Kavitha: కవితకు భారీ షాక్.. మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేత..

  • IndiaGlitz, [Monday,April 08 2024]

ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ షాక్ తగిలింది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 4న విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును సోమవారానికి రిజర్వ్ చేసింది. తాజాగా బెయిల్ పిటిషన్ కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. దీంతో కవితకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అయితే రెగ్యులర్ బెయిల్‌ పిటిషన్‌పై ఏప్రిల్ 20న విచారణ జరుపుతామంది.

విచారణ సందర్భంగా ఈడీ వాదిస్తూ కవిత చిన్నకొడుకు ఒంటరిగా లేడు. 22 ఏళ్ల సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారు. కవితతో ఆమె ముగ్గురు సోదరీమణులు ములాఖత్ అయ్యారు. అబ్బాయిని చూసుకోవాడానికి కుటుంబ సభ్యులు ఉన్నారు. పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ అడుగుతున్నారు, కానీ పరీక్షల్లో కొన్ని ఇప్పటికే అయిపోయాయి. కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. ఆమె రాజకీయంగా పలుకుబడి గల వ్యక్తి అని.. మధ్యంతర బెయిల్ ఇస్తే సాక్ష్యాలు, ఆధారాలు తారుమారు చేసే అవకాశం ఉంది అని పేర్కొంది. దీంతో ఈడీ వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు కవితకు కోర్టు విధించిన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. తాజాగా మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో ఆమెను కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మరికొన్ని రోజులు రిమాండ్‌కు అధికారులు అడగనున్నారు. కాగా లిక్కర్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తొలిసారి 2 రోజులు, తర్వాత 3 రోజులు.. అలా మొత్తం 10 రోజులు ఈడీ అధికారులు కస్టడీలో విచారించారు. అనంతరం న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించడంతో మార్చి 26న కవితను తీహార్ జైలుకు తరలించారు. లిక్కర్ స్కాంలో కవితదే కీలక పాత్ర అని రూ.100కోట్లు చేతులు మారాయని అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా అరెస్టై తిహార్ జైలులోనే ఉంటున్నారు.

More News

అమ్మవారిగా బన్నీ విశ్వరూపం.. 'పుష్ప' గాడి మాస్ జాతర మొదలైంది..

'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలోని నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు.

థియేటర్లలో అలరించేందుకు భారతీయుడు సిద్ధం.. ఎప్పుడంటే..?

లోక నాయకుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు శంకర్ కలయికలో 'ఇండియన్-2' చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

టీఆర్ఎస్‌గా మారనున్న బీఆర్ఎస్.. మాజీ మంత్రి కీలక ప్రకటన..

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షోభం ఎదుర్కొంటోంది. ఓవైపు అధికారం కోల్పోవడం..

కొన్ని పత్రికల కథనాలపై ఏపీ ఐపీఎస్ పోలీసుల సంఘం సీరియస్

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైనాట్ 175 అంటూ వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారంతో ప్రజల్లోకి దూసుకెళ్తోంది.

25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారు.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు..

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 మంది బీఆర్‌స్ ఎమ్మెల్యేలు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలిపారు.