ఆ ఇద్దరు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌‌కు దశ తిరిగిందిగా.. ఏకంగా చరణ్- శంకర్‌ల సినిమాలో ఛాన్స్..?

  • IndiaGlitz, [Thursday,November 18 2021]

బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి భారతదేశంలో ఉన్న క్రేజ్‌ ఏంటో అందరికి తెలిసిందే. హాలీవుడ్ నుంచి హిందీకి ఆ తర్వాత దేశంలోని ప్రాంతీయ భాషల్లోకి బిగ్‌బాస్ దిగుమతి అయ్యింది. స్టార్‌లు హోస్ట్‌లుగా రావడంతో బిగ్‌బాస్ క్రేజ్ పెరిగిపోయింది. ఇంటిల్లిపాదికి వినోదం కల్పించడంతో భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా.. ఈ బిగ్‌ రియాల్టీ షోకి ఫ్యాన్స్‌ ఉన్నారు. తెలుగులో అయితే ఈ షోకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మిగతా రీజనల్ లాంగ్వేజ్‌ల కంటే కాస్త ఎక్కువ అనే చెప్పాలి. గత నాలుగు సీజన్ల టీఆర్పీ రేటింగ్స్‌ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌గా వ్యవహరించి బయటకు వచ్చిన వారికి యువతలో క్రేజ్ బాగానే వుంటుంది. ఆ వెంటనే ఎందరికో సినిమాల్లో అవకాశాలు వచ్చిన ఘటనలు వున్నాయి. ఇక బిగ్‌బాస్ ఐదో సీజన్‌ విషయానికి వస్తే.. ఈ సీజన్‌లో పాల్గొన్న ఇద్దరికి సినిమా అవకాశాలు దక్కినట్లుగా టాలీవుడ్ టాక్. ఆ ఇద్దరు ఎవరో కాదు.. ఒకరు విశ్వ అయితే మరొకరు లొబో. వీరిద్దరికీ మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ సినిమాలో ఛాన్స్ దొరికినట్లు కథనాలు వస్తున్నాయి. తమిళ దర్శక దిగ్గజం శంకర్‌ - రామ్ చరణ్‌ల కాంభినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో లోబో, విశ్వలు నటించనున్నట్లు సమాచారం. వీరిద్దరూ చెర్రీతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది. మరి లోబో, విశ్వలకు నిజంగానే చరణ్ సినిమాలో ఛాన్స్ దక్కిందో లేక ఏదైనా సందర్భంలో దిగిన ఫోటోనా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

More News

అర్జును ఫల్గుణ సెకండ్ సింగిల్ ‘కాపాడేవా? రాపాడేవా?’ విడుదల

కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్.

'పుష్పక విమానం' హిందీ రీమేక్ కోసం మంచి డిమాండ్, పోటీ పడుతున్న మూడు ప్రముఖ సంస్థలు

ఆనంద్ దేవరకొండ నటించిన  "పుష్పక విమానం".సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతుంది.

'ఐరావతం' టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్

రేఖ పలగాని సమర్పణలో నూజివీడు టాకీస్ బ్యానర్ పై అమర్ దీప్, తన్వి నెగ్గి, ఎస్తేర్ , అరుణ్ కుమార్, రవీంద్ర,సంజయ్ నాయర్ జయ వాహిని నటీనటులుగా

‘జై భీమ్’ సినిమా: సూర్యకు  బెదిరింపులు.. చెన్నై పోలీసులు అప్రమత్తం

స్టార్ హీరో స్టేటస్‌ను పక్కనబెట్టి మరి వైవిధ్యభరితమైన చిత్రాలు, కథలతో గుర్తింపు తెచ్చుకున్నారు సూర్య.

”అనుభవించు రాజా” ట్రైలర్ : నవ్వులు పండించిన రాజ్ తరుణ్, ఈసారైనా హిట్ గ్యారెంటీయేనా..?

రాజ్ తరుణ్ హీరోగా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో 'అనుభవించు రాజా' సినిమా రూపొందింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.