close
Choose your channels

బిగ్‌బాస్: వార్ బిగిన్స్.. ఇక బీభత్సమే..

Wednesday, September 23, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్: వార్ బిగిన్స్.. ఇక బీభత్సమే..

నేటి బిగ్‌బాస్ షో మొత్తం ఫిజికల్ టాస్క్‌తో నడిచింది. రోబోలు, మనుషుల మధ్య వార్ ఆసక్తికరంగా నడిచింది. పోయిన వారం సెల్ఫ్ నామినేట్ అవడంతో హోస్ట్ నాగార్జున ఓ రేంజ్‌లో క్లాస్ పీకారు. దానిని దృష్టిలో పెట్టుకుని కంటెస్టెంట్లంతా ఎవరూ గివ్ అప్ ఇవ్వడానికి సాహించక పోవడం విశేషం. ఇదే విషయాన్ని ఓ సందర్భంలో అమ్మ రాజశేఖర్ చెప్పడం చూస్తే నాగ్ మాటలు.. వారిపై ఎంత ప్రభావం చూపాయో అర్థమవుతోంది.  మార్నింగ్ సాంగ్ తర్వాత మోనాల్ తెలుగు రైమ్ కంటెస్టెంట్లకు నేర్పించింది. తెలుగు రాని మోనాల్ ‘బావా బావా పన్నీరు’ అంటూ రైమ్ నేర్పించడం చాలా ఫన్నీగా అనిపించింది. పారు, దేవదాస్ మధ్యలో అవినాష్ వచ్చి చేరాడు. ‘ఉంగరాల జుట్టు వాణ్ని’ అంటూ మోనాల్‌ను మెప్పించేందుకు తెగ ట్రై చేశాడు. అయితే ఇదంతా ఫన్నీగానే చేస్తున్నాడు. దీనిని అఖిల్ కూడా అక్కడే కూర్చొని తెగ ఎంజాయ్ చేశాడు.

ఇక రెండు జడలు వేసుకున్న సుజాతను వదల్లేదు.. అరియానాను, లాస్యను అందరినీ ఆట పట్టించాడు. ఏది ఏమైనా మొదటి సీజన్‌లో నవదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాక హౌస్‌లో ఎంత జోష్ వచ్చిందో.. అవినాష్ ఎంట్రీ ఇచ్చాక కూడా అంతే జోష్ వచ్చింది. వాటర్, గ్యాస్‌ను ఆపేసిన బిగ్‌బాస్.. అవి పొందడం కోసం ‘ఉక్కు హృదయం’ అనే ఫిజికల్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయారు. ఒక టీం మనుషులు.. ఒక టీం రోబోలు.. మనుషులు రోబోలను చంపాలి. రోబోల వద్ద ఉన్న బాల్‌ను పగలగొడితే ఒక రోబో చనిపోతుంది. అలా అందరు రోబోలను మనుషులు చంపెయ్యాలి. లేదంటే రోబోలకు పూర్తిగా చార్జింగ్ అవగొట్టేసి చంపేయాలి. మనుషులకు ఏం కావాలన్నా.. రోబోలకు చార్జింగ్ ఇచ్చి కావల్సినవి పొందాలి. ఇదీ గేమ్.. మనుషులు పింక్ కలర్ యూనిఫాంతో.. రోబోలు సిల్వర్ కలర్ యూనిఫాంతో రెడీ అయిపోయారు.

మొదటంతా లైట్ తీసుకుని ఆడిన కంటెస్టెంట్లు తరువాత మాత్రం కుండ పగులబెట్టి సత్తా చాటారు. దీంతో రోబోగా ఉన్న దేవి చనిపోయింది. గంగవ్వ కూడా కూర్చోకుండా ఆటలో భాగమవడం ఆసక్తికరంగా అనిపించింది. అఖిల్‌కూ అభికి మధ్య చిన్న వాగ్వాదం.. అవినాష్ స్మోక్ చేస్తూ అమ్మ రాజశేఖర్‌ను ఆటపట్టించాడు. ఆ తరువాత తమ నుంచి ఫుడ్ తీసుకోవాలని రోబోలు కోరినా మనుషులు వినలేదు. అలాంటప్పుడు మాకు చార్జింగ్ ఎలా వస్తుందని రోబోలు కాసేపు వాదనకు దిగారు. తరువాత అవినాష్‌కి అంతా కలిసి బర్త్ డే విషెస్ చెప్పారు. టాస్క్‌ను నువ్వా-నేనా అన్నట్టుగా ఇరు టీంలు ఆడుతున్నాయి. మొత్తానికి బిగ్‌బాస్ హౌస్‌లో వార్ మొదలనట్టు అర్థమవుతోంది. రేపు మొత్తానికి బీభత్సమైన గొడవ జరగనున్నట్టు ప్రోమో ద్వారా తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.