిజియస్ మూవీ `2.0`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై శుభకరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో రూపొందుతోంది.

ఈ టైటిల్ చైతుకా.. అఖిల్ కా..

ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా సినిమా రూపొందుతోంది. దీనితో పాటు మనం పేమ్ అఖిల్ రెండో సినిమా కూడా రూపొందనుంది.