close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: తొలి ప్రేమ తీపి గుర్తులు గుండెల్లో గుచ్చుతుంటే... పిండేసిన కంటెస్టెంట్లు

Friday, September 24, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 5 తెలుగు: తొలి ప్రేమ తీపి గుర్తులు గుండెల్లో గుచ్చుతుంటే... పిండేసిన కంటెస్టెంట్లు

ఈ వారం నామినేషన్స్ ప్రారంభమైన నాటి నుంచి కొట్టుకోవడం, తిట్టుకోవడం, కోపతాపాలతో హీటెక్కిన బిగ్‌బాస్ హౌస్‌లో ఈ రోజు మాత్రం కన్నీళ్లు రాజ్యమేలాయి. తమ జీవితంలోని ఫస్ట్ లవ్ గురించి చెప్పి కంటెస్టెంట్స్ ఏమోషనల్ అయ్యారు. ముఖ్యంగా ప్రియాంక, సిరిల గతం ఇంటి సభ్యులను కంటతడి పెట్టించారు. మరి వీరిద్దరి జీవితంలో చోటు చేసుకున్న విషాదం ఏంటో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్‌ వివరాలు తెలుసుకోవాల్సిందే.

ప్రియ నెక్లెస్‌ దొంగిలించాలన్న సీక్రెట్‌ టాస్క్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసినందుకుగానూ యాంకర్‌ రవి కెప్టెన్సీకి పోటీపడేందుకు అర్హత సాధించాడు. ఈ వారం కెప్టెన్సీకి ఎవరెవరు పోటీపడతారో మీరే తేల్చుకుని చెప్పాలని నిర్ణయాన్నికంటెస్టెంట్లకే వదిలేశాడు బిగ్‌బాస్. దీంతో జెస్సీ, రవి, శ్వేత, శ్రీరామచంద్ర కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. అయితే లహరి కూడా కెప్టెన్సీకి ట్రై చేస్తానని అన్నప్పటికీ ఈ విషయంలో ఆమెకు ఎవరు అండగా నిలవకపోయేసరికి బాగా హర్ట్‌ అయింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: తొలి ప్రేమ తీపి గుర్తులు గుండెల్లో గుచ్చుతుంటే... పిండేసిన కంటెస్టెంట్లు

మరోవైపు షణ్ముఖ్ తనను దూరం పెడుతున్నాడంటూ సిరి బాగా హర్ట్ అయ్యింది. తనతో మాట్లాడాలంటూ హౌస్‌లో అతని వెంట పడింది. దీనికి కొంచెం కూడా రెస్పాండ్ అవని షణ్ణూ.. నీతో ఫ్రెండ్‌షిప్ ఇష్టం లేదని తెగేసి చెప్పాడు. దీంతో సిరి ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ మారిపోయాయి. ఆ వెంటనే కాజల్ దగ్గర షణ్ణూ వ్యవహారంపై డిస్కషన్ పెట్టింది సిరి. షణ్ను 24 గంటలు శ్వేతతో ఉంటున్నాడు, నేనేమైనా అంటున్నానా? నాకు స్పేస్‌ ఇవ్వట్లేదు, దూరం పెడుతున్నాడు' అంటూ కాజల్‌ దగ్గర ఏడ్చేసింది సిరి. అయితే వీళ్లిద్దరినీ కలిపేందుకు జెస్సీ విశ్వ ప్రయత్నం చేశాడు.

ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్‌ 'స్విమ్‌ జర స్విమ్‌' టాస్క్‌ షురూ అయింది. పూల్‌లోని కెప్టెన్సీ లెటర్స్‌ను తీసుకొచ్చి కెప్టెన్‌ అని రాసున్న ఖాళీ స్లాట్స్‌లో పెట్టడమే టాస్క్. టాస్క్ లో జెస్సీ అందరికంటే తొందరగా కెప్టెన్‌ అనే అక్షరాలను స్విమ్మింగ్‌ పూల్‌లో నుంచి తీసుకొచ్చి తనకిచ్చి బాక్స్ లో ఫిక్స్ చేశాడుఅనంతరం అతడు తన స్నేహితుడు షణ్ముఖ్‌ను రేషన్‌ మేనేజర్‌గా నియమించాడు. అయితే జెస్సీ కెప్టెన్‌ అవగానే గ్రూపులు స్టార్ట్‌ అయ్యాయని లోబో క్రిటిసైజ్ చేశాడు.

అనంతరం తొలి ప్రేమ జ్ఞాపకాలను ఓసారి గుర్తు చేసుకోవాలని బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు 'మరుపురాని తొలి ప్రేమ' టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. మొదట షణ్ముఖ్‌ తన ఫస్ట్ లవ్‌ గురించి తెలిపారు. ఎనిమిదవ తరగతి నుంచి ఐషు అనే అమ్మాయిని ప్రేమించానని... తనకున్న సిగ్గు కారణంగా చెప్పలేకపోయానని, ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌లో ఆమె బర్త్ డే రోజు ప్రపోజ్‌ చేశానని చెప్పాడు. తన ప్రేమ విషయం చెప్పిన తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో అర్థం కాక ఇద్దరి మధ్య డిఫరెన్స్ వచ్చిందని, బ్రేకప్‌ అయ్యిందని తెలిపాడు. ఈ విషయం దీప్తి సునైనాకి కూడా తెలుసని పేర్కొన్నాడు షణ్ముఖ్‌.

బిగ్‌బాస్ 5 తెలుగు: తొలి ప్రేమ తీపి గుర్తులు గుండెల్లో గుచ్చుతుంటే... పిండేసిన కంటెస్టెంట్లు

ఆతర్వాత సిరి తన ఫస్ట్ లవ్‌ చెబుతూ కన్నీళ్లు పెట్టించింది. తన ఎదురింటి అబ్బాయి విష్ణు, తాను ప్రేమించుకున్నామని, తన ఎంగేజ్‌మెంట్‌కి ముందురోజు వచ్చి ప్రేమ విషయాన్ని చెప్పాడని, `నేను లేకపోతే ఉండలేనని, నా కాళ్లు పట్టుకుని బ్రతిమాలాడు. దీంతో ఆ రోజు రాత్రి ఇద్దరం కలిసి పారిపోయామని అయితే కొన్ని రోజులకు ఇంట్లో వాళ్లు సర్దిచెప్పి తీసుకొచ్చారని సిరి చెప్పింది. అబ్బాయి గురించి చెప్పడంతో.. పెళ్లికి ఒప్పుకున్నారు. మధ్యలో కొన్ని రోజులు రిలేషన్స్‌లో ఉన్నామని.. ఆ టైమ్‌లో కొంత గ్యాప్‌ వచ్చింది. ఓ రోజు రాత్రి మూడు, నాలుగు గంటలకు మెలుకువ వచ్చిందని.. మళ్లీ పడుకుని ఉదయం ఎనిమిది గంటలకు లేస్తే అతను చనిపోయినట్టు న్యూస్‌ వచ్చింది` అని చెప్పి కన్నీళ్లు పెట్టింది సిరి... అందరిచేత కన్నీళ్లు పెట్టించింది.

విశ్వ తన ఫస్ట్ లవ్‌ గురించి చెబుతూ, చిన్నప్పుడు తాను సుమలత అనే అమ్మాయిని ఇష్టపడ్డానని తెలిపాడు. ఆమె తనకు భార్య అయ్యే వరుస కాదని తెలిసిందని, అయినా ట్రై చేశానని చెప్పాడు. ఆ తర్వాత దూరంగా ఉన్నామని, ఆమెకి పెళ్లి అయి పాప పుట్టిందని, ఆ తర్వాత ఆమె చనిపోయిందని తెలిపారు. అయితే ఓ సిస్టర్‌ని కోల్పోయానని, ఇప్పుడు హౌజ్‌లో శ్వేత ద్వారా తనకు ఓ సిస్టర్‌ దొరికిందన్నారు.

హౌస్‌లో అందరికంటే ప్రియాంక సింగ్‌ ఎక్కువ ఏడిపించింది. అందరి హృదయాలను పిండేసింది. ఓ ఫంక్షన్‌లో రవి అనే అబ్బాయి పరిచయం అయ్యాడని ప్రేమించుకున్నామని, తను ఎంతో సపోర్ట్ చేశాడని తెలిపింది. `బ్యాక్ బోన్‌గా ఉండి, పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు. అప్పుడే అతనికి పెళ్లి సంబంధాలు వచ్చాయి. ఆ విషయం చెప్పినప్పుడు చేసుకో అన్నా. కానీ తనని పెళ్లి చేసుకుంటావని చెప్పావుగా అని అడగ్గా.. `నువ్వు అసలు అమ్మాయివేనా, నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటా` అని ముఖం మీదే చెప్పాడ`ని కన్నీళ్లు పెట్టుకుంది ప్రియాంక. అతన్ని బాగా ప్రేమించానని, ఎలాగైనా పెళ్లి చేసుకుందామని కాళ్ల మీద పడ్డానని, చివరికి అతను బండిపై వెళ్తుంటే కూడా చాలా దూరం పరిగెత్తానని, కానీ అతను తన స్వార్థం తాను చూసుకున్నాడని చెప్పింది. పది రోజుల తర్వాత కలిసినప్పుడు కూడా `నువ్వు ఎవరో తెలుసా` అంటూ తన జెండర్‌ గురించి వందల సార్లు అన్నాడని, అది తనని ఎంతో కలచివేసిందని తెలిపింది ప్రియాంక. తన విషాదకరమైన తొలి ప్రేమ జ్ఞాపకాలను పంచుకుని అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. అయితే ఇప్పుడు మాత్రం అతను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని, ఏ ఆపద వచ్చినా తాను అండగా వుంటానని తెలిపింది. అంతేకాదు దయజేసి ఇంకెప్పుడు తన లైఫ్‌లోకి రావద్దని తెలిపింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: తొలి ప్రేమ తీపి గుర్తులు గుండెల్లో గుచ్చుతుంటే... పిండేసిన కంటెస్టెంట్లు

