close
Choose your channels

బిగ్‌బాస్ 4 గ్రాండ్‌గా ప్రారంభం..

Sunday, September 6, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 4 గ్రాండ్‌గా ప్రారంభం..

తెలుగు టీవీ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకులను కనువిందు చేసేందుకు గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఈ షోపై ఎప్పటి నుంచో రకరకాల కథనాలు వెలువడుతూ రావడంతో మరింత క్రేజ్ పెరిగింది. సీజన్ 3కి హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జునయే తిరిగి సీజన్ 4కి కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. షో కొద్ది రోజుల క్రితమే ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యమైంది.

కొద్ది రోజుల క్రితం వరకూ ఈ షో ఉంటుందా.. లేదా అనే దానిపై అనుమానాలు తలెత్తాయి. అనుమానాలన్నింటికీ చెక్ పెడుతూ బిగ్‌బాస్ నిర్వాహకులు ఒక్కొక్క అప్‌డేట్‌ను ఇస్తూ చివరికి షో ప్రారంభ తేదీని కూడా ప్రకటించేశారు. ఈ షో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. హోస్ట్ నాగార్జున తన అద్భుతమైన వాక్చాతుర్యంతో కలర్‌ఫుల్‌గా ఈ షో ప్రారంభమైంది. మెడ్లీతో అద్బుతమైన డ్యాన్సుల మధ్య నాగ్ లోగోను ప్రారంభించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.