Amitabh Bachchan : ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో ప్రమాదం.. అమితాబ్‌కు తీవ్ర గాయాలు, ముంబైలో చికిత్స

  • IndiaGlitz, [Monday,March 06 2023]

ఇటీవలి కాలంలో సినిమా షూటింగుల్లో పలువురు హీరోలు, హీరోయిన్లు ప్రమాదాల బారినపడిన సంగతి తెలిసిందే. నిన్న గాక మొన్న తమిళ స్టార్ హీరో విశాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.ప్రస్తుతం విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారు. దీని కోసం ఓ భారీ ట్రక్కును చిత్ర యూనిట్ వినియోగిస్తోంది. అయితే షూట్ సమయంలో ఆ ట్రక్కు అదుపు తప్పి స్టూడియోలో వున్న సెట్టింగ్స్‌ను ధ్వంసం చేసుకుంటూ దూసుకొచ్చింది. ఆ సమయంలో లోపల 100 మందికి పైగా కార్మికులు, సాంకేతిక నిపుణులు, హీరో విశాల్ కూడా వున్నారు. అయితే ట్రక్ రాకను గమనించిన యూనిట్ సభ్యులు విశాల్‌ను వెంటనే పక్కకు లాగారు. దీంతో ఆయన పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో గాయపడ్డా అమితాబ్ :

తాజాగా బాలీవుడ్ సూపర్‌స్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘‘ప్రాజెక్ట్ కే’’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తుండగా బిగ్ బీ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. పక్కటెముక మృదలాస్థి విరగడంతో పాటు కుడి పక్కటెముక కండరం చిరిగిపోయిందని అమితాబ్ తన బ్లాగర్ ద్వారా వెల్లడించారు. దీంతో షూటింగ్ రద్దు చేసుకుని హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు బిగ్‌బీ వెల్లడించారు. షూటింగ్‌లు, ఇతర పనులను వాయిదా వేసి ముంబైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నానని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. ఆయన గాయపడిన నేపథ్యంలో యూనిట్ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు అమితాబ్ గాయపడిన విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

2024 సంక్రాంతి కానుకగా ప్రాజెక్ట్ కే :

ఇకపోతే.. ప్రాజెక్ట్‌కే ను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వీనిదత్ భారీ బడ్జెట్‌తో ప్రాజెక్ట్ కేను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, దీపీకా పదుకొనే, దిశా పటానీ తదితర స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై కనిపించని కొత్త కథతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్లు నాగ్ అశ్విన్ తెలిపారు. ప్రాజెక్ట్‌ను రెండు పార్ట్‌లుగా విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. తొలి భాగాన్ని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.

More News

Venu:సతీష్.. దిల్‌రాజుతో కాదు, నాతో మాట్లాడు .. చిల్లర వేషాలొద్దు : బలగం వివాదంపై వేణు వ్యాఖ్యలు

ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా ‘బలగం’.

Garikapati:అబ్బా ఏం డ్యాన్స్ చేశారు.. చిన్నావాళ్లయినా ఎన్టీఆర్, చరణ్‌లకు నమస్కరిస్తున్నా : ‘‘నాటు నాటు’’పై గరికపాటి

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్.

Anchor Shyamala:మొన్ననే లగ్జరీ హౌస్‌లో గృహ ప్రవేశం.. ఇప్పుడు మరో భూమిపూజ, శ్యామల సంపాదనపై ట్రోలింగ్

సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న తెలుగు యాంకర్లలో శ్యామల ఒకరు. పెళ్లయి, ఒక బిడ్డకు తల్లయినా శ్యామల ఫిగర్‌లో

Nadendla Manohar:ఇప్పటంలో మళ్లీ ఇళ్ల కూల్చివేతలు.. జగన్ కళ్లలో ఆనందం కోసమే : నాదెండ్ల మనోహర్ ఆగ్రహం

గుంటూరు జిల్లా ఇప్పటంలో అధికారులు మరోసారి ఇళ్ల కూల్చివేతలను ప్రారంభించడంతో ఉద్రిక్తత నెలకొంది.

Balakrishna:మరోసారి వివాదాస్పదమైన బాలయ్య తీరు.. ఈసారి సొంత అభిమానుల నుంచే, నందమూరి ఫ్యాన్స్ చీలిపోతారా..?

టాలీవుడ్ అగ్రకథానాయకుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు.