close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: ముగ్గురికి రవి క్షమాపణలు... ప్రియపై రంకేలేసిన లోబో, ఈవారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే

Tuesday, September 28, 2021 • తెలుగు Comments

బిగ్‌బాస్ 5 తెలుగు: ముగ్గురికి రవి క్షమాపణలు... ప్రియపై రంకేలేసిన లోబో, ఈవారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే

బిగ్‌‌బాస్ 5 తెలుగు విజయవంతంగా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. నిన్న లహరి ఎలిమినేషన్‌తో ఒక్కసారిగా షాక్‌కు గురైన ఇంటి సభ్యులు .. సోమవారం కావడంతో మళ్లీ నామినేషన్స్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గత వారం మాదిరే ఈసారి కూడా ఒక్కొక్కరి చరిత్రలు విప్పుతూ నామినేట్ చేసుకున్నారు ఇంటిసభ్యులు. మరి ఎవరు ఎవరిని నామినేట్ చేశారో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

తొలుత రవి, షణ్ముఖ్, సిరి కూర్చొని ముచ్చట్లు పెట్టారు. ''అసలు నేను అలా ఎలా మాట్లాడానో.. ఏదో ట్రాన్స్ లో మాట్లాడేశాను.. ఒక మనిషి లేనప్పుడు వాళ్ల గురించి ఎలా మాట్లాడాను..? పైగా అమ్మ మీద ఒట్టు పెట్టి అనలేదని చెప్పాను..'' అంటూ షణ్ముఖ్, సిరిల వద్ద చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు యాంకర్ రవి. 'టైమ్ తో అన్నీ అవే సెట్ అవుతాయని' షణ్ముఖ్ అనగా.. 'ముందు మనల్ని మనం క్షమించుకోగలగాలి.. ఆ తరువాత అవతలి వాళ్ల గురించి ఆలోచించాలి' అంటూ రవి అన్నాడు. తర్వాత ఇంట్లోకి వచ్చిన అతిథి బేబీ బొమ్మను బిగ్‌బాస్‌ తిరిగి తీసుకున్నాడు. ఇక హమీదా.. నువ్వంటే నాకిష్టం, నీకు ఎలా కనెక్ట్‌ అయ్యానో తెలీదు అంటూ మరోసారి శ్రీరామ్‌ దగ్గర లవ్ డిస్కషన్ పెట్టింది. కానీ శ్రీరామ్ మాత్రం ఇంకా డిటెయిల్డ్‌గా చెప్పంటూ అసలు విషయం తెలుసుకునేందుకు ట్రై చేశాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: ముగ్గురికి రవి క్షమాపణలు... ప్రియపై రంకేలేసిన లోబో, ఈవారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే

ఆ తర్వాత నామినేషన్స్ షురూ చేశారు బిగ్‌బాస్. దీనిలో భాగంగా భాగంగా ఇంటి సభ్యులు నామినేట్ చేయాలనుకుంటున్న ఇంటి సభ్యులంతా తమ ఫోటో స్టాండుల వెనుక నిల్చున్నారు. నామినేట్ చేయాలనుకునేవారు ఆ ఫోటోలోని ఓ ముక్కను తీసి నామినేట్ చేయాలి.

ప్రియా - లోబో, సన్నీలను నామినేట్ చేస్తూ.. కొన్నిరోజులుగా వారిద్దరూ తనతో సరిగ్గా ఉండడం లేదని రీజన్ చెప్పింది. విశ్వ - రవిని నామినేట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్‌లో తనకు సపోర్ట్ చేస్తానని చెప్పి హ్యాండిచ్చాడని చెప్పాడు. 'హైదరాబాద్ అమ్మాయి.. అమెరికా అబ్బాయ్' టాస్క్ లో నటరాజ్ బయట విషయాలను తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడారంటూ నామినేట్ చేశాడు.

