close
Choose your channels

ప్రభాస్ ‘సలార్’కు కళ్లు చెదిరే ఆఫర్స్..

Friday, March 5, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రభాస్ ‘సలార్’కు కళ్లు చెదిరే ఆఫర్స్..

‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘సలార్’. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఈ సినిమా ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. రవి బస్రూర్‌ ‘సలార్‌’కు సంగీతం అందిస్తున్నారు. ‘కేజీయఫ్‌’తో డైరెక్టర్‌గా సత్తా నిరూపించుకున్న ప్రశాంత్‌నీల్‌ సారథ్యంలో ‘బాహుబలి’తో ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ హీరోగా వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

‘కేజీఎఫ్’ను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా విడుదలకు ఏడాదికి పైగానే సమయం ఉన్నప్పటికీ బిజినెస్ మాత్రం ఓ రేంజ్‌లో సాగుతోందట. ఈ సినిమాకు ఓటీటీ సంస్థల నుంచి కళ్లు చెదిరే ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం. ఈ సినిమా రూ.150కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ రేటుతో దక్కించుకునేందుకు పలు సంస్థలు పోటీ పడుతున్నాయని సమాచారం.

ముఖ్యంగా ఈ సినిమా అన్ని భాషల డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్ ప్రైమ్ వీడియోస్ ప్రయత్నిస్తోందట. ఏకంగా వంద కోట్ల రూపాయల ఇస్తామని ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్స్ సినిమాలకు కూడా అమేజాన్ నుంచి ఈ రేంజ్ ఆఫర్ ఇప్పటివరకు రాలేదు. ప్రభాస్‌ ‘బాహుబలి’తో నేషనల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోవడంతో.. ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో కూడా అభిమానులున్నారు. అందుకే `సలార్` కోసం అంత మొత్తం వెచ్చించేందుకు అమేజాన్ సిద్ధపడుతోందట. కాగా.. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.