పాయ‌ల్ రాజ్‌పుత్‌కు భారీ ఆఫ‌ర్‌..?

  • IndiaGlitz, [Friday,May 29 2020]

‘ఆర్‌.ఎక్స్ 100’తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుంది హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్‌. హాట్ భామ‌గా క్రేజ్‌ను సొంతం చేసుకున్న పాయ‌ల్ త‌దుప‌రి ఆర్‌.డి.ఎక్స్ ల‌వ్‌, వెంకీమామ చిత్రాల్లో న‌టించినా ఆమెకు పెద్ద‌గా గుర్తింపు ద‌క్క‌లేదు. ఈ అమ్మ‌డు సినిమాల వెతుకులాట‌లో ఉండ‌గానే లాక్‌డౌన్ ప‌రిస్థితి రావ‌డంతో సినిమా ప‌రిశ్ర‌మ స్త‌బ్దుగా మారింది. లాక్‌డౌన్ స‌మ‌యంలోనే ప్రియుడు సౌర‌భ్ దింగ్రా తెరకెక్కిచిన షార్ట్ ఫిలిం ఎటాక్‌లో న‌టించింది. ఈ షార్ట్ మూనీ 24 గంట‌ల్లో తెర‌కెక్కించ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో పాయ‌ల్‌కు సంబంధించిన వార్తొక‌టి నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

అదేంటంటే పాయ‌ల్ రాజ్‌పుత్ త్వ‌ర‌లోనే స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమాలో ప‌నిచేయ‌నుంద‌ట‌. ఇంత‌కు వినిపిస్తోన్న వార్త‌ల ప్ర‌కారం పాయ‌ల్ రాజ్‌పుత్‌ను శంక‌ర్, త‌ను డైరెక్ట్ చేస్తున్న ఇండియ‌న్ 2 సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టింప చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ విష‌యంలో ఓ క్లారిటీ రానుంద‌ని స‌మాచారం. అయితే ఈ వార్త‌ల్లో నిజానిజాల‌పై పాయ‌ల్ రాజ్‌పుత్ వివ‌ర‌ణ ఇవ్వాల్సిందే. ఒక‌వేళ నిజ‌మైతే మాత్రం శంక‌ర్ తెర‌కెక్కించే ప్రెస్టీజియ‌స్ మూవీ ఇండియ‌న్ 2లో పాయ‌ల్ న‌టించ‌డం ఆమెకు ప్ల‌స్ పాయింటేన‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి.

More News

పాన్ ఇండియా మూవీ ‘83’... క‌పిల్ సేన విజ‌యంలో కీల‌క పాత్ర‌ను పోషించిన వ్య‌క్తి

ఇండియన్ క్రికెట్‌ను గ‌తిని మార్చిన ఏడాది 1983. ఈ ఏడాది భార‌త‌దేశం క్రికెట్ ప్ర‌పంచంలో రారాజుగా అవ‌త‌రించింది.

బాలయ్యపై మెగా హీరోస్ ఎటాక్..!?

నందమూరి బాలయ్యపై మెగా హీరోల ఎటాక్ స్టార్ట్ అయ్యిందా..? బాలయ్యపై పంచ్‌లు.. వార్నింగ్‌ల వర్షం కురిపిస్తున్నారా.. ?

ఇదేం పెళ్లా.. బొట్టి పెట్టి పిలవడానికి..: తమ్మారెడ్డి

ఇండస్ట్రీలో ఎవరూ ఎవర్నీ బొట్టు పెట్టి మరీ పిలవరని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యానించారు. ఇవాళ మెగాస్టార్ చిరు ఇంట్లో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన..

చిరు ఇంట్లో ముగిసిన సీసీసీ స‌మావేశం.. ఎవ‌రేమ‌న్నారంటే?

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో సినిమా ప‌రిశ్ర‌మ చాలా ఇబ్బందుల‌ను ఫేస్ చేసింది. ముఖ్యంగా సినీ కార్మికుల‌కు ప‌ని లేకుండా పోయింది.

‘నిమ్మగడ్డ’దే న్యాయం.. జగన్ సర్కార్‌కు హైకోర్ట్ షాక్

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్‌కు హైకోర్టు మరో షాకిచ్చింది. సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకూ హైకోర్టులో చాలా ఎదురుదెబ్బలే తగిలాయి.