close
Choose your channels

అదరగొట్టేసిన అఖిల్, సొహైల్...

Friday, November 27, 2020 • తెలుగు Comments

అదరగొట్టేసిన అఖిల్, సొహైల్...

ఓపెనింగే.. హారిక.. అభి ఫీల్ అయిన విషయాన్ని మోనాల్‌కు చెప్పింది. గతంలో తనకు.. అభికి మధ్య జరిగిందంతా హారికకు మోనాల్ చెప్పింది. ఇక మిర్చి టైటిల్ సాంగ్‌కి సొహైల్ పోల్ డ్యాన్స్ అదరగొట్టాడు. మోనాల్, అఖిల్, హారిక కూడా స్టెప్స్ వేసి హుషారు తెప్పించారు. మీ ప్లేట్స్ లాక్కొని అరిటాకులు పెట్టానని ఇంకా ఇబ్బందులు పెడతానని జలజ లెటర్ పంపించింది. ఇంకా ఆ లెటర్‌లో లైట్స్ వెలుగుతూ.. ఆరిపోతూ ఉంటాయని.. ఆరిపోయినప్పుడు క్లాప్స్ కొట్టాలని పేర్కొన్నారు. అఖిల్, మోనాల్‌ల మధ్య కాన్వర్సేషన్.. ఇక్కడ మాటలు చెప్పే వాళ్లెక్కువ.. చేసే వాళ్లు తక్కువని మోనాల్ చెప్పింది. ప్రామిస్ చేయించుకుని మరీ అఖిల్‌తో మాట్లాడటం మోనాల్ స్టార్ట్ చేసింది. సొహైల్ గేమ్ చాలా తెలివితో ఆడతాడని చెప్పింది. ఎక్కడ ఎలా ఉండాలో తెలుసని.. చాలా తెలివిగా నడుచుకుంటాడని.. అయితే మనిషి చాలా మంచి వాడని మోనాల్ చెప్పింది. ఇక్కడ అదే కావాలని అఖిల్ చెప్పాడు. నేను తనను బ్రదర్‌లా చూస్తానని.. నాతో వాడు ఎలా ఉంటున్నాడన్నదే ముఖ్యమని అఖిల్ చెప్పాడు. సొహైల్‌తో ఏదైనా తేడా వచ్చినా వెంటనే క్లియర్ చేసుకుంటానని చెప్పాడు. మొత్తానికి సొహైల్‌ని అఖిల్ అర్థం చేసుకున్న తీరు చాలా మంచిగా అనిపించింది.

‘బూచి బూచి బూ బూచాడే’ సాంగ్‌తో నెక్ట్స్ డే స్టార్ట్ అయింది. అఖిల్ కన్నీళ్లు పెట్టుకుంటూ స్మోకింగ్ జోన్‌లో కూర్చున్నాడు. అరియనా, అవినాష్ వెళ్లి ఓదార్చారు. తరువాత అరియానా వెళ్లి అభి దగ్గర కూర్చొని చూస్తూ చూస్తూ నీ బిహేవియర్‌ని నేను చాలా ఇష్టపడుతున్నానని చెప్పింది. ఈ సమయంలో అభి ఇంగ్లీషులో మాట్లాడటంతో జలజ తలకిందకి కాళ్లు పైకి పెట్టాలని పనిష్మెంట్ ఇచ్చింది. టాస్క్.. అరియానా, సొహైల్, అవినాష్ దెయ్యాలు. మిగిలిన వాళ్లంతా మనుషులు. ఇంట్లో దాచి ఉంచిన బొమ్మలను వెతికి పట్టుకుని తీసుకుని వెళ్లి మనుషులు స్విమ్మింగ్ పూల్‌లో పడేయాలి. ఒక్కో పార్ట్‌ని వేసినప్పుడల్లా ఒక్కో దెయ్యాన్ని మనిషిగా మార్చొచ్చు. మొదట దెయ్యాలను కన్ఫ్యూజ్ చేసి అఖిల్ బొమ్మ పార్ట్‌ని నీళ్లలో వేసి సొహైల్‌ని మనిషిగా మార్చేశాడు. అలాగే మొత్తం బొమ్మలను స్విమ్మింగ్ పూల్‌లో వేసి మనుషులు విజేతలుగా నిలిచారు.

అదరగొట్టేసిన అఖిల్, సొహైల్...

బిగ్‌బాస్ హౌస్‌లో హర్రర్ మూవీ ప్రదర్శించారు. జలజ పిలిచినప్పుడల్లా కన్ఫెషన్ రూమ్‌కి పిలిచిన వాళ్లు వెళ్లి స్పూన్ తీసుకుని రావాలి. మొదట అరియానా, అవినాష్‌లను జలజ పిలిచింది. అరియానా భయపడుతుంటే నాకెలా అనిపిస్తుందంటే అని సొహైల్ డ్యాన్స్ చేసి చూపించాడు. బయట సొహైల్ బిల్డప్ చూడాలి బాగా పన్ తెప్పించింది. నెక్ట్స్ మోనాల్‌ను పిలిచింది. మోనాల్ అయితే పెద్దగా భయపడినట్టు కనిపించలేదు. స్పూన్ తీసుకుని వచ్చేసింది. తరువాత సొహైల్, అఖిల్‌లను జలజ పిలిచింది. ఇద్దరూ మామూలుగా బిల్డప్ ఇవ్వలేదు. లోపల మాత్రం ఫన్ అదిరిపోయింది. ఇద్దరూ భయపడిన తీరు తెగ నవ్వించేసింది. ఇద్దరూ తెగ భయపడుతూనే బిల్డప్ మాత్రం ఓ రేంజ్‌లో ఇచ్చారు. బయట మోనాల్ కథ వేరే ఉంటది అంటూ తెగ ఎంజాయ్ చేసింది. బయటికెళ్లి భయపడనట్టే ఉండాలి లేకపోతే ఇజ్జత్ పోతది అని సొహైల్‌కి అఖిల్ చెప్పడం చాలా ఫన్నీగా అనిపించింది. బయటకు వెళ్లి అస్సలు భయపడనట్టు హౌస్‌మేట్స్ దగ్గర బిల్డప్ ఇచ్చి హౌస్ బయట ఉన్న కెమెరా దగ్గరికెళ్లి దయచేసి లోపల జరిగిందేదీ లీక్ చేయవద్దని ఇజ్జత్ పోతదని వేడుకున్నారు. మళ్లీ మోనాల్ దగ్గరికి వెళ్లి బిల్డప్ ఇచ్చిన తీరు బాగా నవ్వు తెప్పించింది. మొత్తానికి ఇవాళ అఖిల్, సొహైల్ అదరగొట్టేశారు. ఇద్దరూ కలిసి కడుపుబ్బ నవ్వించారు.

Get Breaking News Alerts From IndiaGlitz