close
Choose your channels

కలిసిపోయిన అఖిల్, మోనాల్..

Thursday, November 26, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పవర్ స్టార్ సాంగ్‌తో షో స్టార్ట్ అయ్యింది. సొహైల్ ఫేష్ వాష్ అనుకుని కోల్గేట్‌ను మొహానికి రాసుకున్నాడు. అరియానా, అవినాష్ వచ్చి ఆటపట్టించారు. అఖిల్, అరియానాపై చేయి వేసి కూర్చొని అవినాష్‌ను ఆటపట్టించాడు. ఇక అవినాష్, మోనాల్‌ను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి కౌంటర్ ఇవ్వడానికి ట్రై చేశాడు. ఈ ఎపిసోడ్ అంతా సరదా సరదాగా గడిచింది. తరువాత అరియానాకు దెయ్యం షాడో అద్దంలో కనబడటంతో భయపడి ఏడ్చింది. తరువాత గేమ్‌లో పార్ట్ అని తేల్చేశారు. దెయ్యం గురించి అవినాష్, అఖిల్, సొహైల్ చేసిన కామెడీ హైలైట్. ఇక దెయ్యం చెప్పింది. ఇంటి నియమాలంటే తనకు ఇష్టమని.. తన పేరు జలజ అని చెప్పింది. అయితే ప్రిడిక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఆమె స్వాతి అయి ఉంటుందని ఊహించారు. ఒక్కొక్కరి గురించి చెబుతూ వచ్చింది. తరువాత డోర్ ఓపెన్ అయింది. బయటంతా ఓ క్రేజీ సెటప్‌ను సిద్ధం చేశారు. అభిని బయట ఉన్న చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో లెక్కపెట్టి చెప్పమని చెప్పింది. ఇది ఒకవేళ టాస్క్ అయితే ఏంటి పరిస్థితి అని అభి ఆలోచించాడు. కానీ చెట్టుకి ఉన్న ఆకులన్నీ లెక్కబెట్టాలంటే సాధ్యమేనా? అని ఆలోచించాడు.

ఇక సమాధి పక్కన పడుకుని అవినాష్ ఎలా చనిపోయానో చెబుతుంటే సొహైల్, అఖిల్ ప్రశ్నలు అడుగుతున్నారు. తాను ఆకులు లెక్కబెట్టాలంటే బిగ్‌బాస్ నియమాల్ని ఉల్లంఘించాల్సి వస్తుందని.. ఆకులన్నీ తెంపాల్సి వస్తుందని చెప్పాడు. అవినాష్ మాత్రం పెళ్లి గోల వదల్లేదు. మోనాల్, అఖిల్ మొత్తానికి కలిసిపోయారు. అయితే నిన్ను క్షమిస్తాను కానీ కొన్ని విషయాలను మాత్రం మర్చిపోలేనని చెప్పాడు. నేను ఏడ్చినప్పుడు నవ్వించాలని.. నవ్వించకుంటే మిమ్మల్ని ఏడిపించాల్సి ఉంటుందని జలజ చెప్పింది. బిగ్‌బాస్ నుంచి అనౌన్స్‌మెంట్ వచ్చింది. అభిజిత్, అఖిల్ మోనాల్‌ను ఎక్కువగా ఏడిపించారని.. కాబట్టి ఆమెను ఒకరు డేట్‌కి తీసుకెళ్లారని చెప్పారు. అయితే అభి మాత్రం దానిని అస్సలు ఇష్టపడలేదు. ఇద్దరం కలిసి మోనాల్‌ను ఏడిపించడమేంటి? ఈ మోనాల్, అభిజిత్ అనేదే వద్దని చెప్పాడు. ఈ మోనాల్ బిజినెస్ నాకు వద్దని చెప్పాడు. అఖిల్ ఏమో ఫిట్టింగ్ ఏమీ లేదని.. చెయ్యాలనిపిస్తే చెయ్యాలి.. లేదంటే లేదని చెప్పాడు. అభి.. అఖిల్ గురించి చెప్పి సీరియస్ అయ్యాడు. మోనాల్ పాయింట్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉందని.. నాకు అసలు వద్దే వద్దని నేను డేట్‌కి వెళ్లనని అభి చెప్పాడు.

ఇక బిగ్‌బాస్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఇది లగ్జరీ బడ్జెట్ టాస్క్ అని.. అందరూ చెయ్యాలని బిగ్‌బాస్ చెప్పారు. అభి నిరాకరించినందున అఖిల్‌ను మోనాల్‌తో డేట్‌కి వెళ్లాలని బిగ్‌బాస్ సూచించారు. దీంతో అఖిల్.. మోనాల్‌ను తీసుకుని డేట్‌కు వెళ్లాడు. ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. నేను చాలా పొసెసివ్ అని.. కేరింగ్ కూడా మామూలుగా ఉండదని అఖిల్ చెప్పాడు. మోనాల్ తాను పొసెసివ్ కాదని చెప్పింది. ఇక నాగార్జున సాంగ్.. ‘నందికొండ వాగుల్లోన’ వచ్చింది. హౌస్ లోపల సొహైల్, హారిక డ్యాన్స్ చేస్తుంటే బయట అఖిల్ డ్యాన్స్ చేశాడు. సొహైల్ బయటకు వచ్చి జలజ చెప్పిన పోల్ డ్యాన్స్ చేశాడు. మొత్తమ్మీద ఇవాళైతే చెప్పుకోదగ్గ అంశాలైతే ఏమీ లేవు. కంటెంట్ లేకుండా షో నడిచింది. ప్రోమోను బట్టి రేపు ఏదో ఫిజికల్ టాస్క్ జరగబోతున్నట్టు తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.