close
Choose your channels

బిగ్‌బాస్ 4 ఫైన‌ల్ గెస్ట్ ఎవ‌రంటే?

Friday, December 4, 2020 • తెలుగు Comments

బిగ్‌బాస్ 4 ఫైన‌ల్ గెస్ట్ ఎవ‌రంటే?

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 ముగింపు ద‌శ‌కు చేరుకుంటోంది. ఇప్పుడిప్పుడు బిగ్‌బాస్ గేమ్‌లో కంటెస్టెంట్స్ మ‌ధ్య పోటీ చాలా బాగా పెరిగిపోయింది. హౌస్‌లో సాధారణంగా బాగానే ఉన్నారు. కానీ.. గేమ్ విష‌యానికి వ‌స్తే మాత్రం పోటా పోటీగా ఆడుతున్నారు. డిసెంబ‌ర్ 20న బిగ్‌బాస్ 4 ఫైన‌ల్ జ‌రుగుతుంది. విజేత ఎవ‌రో తెలిసిపోతుంది. అయితే ఈ విజేత బ‌హుమ‌తిని అంద‌జేయ‌డానికి వ‌చ్చే గెస్ట్ ఎవ‌ర‌నేది మాత్రం ఇంకా తేల‌డం లేదు. బిగ్‌బాస్ 4 హోస్ట్ అక్కినేని నాగార్జునతో పాటు స్టేజ్ పంచుకునే ఆ స్టార్ గెస్ట్ ఎవ‌రా అనే దానిపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇలాంటి త‌రుణంలో తాజా స‌మాచారం మేర‌కు బిగ్‌బాస్ 4కు ఎన్టీఆర్ అతిథిగా హాజ‌ర‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ 3కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వ‌చ్చాడు. మ‌రి ఈసారి కూడా అంచ‌నాలు త‌గ్గ‌కుండా ఉండాల‌ని నిర్వాహ‌కులు ఎన్టీఆర్‌ను తీసుకొస్తున్నార‌ని టాక్‌. అఖిల్‌, అభిజీత్‌, అవినాష్‌, మోనాల్ గ‌జ్జ‌ర్‌, అరియానా, హారికల‌లో ఎవ‌రు విజేత‌గా నిలుస్తార‌నేది దానిపై కాస్త ఉత్కంఠ‌త నెల‌కొంది. మ‌రో మూడు వారాలు ఆగితే ఈ సస్పెన్స్‌కు తెర‌ప‌డ్డ‌ట్టే..

Get Breaking News Alerts From IndiaGlitz