close
Choose your channels

పారు, దేవదాస్ మధ్యలో జోగి సిస్టర్స్..

Thursday, September 17, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పారు, దేవదాస్ మధ్యలో జోగి సిస్టర్స్..

బిగ్‌బాస్ షో.. ఇవాళ మాత్రం ఆసక్తికరంగా సాగింది. నేటి షోలో మన పారు, ఇద్దరు దేవదాసులతో పాటు.. జోగి సిస్టర్స్ కూడా యాడ్ అయ్యారు. పారు, దేవదాసుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జోగి సిస్టర్స్ ఎవరా అనుకుంటున్నారా? లాస్య, సుజాత. ఈ జంట.. ఎక్కడేం జరుగుతుందో గమనిస్తూ.. దానిపై చర్చ పెట్టడం.. మొనాల్, లాస్య, సుజాత మీటింగ్‌తో షో స్టార్ట్ అవుతుంది. ‘దిమ్మతిరిగే’ సాంగ్‌కి అంతా హుషారుగా డ్యాన్స్ చేశారు. ఆ తరువాత నిన్న ప్రోమోలో మన పారు, దేవదాసుల సీన్ చూపించారు కదా.. అది ప్లే అయింది. ఈ సీన్‌ని ప్రోమోలో ఓ రేంజ్‌లో చూపించారు. దీనిని చూసిన వాళ్లెవ్వరూ ఈ రోజు షోని మిస్ అయి ఉండరు. కానీ షోలో మాత్రం బిర్యానీ పెడతామని పిలిచి గంజి నీళ్లు పోస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అనంతరం అఖిల్, మొనాల్‌ల మధ్య సంభాషణ.. కెమెరాలతో వైపు చూడొద్దని మొనాల్‌కి అఖిల్ సూచించాడు.

అభి ఏదైనా చెప్తే నాకు వచ్చి చెప్పకు అని అఖిల్ మొనాల్‌కి చెప్పాడు. అలా చేయడం వల్ల నువ్వే బ్యాడ్ అయిపోతావు అని హిత బోధ కూడా చేసేశాడు. సాయి ఎవ్వరితోనూ కలవడం లేదంటూ సుజాత, లాస్య మీటింగ్. తరువాత టాస్క్. హారిక, మెహబూబ్ డ్యూయెట్. మొనాల్, సొహైల్ డ్యూయెట్ చేయాలి. లాస్య, సుజాతలతో అభిజిత్ మీటింగ్.. అభి మాటల్లో యాటిట్యూడ్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక సొహైల్, మొనాల్‌ల రిహార్సల్స్‌ని అఖిల్ దగ్గరుండి చూస్తూ ఇబ్బందికరంగా ఫీలవడం... దానిని చూసి అభి, లాస్య, సుజాత చర్చించుకోవడం టూ మచ్‌గా అనిపించింది. అయితే విచిత్రంగా.. మొనాల్, అఖిల్‌ల మధ్య ఏదో జరుగుతోందని అభి చెప్పడం కామెడీగా అనిపించింది. ఆ తరువాత మొనాల్ వెళ్లి అభితో మీటింగ్. అసలు.. మన పారు మనసులో.. దేవదాస్ ఎవరో మాత్రం అర్థం కావడం లేదు.

పారు, దేవదాస్ మధ్యలో జోగి సిస్టర్స్..

మళ్లీ మొనాల్ గురించి మన జోగీ సిస్టర్స్ లాస్య, సుజాత మీటింగ్. తరువాత అఖిల్‌తో మన పారు మీటింగ్. ఇంతలో బిబి టాలెంట్ షో స్టార్ట్ అయింది. అమ్మ రాజశేఖర్ పెర్ఫార్మెన్స్.. బన్నీ సాంగ్ ‘సినిమా చూపిస్తా మావ’ సాంగ్‌కి చేశారు కానీ బన్నీనైతే కొట్టలేకపోయారనిపించింది. ఇక మన పారు డ్యూయెట్‌ను దేవదాసులిద్దరూ పక్కపక్కన కూర్చొని ఎంజాయ్ చేయడం.. ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. కెమెరా కూడా ఈ విషయాన్ని కనిపెట్టేసి పారు పెర్ఫార్మ్ చేస్తున్నంత సేపూ ఫోకస్ ఆ ఇద్దరిపైనే పెట్టిందనుకోండి. షర్ట్ ఎలా తడిచిపోయిందని సొహైల్‌ని యాంకర్‌గా ఉన్న అరియానా అడిగితే మా ఇద్దరి ప్రేమ వల్ల తడిచిపోయిందనగానే కెమెరా.. వెంటనే అభి, అఖిల్‌ల వైపు తిరగడం ఆసక్తికరంగా అనిపించింది. పెర్ఫార్మెన్స్‌లు ముగిశాక.. గంగవ్వ మంచి జానపదంతో హుషారు తెప్పించింది. అయితే స్టార్ పెర్ఫార్మర్‌ మేల్‌గా మెహబూబ్.. ఫిమేల్‌గా హారిక ఎంపికయ్యారు. ప్రోమోని బట్టి రేపు మరో సర్‌ప్రైజ్‌ను వైల్డ్ కార్డు రూపంలో ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.