యానీ మాస్టర్‌ చెబుతూ.. 'ప్రమోద్‌ చాలా సింపుల్‌ పర్సన్‌. నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందని డైరెక్ట్‌గా అడిగాడు. మాకు పెళ్లైంది, బాబు కూడా పుట్టాడు. మొన్న కోవిడ్‌ వచ్చినప్పుడు నొప్పి భరించలేకపోయాను. నాకు ఆసుపత్రిలో కాళ్లు ఒత్తుతూ నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. ఏ ఒక్కరోజూ నేను లేట్‌గా ఎందుకు వచ్చానని ప్రశ్నించలేదు, అంతలా అర్థం చేసుకున్నాడు' అంటూ యానీ మాష్టర్ ఎమోషనల్‌ అయింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: తొలి ప్రేమ తీపి గుర్తులు గుండెల్లో గుచ్చుతుంటే... పిండేసిన కంటెస్టెంట్లు

యాంకర్‌ రవి ఫస్ట్‌ మాట్లాడుతూ.. 'సాయిబాబా గుడిలో హారతి ఇచ్చే సమయంలో ఆమెను చూశాను, వావ్‌ అనిపించింది. ఆ అమ్మాయి కోసమే కాలేజీలో చేరాను. నాఫ్రెండ్‌ ఆ అమ్మాయితో సెట్‌ చేయమని అడిగితే నేను మెల్లిగా వాడిని సైడ్‌ చేశాను. చదువు లేకపోతే భవిష్యత్తు లేదన్న భ్రమలో ఉన్న నాకు ఆ అమ్మాయి ఏదైనా సాధించవచ్చన్న ధైర్యాన్ని నింపింది. నాలుగేళ్లు సంతోషంగా గడిపాం... మా ఇద్దరికీ పెళ్లయింది. నా భార్య నిత్యను ముద్దుగా లడ్డూ అని పిలుచుకుంటాను. లవ్‌ యూ' అంటూ ఆమె పేరు రాసిన బెలూన్‌ను రవి హ్యాపీగా ఎగరేశాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: తొలి ప్రేమ తీపి గుర్తులు గుండెల్లో గుచ్చుతుంటే... పిండేసిన కంటెస్టెంట్లు

నటరాజ్‌ మాస్టర్‌ చెబుతూ.. తనది సక్సెస్‌ఫుల్‌ లవ్‌స్టోరీ అని చెప్పాడు.. 'ప్రేమంటే పెద్దగా గిట్టేది కాదు. నా చుట్టూ కలర్‌ఫుల్‌ లైఫ్‌ ఉండేది, అందుకే నన్ను ప్రేమించిన అమ్మాయిని పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. బేబీ, రాజు అని ముద్దుగా పిలిచేది, కానీ నేను మాత్రం లెక్క చేసేవాడిని కాదు. తను నన్ను పిచ్చిగా ప్రేమించిన ఆమెను ఫస్ట్‌ టైమ్‌ క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌కు పిలిచి ప్రపోజ్‌ చేశాను, ఆతర్వాత పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. తన భార్య లేకపోతే ఇప్పుడిలా ఇక్కడ ఉండేవాడిని కాదు' అంటూ నటరాజ్ ఏమోషన్ అయ్యాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: తొలి ప్రేమ తీపి గుర్తులు గుండెల్లో గుచ్చుతుంటే... పిండేసిన కంటెస్టెంట్లు

జెస్సీ చెబుతూ, తన ఫస్ట్ లవ్‌ చిన్ని అని, ఆమెని ఎంతో ఇష్టపడ్డానని, సైకిల్‌పై ఫాలో అయ్యేవాడినని, ఓ రోజు ఛాక్లెట్‌ ఇచ్చి ప్రపోజ్‌ చేశానని, ఏం మాట్లాడకుండా తల ఊపి వెళ్లిపోయిందని చెప్పాడు. ఆ తర్వాత నెంబర్‌ కనుక్కుని ఫోన్‌ చేస్తే మాట్లాడి తన ఫోన్‌ని బ్లాక్ చేసిందని చెప్పాడు. `ఆ తర్వాత రీసెంట్‌గా మళ్లీ మెసేజ్‌ చేస్తే రిప్లై ఇచ్చింది. రెండు రోజులు కంటిన్యూగా మెసేజ్‌ చేసి, తాను చెప్పాలనుకున్న విషయాలన్నీ చెప్పి మళ్లీ బ్లాక్‌ చేసింద`న్నారు. తను ఇప్పు సింగిల్‌ అయితే తాను మింగిల్‌ అవడానికి రెడీగా ఉన్నట్టు చెప్పాడు జెస్సీ.