లోబో - ప్రియాను నామినేట్ చేస్తూ.. తన లవ్ స్టోరీ గురించి చెబుతుంటే ఏదో సినిమాలా ఉందంటూ ప్రియ కామెంట్ చేసిందని.. అది తన మనసును చాలా బాధించిందని చెప్పాడు . ప్రియా మాట్లాడబోతుంటే 'నన్ను మాట్లాడనీ' అంటూ కేకలు వేశాడు. అయితే నీ అరుపుకు నేను భయపడబోనని ఆన్సర్ ఇచ్చింది ప్రియ. ఆ తరువాత లోబో తన ప్రేమను గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతూ ఏడ్చేశాడు. రవి వెళ్లి లోబోను ఓదార్చే ప్రయత్నం చేశాడు. 'మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోటి మాట్లాడొద్దు లోబో' అని ప్రియ అంది. ఆ తరువాత సిరిని నామినేట్ చేస్తూ.. కాజల్ తన లవ్ స్టోరీ చెబుతున్నప్పుడు సిరి తనకు ఆకలేస్తుందని చెప్పిందని.. ఆమె స్టోరీ చెప్పినప్పుడు వినాలి కానీ పక్కవాళ్ల గురించి మాత్రం పట్టించుకోదన్నట్లుగా రీజన్ చెప్పి నామినేట్ చేశాడు. ఇంతలో జోక్యం చేసుకున్న సిరి తనకు ఆ టైంలో నిజంగానే ఆకలేసిందని.. అందుకే చెప్పానని బదులిచ్చింది. అయితే లోబో తనపై అరవడం తట్టుకోలేకపోయిన ప్రియా కంటతడిపెట్టింది. హౌస్ మేట్స్ ఆమెని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు.

శ్రీరామచంద్ర - శ్వేతాను నామినేట్ చేస్తూ.. లాస్ట్ వీక్ లో చిన్న పాయింట్ తీసుకొని తనను నామినేట్ చేసిందని.. ఆ విషయం తనకు నచ్చలేదని రీజన్ చెప్పాడు . నామినేషన్‌లో అబ్బాయిలు స్ట్రాంగ్ అని రీజన్ చెప్పి నామినేట్ చేయడం కరెక్ట్ కాదని, బిగ్ బాస్ హౌస్ లో అందరూ సమానమేనని అంటూ యానీ మాస్టర్‌ను నామినేట్ చేశాడు. షణ్ముఖ్ - యాంకర్ రవిని నామినేట్ చేస్తూ.. గేమ్ పరంగా మీ వల్ల బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నానని రీజన్ చెప్పాడు. ఆ తరువాత లోబోని నామినేట్ చేస్తూ ప్రియా గారితో ప్రవర్తించిన తీరు బాలేదని చెప్పగా.. 'నేను చిన్న బస్తీలో ఉంటా.. బస్తీ లైఫ్ స్టైల్ వేరు.. విల్లాస్ లైఫ్ స్టైల్ వేరు' అని లోబో.. షణ్ముఖ్ కి క్లాస్ పీకుతుండగా.. 'అందరూ కిందనుంచే వచ్చారు.. ప్రతిసారి కింద నుంచి వచ్చా.. బస్తీ నుంచి వచ్చా అని చెప్పొద్దు అది తప్పు' అని షణ్నూ గట్టి పంచ్ ఇచ్చాడు. సిరి - యానీ మాస్టర్‌ని ముందుగా నామినేట్ చేసింది. లోబోని నామినేట్ చేస్తూ.. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు.. తన కామెడీ అప్పుడప్పుడు లిమిట్స్ కూడా క్రాస్ అవుతుంది.. అదే పని వేరేవాళ్లు చేస్తే తట్టుకోలేరని రీజన్ చెప్పింది.

మానస్ - లోబోని నామినేట్ చేస్తూ హౌస్‌లో తప్పుడు లాంగ్వేజ్ వాడుతున్నారని రీజన్ చెప్పాడు. ఆ తరువాత నటరాజ్ మాస్టర్‌ని నామినేట్ చేస్తూ 'మీకు ప్రాబ్లమ్ ఉంటే నాతో చెప్పేయండి.. అంతే తప్ప నన్ను గిల్లి గిచ్చి వదిలేయొద్దు' అని అన్నాడు. శ్వేతా - లోబోని నామినేట్ చేస్తూ.. విమెన్ ని రెస్పెక్ట్ చేస్తానని చెప్పి ప్రియా గారితో సరిగ్గా బిహేవ్ చేయలేదని రీజన్ చెప్పింది. టాస్క్ లు బాగానే ఆడుతున్నారు కానీ హౌస్ యాక్టివిటీస్‌లో సరిగ్గా ఉండడం లేదని రీజన్ చెప్పింది. హమీద - లోబోని నామినేట్ చేసింది. ఆ తరువాత నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేస్తూ.. కిచెన్‌లో తనను పని చేయనివ్వడం లేదని రీజన్ చెప్పింది.

నటరాజ్ - 'విశ్వ మనం గేమ్ ఆడాలి కానీ అతిగా నటించకూడదు.. నువ్ ఇప్పుడు నాకు స్ట్రాంగ్ అని కూడా అనిపించడం లేదంటూ' విశ్వని నామినేట్ చేయగా.. విశ్వ-నటరాజ్ మాస్టర్ ల మధ్య కాసేపు వార్ నడిచింది. 'సింహంతో వేట నాతో ఆట రెండూ ప్రమాదమే' అంటూ సినిమా డైలాగులు కొట్టారు నటరాజ్ మాస్టర్. 'అవన్నీ నీ దగ్గర పెట్టుకో' అంటూ విశ్వ కోపంగా చెప్పాడు. ఆ తరువాత రవిని నామినేట్ చేశారు నటరాజ్ మాస్టర్. ప్రియాంక - లోబోని నామినేట్ చేస్తూ.. తనను తప్పుగా ముట్టుకున్న విషయాన్ని రీజన్‌గా చెప్పింది. ఆ తరువాత కాజల్‌ని నామినేట్ చేసింది.

రవి - ''మీ అందరి ముందు తలెత్తుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. శనివారం నా జీవితంలో వరస్ట్ డే అని చెప్పాలి. ఈ విషయంలో ముగ్గురికి సారీ చెప్పాలి.. ఒకరు ప్రియా, రెండు లహరి, ఇంకొకరు మా అమ్మకు. ఎంత దారుణమంటే నేను మీకే(ప్రియా) చెప్పిన మాట.. చెప్పలేదని మా అమ్మ మీద ఒట్టేశా.. ఓ మగాడు అలా మాట్లాడకూడదు కానీ మాట్లాడాను.. లహరి వెళ్లిపోవడంతో షాక్‌కి గురయ్యా, చాలా బాధగా ఉందని. ఒకవేళ ఆమె ఉంటే కచ్చితంగా సాల్వ్ చేసుకునేవాడిని' అని ఎమోషనల్ అయ్యాడు. ఆ తరువాత కాజల్‌ని నామినేట్ చేశాడు. ఆ వెంటనే నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేస్తూ.. 'గుంటనక్క నన్ను హాంట్ చేస్తుంది.. ఇక్కడున్న వారందరికీ తెలుసు మీరు నన్ను ఉద్దేశించే అన్నారని..' అంటూ రీజన్ చెప్పాడు.

యానీ మాస్టర్ - హౌస్‌లో స్ట్రాంగ్‌గా ఉన్నవాళ్లను, నన్ను నామినేట్ చేసినవాళ్లనే నేను నామినేట్ చేస్తానని చెప్పి.. శ్రీరామచంద్ర, సిరిలను నామినేట్ చేసింది. సన్నీ - తనను సేఫ్ గేమ్ ఆడుతున్నాడని అంటున్నారని ప్రియా, కాజల్ లను నామినేట్ చేశాడు. జెస్సీ - బిగ్ బాస్ రూల్స్ ను ప్రియాంక సరిగ్గా ఫాలో అవ్వడం లేదని ఆమెని నామినేట్ చేశాడు. ఆ తరువాత యాంకర్ రవిని నామినేట్ చేశాడు. అనంతరం ఈ వారం నటరాజ్‌, లోబో, రవి, ప్రియ, కాజల్‌, సిరి, సన్నీ, యానీ మాస్టర్‌ నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz