close
Choose your channels

తెలుగు బిగ్‌బాస్-3 కంటెస్టెంట్ల జాబితా వచ్చేసిందోచ్!?

Friday, April 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు బిగ్‌బాస్-3 కంటెస్టెంట్ల జాబితా వచ్చేసిందోచ్!?

బిగ్‌బాస్-3 సీజ‌న్‌కు సమయం ఆసన్నమవ్వడంతో ఈ సారి హోస్ట్‌గా ఎవరు ఉండబోతున్నారు..? ఎవరెవరు బిగ్‌బాస్ హౌస్‌‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టబోతున్నారు..? అని సినీ ప్రియులు, బిగ్‌బాస్ అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. జూన్, జులైలో కొత్త సెష‌న్‌కి ‘మా’ టీవీ యాజమాన్యం శ్రీ‌కారం చుట్టబోతోంది. అయితే ఇప్పటికే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎవరెవర్ని రప్పించాలనేదానిపై నిర్వాహకులు ఓ జాబితాను ఫిక్స్ చేశారట. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో, వెబ్‌సైట్లలో 20 మందితో కూడిన జాబితా ఒకటి హల్ చల్ చేస్తోంది. అయితే ఈ 20 మందిలో ఎవర్ని ఫైనల్‌ చేయాలనే విషయంలో ‘మా’ యాజమాన్యం తర్జనభర్జన పడుతోందట. ఈ లిస్ట్‌లో ఎక్కువగా మేల్, హాట్ ఫీమేల్ యాంకర్స్ ఎక్కువగా ఉండటం గమనార్హం.

నెట్‌లో హల్‌చల్ చేస్తున్న మొదటి జాబితా ఇదే...

01. టీవీ ఆర్టిస్ట్ జాఖీ, హరిత
02. ఇంద్ర నేల్, మేఘన
03. నిరుపమ, మంజుల
04. జబర్దస్ నటుడు సుధీర్
05. యాంకర్ రష్మీ
06. లాస్య, మంజునాథ
07. యాంకర్ రవి
08. యాంకర్ శ్రీ ముఖి
09. వరుణ్ సందేశ్
10. సింగర్ లిప్సిక
11. సింగర్ హేమ చంద్ర
12. యాంకర్ ఉదయ భాను

నెట్‌లో హల్‌చల్ చేస్తున్న రెండో జాబితా ఇదే...

01. జాహ్నవి దాశెట్టి
02. వెబ్ మీడియా ఆర్టిస్ట్ జ్యోతి
03. శోభితా ధూళిపాళ్ల
04. జబర్దస్త్ పొట్టి నరేశ్
05. ఉదయ భాను
06. టీవీ ఆర్టిస్ట్ జాకీ
07. వరుణ్ సందేశ్
08. రేణు దేశాయ్
09. ఆర్టిస్ట్ చైతన్య క్రిష్ణ
10. మనోజ్ నందన్
11. ఆర్టిస్ట్ కమల్ కామరాజు
12. నాగ పద్మిణి
13. రఘు మాస్టర్
14. సింగర్ హేమ చంద్ర
15. గద్దె సింధూర
16. గుత్తా జ్వాల

కాగా.. యాంకర్స్ ర‌ష్మి, ఝాన్సీ, లాస్య‌ల పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. కాగా లాస్య ఈ మధ్యే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది గనుక ఆమె రాకపోవచ్చు.! మరోవైపు ప్ర‌దీప్‌, ర‌వి ఇద్ద‌రిలో ఒక‌రు ఉండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మొత్తానికి చూస్తే ఈసారి జూనియర్ ఆర్టిస్ట్‌లు, న్యూస్ యాంకర్స్, మాజీ హీరోయిన్స్‌, యూట్యూబ్‌లో ఫేమస్ అయిన వారు, స్పోర్ట్స్‌ నుంచి ఇలా అందర్నీ కలిపి ‘మా’ యాజమాన్యం ఓ టీమ్‌ను తయారు చేయనుందన్న మాట. మొత్తానికి చూస్తే ఫస్ట్, సెకండ్ సీజన్ కంటే మూడో సీజన్ గ్రాండ్‌గా.. రక్తికట్టిస్తుందన్న మాట. కాగా ఇలాగే సెకండ్ సీజన్ సమయంలో ఫైనల్ లిస్ట్ ఇదే.. కచ్చితంగా వీరంతా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతన్నారంటూ పెద్ద ఎత్తున కథనాలు, జాబితాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కూడా సెకండ్‌కు డబుల్‌గా హోస్ట్ పేర్లు, కంటెస్టెంట్ పేర్లు వినపడుతున్నాయి. మ‌రి వీళ్ల‌లో ఫైన‌ల్ లిస్టులో మెరిసేదెవ‌రో.. బయటికెళ్లేదెవరో..? అసలు ఈ జాబితాలోని వాళ్లలో ఎంత మంది సెలెక్షన్స్‌దాకా వెళ్తారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.