బిగ్‌బాస్ 5 తెలుగు: తొలి ప్రేమ తీపి గుర్తులు గుండెల్లో గుచ్చుతుంటే... పిండేసిన కంటెస్టెంట్లు

ప్రియా చెబుతూ... తన ఫస్ట్ లవ్‌ కిశోర్‌ అని, అతన్నే పెళ్లి చేసుకున్నట్టు తెలిపింది. అతను ఎంఎల్‌టీ పూర్తి చేసి హీరో అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చి తనకు పరిచయం అయ్యాడని, ఇద్దరి మధ్యా ఇష్టం పెరిగిందని, ఓ రోజు ఇంటికొచ్చి ప్రేమని వ్యక్తం చేశాడని తెలిపింది. ఆ సమయంలో డాడీ లాస్‌లో ఉన్నాడని, తను కూడా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. కొన్నాళ్ల తర్వాత తన పేరెంట్సే ఒప్పుకున్నారని, వాళ్ల పేరెంట్స్ నో చెప్పారని, కానీ తన పేరెంట్సే పెళ్లి చేశారని తెలిపింది. ఇప్పటికీ తనని ప్రేమిస్తున్నానని, కానీ సెల్ఫ్‌ రెస్పెక్ట్ మిస్‌ అయితే ఎలా ఉంటుందో తెలుసుకున్నానని, ఇప్పుడు తనది మ్యారేజా? సపరేటా? డైవోర్స్ ఏంటో తనకే అర్థం కావడం లేదని తెలిపింది. కానీ అతనే తన ఫస్ట్ లవ్‌ అని, ఇప్పటికీ ప్రేమిస్తున్నానని చెప్పింది ప్రియా.

బిగ్‌బాస్ 5 తెలుగు: తొలి ప్రేమ తీపి గుర్తులు గుండెల్లో గుచ్చుతుంటే... పిండేసిన కంటెస్టెంట్లు

కాజల్‌ మాట్లాడుతూ.. 'నాది సక్సెస్‌ఫుల్‌ లవ్‌స్టోరీ అని చెప్పింది. ఈమెయిల్‌ అడ్రస్‌ ఇచ్చుకున్నాం. మా విషయం తెలిసి నన్ను వైజాగ్‌ పంపించేశారని... తర్వాత మళ్లీ నా పేరెంట్స్‌ వచ్చి ఇంటికి తీసుకొచ్చేశారని చెప్పింది. అప్పుడు తాను 100కు డయల్‌ చేసి బలవంతంగా ఇంట్లో ఉంచారని చెప్పాను. అమ్మానాన్న అన్నం తింటుండగా పోలీసులు వచ్చారు. పోలీసులు రాగానే వెంటనే వాళ్లతో వెళ్లిపోయాను. కానీ నాకు కూతురు పెట్టాక ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమైంది. వాళ్లనెంత బాధపెట్టానో.. ఇప్పుడు వాళ్లు ఇంట్లో నా పాపను, భర్తను చూసుకుంటున్నారు కాబట్టే నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను' అని ఎమోషనల్‌ అయింది.

తర్వాత లోబో.. 14 ఏళ్ల నిజమైన ప్రేమ మాది. ఆమె తాగిన ప్లాస్టిక్‌ టీ కప్పులు, వాడిన టిష్యూ పేపర్స్‌ ఇప్పటికీ నా దగ్గరున్నాయి. ఆమెకు పెళ్లైంది, కొడుకు పుట్టాడు. నాకూ పెళ్లైంది, కూతురు ఉంది. ఆమె బర్త్‌డేకు కాలిపై టాటూ వేసుకుని గిఫ్ట్‌ ఇచ్చాను. ఈ టాటూలో మే 22న 1.30 గంటలకు ప్రపోజ్‌ చేసినట్లు ఉంటుంది. ఇది నా జీవితాన్నే మార్చేసింది. ఆమెను పిలిచే ముద్దుపేరుతోనే నా కూతురిని పిలుస్తున్నాను. అయితే ఈ రోజు ఈ స్టేజ్‌లో ఉండటానికి మాత్రం నా భార్యే కారణం' అని చెప్పుకొచ్చాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.