మేజిక్ ఫిగర్‌కు దగ్గరగా బైడెన్..

  • IndiaGlitz, [Wednesday,November 04 2020]

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టమైన ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ జరగడం విశేషం. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ మధ్య హోరాహోరీగా పోరు నడిచినప్పటికీ ప్రస్తుతం మాత్రం జో బైడెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఒకరకంగా మేజిక్ ఫిగర్‌కు బైడెన్ దగ్గరలో ఉన్నారు. ముందుగా అంతా ఊహించినట్టుగానే.. క్షణక్షణానికి ఆధిక్యం మారిపోతోంది. ఇప్పటివరకు బైడెన్‌కు 223, ట్రంప్‌కు 148 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. అదే సమయంలో ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌లో ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌లో ట్రంప్‌కు 48.4 శాతం, బైడెన్‌కు 49.9 శాతం

ఇండియానా, ఓక్లాహామా, టెన్సాసీ, కెంటకీలో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించగా.. డీసీ, వెర్మాంట్, మాసాచుసెట్స్, డెలవెర్, న్యూజెర్సీ, మేరీలాండ్‌లో బైడన్ విజయం సాధించారు. నార్త్ డకోటా, సౌత్ డకోటా, సౌత్ కరోలినా, వెస్ట్ వర్జీనియాలో ట్రంప్ విజయం సాధించగా.. కొలరాడో, న్యూమెక్సికో, ఇల్లినాయిస్, కలెక్టికట్‌లో బైడెన్ విజయం సాధించారు. ఫ్లోరిడా, టెక్సస్ ఫలితాలు కీలకంగా మారాయి. జార్జియా, టెక్సస్, ఫ్లోరిడా, ఒహియోలో ట్రంప్ ముందంజ

పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్, మిస్సోరియాలో ట్రంప్ ఆధిక్యంలో ఉండగా.. న్యూహాంప్‌షైర్, ఆరిజోనా, మొంటానాలో బైడెన్ ముందంజలో ఉన్నారు. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించేవారికి అధ్యక్ష పదవి లభించనుంది. ఇప్పటికే బైడెన్‌కు 223 ఓట్లు లభించాయి. దీంతో ఫలితం బైడెన్‌కే అనుకూలంగా ఉండబోతోందని తెలుస్తోంది. కాగా.. ఎన్నికల్లో దాదాపు 10 కోట్ల మంది ముందస్తు ఓట్లేశారు. ఈ ఓట్ల లెక్కింపు చివరలో జరగనుంది. ఇది పూర్తయితే ఫలితం ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

More News

బైడెన్.. ట్రంప్ విజయం సాధించిన రాష్ట్రాలివే..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టమైన ఓటింగ్ ప్రక్రియ ముగిసింది.

అమ్మో రాజశేఖర్.. బీభత్సం చేసేశాడు..

నిన్నటి నామినేషన్ పర్వం నేడు కూడా కొనసాగింది. నిన్న అవినాష్‌ని అభి నామినేట్ చేశాడు. ఇవాళ అమ్మ రాజశేఖర్‌ను నామినేట్ చేశాడు.

కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. బైడెన్, ట్రంప్ మధ్య హోరాహోరీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో ముగిసింది. కాగా.. పోలింగ్ ముగిసిన రాష్రాల్లో బుధవారం ఉదయం(భారత కాలమానం ప్రకారం) ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.

ఎంబీఎస్ జ్యువెల్లర్స్‌కు భారీ జరిమానా.. ఈడీ చరిత్రలోనే తొలిసారిగా..

భారత ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ చరిత్రలో కనీ వినీ ఎరుగని పరిణామం చోటు చేసుకుంది.

రాజ్‌త‌రుణ్ హీరోగా శాంటో ద‌ర్శ‌క‌త్వంలో డ్రీమ్ టౌన్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్ చిత్రం ప్రారంభం

యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ హీరోగా శాంటో ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది.