బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరోగా ప్రొడక్షన్ నెం.2 ఎనౌన్స్ మెంట్ !!

  • IndiaGlitz, [Tuesday,May 09 2017]

"పెళ్లి చూపులు" చిత్రంతో నేషనల్ అవార్డ్ అందుకొన్న సరికొత్త నిర్మాణ సంస్థ "బిగ్ బెన్ సినిమాస్" తమ రెండో చిత్రాన్ని నేడు ఎనౌన్స్ చేశారు. తమ తొలి చిత్ర కథానాయకుడైన విజయ్ దేవరకొండతోనే తమ రెండో చిత్రాన్ని నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నారు "బిగ్ బెన్ సినిమాస్" అధినేత యష్ రంగినేని. భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయంకానున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ.. "పెళ్ళిచూపులు అనంతరం మా బ్యానర్ నుంచి వస్తున్న సినిమా ఇది. మునుపటి చిత్రంలో బద్దకస్తుడైన కుర్రాడిగా నటించిన విజయ్ దేవరకొండ తాజా చిత్రంలో ఇంటెన్సిటీ ఉన్న పాత్ర పోషించనున్నాడు. యాక్షన్ లవ్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రం ద్వారా ప్రతిభాశాలి భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతుండడం విశేషం. ఫస్ట్ లుక్ లోనే మా స్టోరీ థీమ్ ఏంటీ అనేది అర్ధమయ్యేలా చేశాడు మా డైరెక్టర్. కోపంతో రగిలిపోతున్న విజయ్ దేవరకొండను ఓ యువతి కంట్రోల్ చేస్తున్నట్లుగా ఉన్న ఈ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకులు తప్పకుండా కనెక్ట్ అవుతారు" అన్నారు.
నటీనటుల ఎంపిక ఇంకా జరుగుతున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సుజిత్ సారంగ్, కూర్పు: శ్రీజిత్ సారంగ్, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, నిర్మాత: యష్ రంగినేని, రచన-దర్శకత్వం: భరత్ కమ్మ!

More News

'గౌతమ్ నంద' కోసం సొంత డబ్బింగ్ చెప్పుకొన్న కేతరీన్

మాస్ హీరో గోపీచంద్-స్టైలిష్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న

'కల్పన-3' ఆడియో విడుదల

సాయివెంకట్ సమర్పణలో భీమవరం టాకీస్ బ్యానర్పై ఉపేంద్ర, ప్రియమణి, తులసి తారాగణంగా రూపొందుతోన్న చిత్రం `కల్పన-3`. ఉదయ్రాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేస్తున్నారు.

'అంధగాడు' పాటల సందడి షురూ...

ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.బ్యానర్ లో

స్కాం సొమ్ముతోనే సినిమా

గతంలో కృత్తిమ గర్భధారణం అనే కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా 'అమ్మా నీకు వందనం'.

కిడ్నాప్ చేయలేందటున్న బుల్లితెర నటుడు...

బుల్లితెర నెంబర్ వన్ షోగా సాగుతున్న జబర్ దస్త్ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది కమెడియన్స్ పరిచయమవుతున్నారు.