close
Choose your channels

అమ్మా.. ఒక్కొక్కరి మనసులో ఇంతుందా?

Tuesday, September 22, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అమ్మా.. ఒక్కొక్కరి మనసులో ఇంతుందా?

ఇవాళ నామినేషన్స్ పర్వం నడిచింది. చూస్తున్నంత సేపు.. ఒక్కొక్కరి మనసులో ఇంతుందా? అనిపించింది. ఫోటోలను మంటల్లో కాలబెట్టడానికి ముందే చెప్పే కారణాలతోనే తగలబెట్టేస్తారేమో అనిపించింది. ఇక నేటి షో మంచి జోష్ ఉన్న సాంగ్‌తో స్టార్ట్ అయింది. ఆ తరువాత గ్రూపులు.. గ్రూపులుగా విడిపోయి నిన్న జరిగిన విషయాలను గురించి చర్చించుకున్నారు. దేత్తడి హారికను బయటకు పంపిచాలని ఆమె పాట్‌లో మెహబూబ్ రంగు నీళ్లు పోయడంతో ఆమె ఏ రేంజ్‌లో కోపం పెంచుకుందో నేటి షో చూస్తే తెలిసింది. జెన్యూన్ రీజన్ చెప్పలేదంటూ హారిక తన కోపాన్నంతా బయటపెట్టింది. అలాగే అమ్మ రాజశేఖర్‌.. దేవిపై గురించి నిన్న జరిగిన ఇష్యూస్‌ని ప్రస్తావిస్తూ అరియానాతో చెప్పుకొచ్చారు.

అమ్మా.. ఒక్కొక్కరి మనసులో ఇంతుందా?

ఆ తరువాత సొహైల్, అరియానాల మధ్య చిన్న క్లాష్.. అరియానా కాస్త కమాండింగ్‌గా మాట్లాడటం సొహైల్‌కు నచ్చలేదు. ఇదే విషయాన్ని సొహైల్ అమ్మ రాజశేఖర్‌కు చెప్పాడు. ఆ తరువాత రేషన్ మేనేజర్‌గా అభిజిత్ ఎంపికయ్యాడు. ఇక నామినేషన్ పర్వం మొదలైంది. కంటెస్టెంట్లు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో వారిలో ఇద్దరి పేర్లను చెప్పి.. వారి ఫోటోలను మంటల్లో వేయాలి. కెప్టెన్ అయిన కారణంగా నోయెల్‌కు బిగ్‌బాస్ ఓ ప్రత్యేకమైన అధికారాన్ని ఇచ్చాడు. దాని ప్రకారం ఒకరిని నామినేట్ చేసే అవకాశం నోయెల్‌కు బిగ్‌బాస్ ఇచ్చారు. దీంతో లాస్యను నోయెల్ నామినేట్ చేశాడు. దీనికి కారణం.. దివిని అడ్డు పెట్టుకుని అమ్మ రాజశేఖర్‌ను ఇబ్బంది పెట్టాలనుకుందని అందుకే తాను లాస్యను నోయెల్ నామినేట్ చేశాడు. నిన్న బిగ్‌బాంబ్ వేయడంతో దేవిని.. ప్రస్తుతం నోయెల్ నామినేట్ చేయడంతో లాస్యను మరెవరూ నామినేట్ చేయకూడదు.

అమ్మా.. ఒక్కొక్కరి మనసులో ఇంతుందా?

నామినేషన్స్‌లో భాగంగా అఖిల్‌కు, కుమార్ సాయికి మధ్య చిన్న వాగ్యుద్ధం జరిగింది. ఆ తరువాత సొహైల్, అరియానా మధ్య.. సొహైల్, కుమార్ సాయిల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఆ తరువాత సుజాత, హారికల మధ్య చిన్న క్లాష్.. ఆ తరువాత సుజాత అభిని నామినేట్ చేసింది. అభి చెప్పిన రీజన్‌కు భిన్నమైన రీజన్‌ను చెబుతూ నామినేట్ చేసింది. అభి క్లారిటీ ఇవ్వబోయినా యాటిట్యూడ్ చూపించడం కొంచెం అతిగా అనిపించింది. నేడు నామినేషన్స్‌లో ఏ ఒక్కరూ పెద్దగా జెన్యూన్ రీజన్స్ ఏమీ చెప్పలేదు. ఒకరిపై మరొకరికి ఉన్న గ్రిడ్జ్ తీర్చుకున్నట్టు అనిపించింది. కారణాలు ఎక్కువగా వీకెండ్ షో నుంచే తీసుకున్నారు. కాగా ఈ వారం దేవి, లాస్య, అరియానా, కుమార్, మెహబూబ్, మోనాల్, హారిక నామినేట్ అయ్యారు. రేపు లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా ఓ ఫిజికల్ టాస్క్‌ని బిగ్‌బాస్ ఇచ్చారు. ఈ సందర్భంగా రెండు గ్రూపుల మధ్య బీభత్సమైన వార్ జరిగినట్టు ప్రోమోని బట్టి తెలుస్తోంది.

అమ్మా.. ఒక్కొక్కరి మనసులో ఇంతుందా?

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.