బిగ్‌బాస్ 5 తెలుగు: 'నన్ను తీసి పడేస్తారు.. జోకర్, లఫంగ్ అంటారు' హౌస్ మెంబర్స్‌పై లోబో సీరియస్

  • IndiaGlitz, [Thursday,September 23 2021]

నామినేషన్స్‌తో హౌస్‌లో మరోసారి చిచ్చుపెట్టాడు బిగ్‌బాస్‌. సోమవారం మొదలైన ఈ రచ్చ బుధవారానికి కూడా కంటిన్యూ అయ్యింది. కంటెస్టెంట్‌ల మధ్య దూరాన్ని దగ్గర తగ్గించేందుకు ఫన్నీ టాస్క్‌ ఇచ్చాడు. అయినప్పటికీ ఇంట్లో పరిస్ధితి ఏమాత్రం సద్దుమణగలేదు. మరి నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌ ఏంటో ఒకసారి చూస్తే..

నిన్నటి ఎపిసోడ్ లో ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్'హైదరాబాద్‌ అమ్మాయి - అమెరికా అబ్బాయి' ఈరోజు కూడా కంటిన్యూ అయింది. లహరి-శ్రీరామచంద్రల పెళ్లి చెడగొట్టమని మానస్.. మ్యారేజ్ బ్రోకర్ షణ్ముఖ్, ఈవెంట్ మేనేజర్ లోబోలకు కోటి రూపాయలు ఆఫర్ చేశాడు. ఆ తరవాత రవిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అందులో భాగంగా ప్రియా నెక్లెస్ ను దొంగిలించాల్సి ఉంటుంది. పట్టుబడినా.. టాస్క్ గురించి ఎవరికైనా చెప్పినా కెప్టెన్సీ టాస్క్ కి పోటీదారులైనా అవకాశాన్ని కోల్పోతారని హెచ్చరించారు బిగ్ బాస్.

ఆ తరువాత షణ్ముఖ్-జెస్సీ కలిసి సిరి గురించి చర్చించుకున్నారు. తనకు సిరిని ఇంక దూరం పెట్టాలని ఉందని.. సేఫ్ గేమ్ ఆడుతూ తన యూనిక్ స్టైల్ ను లూజ్ అవుతుందని షణ్ముఖ్ అన్నాడు. బహుశా తనే సిరి నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్లు షణ్ముఖ్ చెప్పాడు.

ప్రియా చేసిన కామెంట్స్‌ను గుర్తు తెచ్చుకుంటూ ఫీలైపోయింది లహరి. రవితో కలిసి గార్డెన్ ఏరియాలో నడుస్తూ.. ఇప్పటివరకు తనపై ఎలాంటి రూమర్స్ లేవని.. కానీ ఇప్పుడేమో ఇలా అంటూ ఫీల్ అవుతుండగా.. రూమర్స్ రాకపోవడమే బ్యాడ్ అని.. రూమర్స్ అనేవి ఉంటేనే సెలబ్రిటీ అవుతావని అన్నాడు. పబ్లిక్ ఫిగర్ వి కాబట్టి నలుగురూ నానామాటలు అంటారని పరిశ్రమలో వున్న వారి పరిస్థితుల గురించి చెప్పాడు.

ఇక ఉదయాన్నే 'వచ్చిండే.. మెల్లమెల్లగా వచ్చిండే' సాంగ్ కి హౌస్ మేట్స్ డాన్స్ చేశారు. ఆ తరువాత మానస్ ని కాసేపు ఆటపట్టించాడు రవి. శ్రీరామచంద్ర పెళ్లి క్యాన్సిల్ చేయమని షణ్ముఖ్ ని రిక్వెస్ట్ చేసింది సిరి. షణ్ముఖ్-శ్వేతా డీల్ మాట్లాడుకుంటూ ఉంటారు. లోబోకి హ్యాండ్ ఇచ్చి ఇద్దరం జెండా ఎత్తేద్దాం అంటాడు షణ్ముఖ్. ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇస్తే ఓకే చెబుతుంది శ్వేతా. దానికి షణ్ముఖ్ తనను పెళ్లి చేసుకుంటే మొత్తం డబ్బులు నీవే అంటాడు. దానికి ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసి హగ్ చేసుకుంటుంది. ఈ విషయంలో లోబో సీరియస్ అవుతూ అలా ఎలా చేస్తావ్ శ్వేతా అంటూ ఫీలవుతూ ఉంటాడు. మరోవైపు ప్రియాంక కూడా షణ్ముఖ్‌కు ట్రై చేయగా.. ఆమె నుంచి తప్పించుకున్నాడు. అలా సిరి, శ్రీరాంచంద్ర, సన్నీ, కాజల్, జెస్సీ, ప్రియాంక ఇలా అందరూ తమకిచ్చిన పాత్రల్లో లీనమై నటించేశారు.

ఆ తరువాత లోబో శ్వేతకు ప్రపోజ్ చేస్తాడు. అది షన్ను చూసి శ్వేతను పిలిచి 'ఆయన పట్టుకుంటే ఆపట్లేదేంటి నువ్వు?' అనుకుంటూ లోపలికి వెళ్లిపోతుంటాడు. దానికి శ్వేత 'సార్ ఆగండి' అనుకుంటూ అతని వెనకే వెళ్తుంది. 'ఏమైనా అందామంటే ముఖంమ్మీద పెయింటేసి కొడతుంది మళ్లీ' అని టంగ్ స్లిప్పయ్యాడు షణ్ముఖ్. ఆ డైలాగ్ కు శ్వేతకు చాలా కోపం వచ్చి 'దట్ వజ్ నాట్ ఫన్నీ' అంటూ రెస్ట్ రూమ్ లోకి వెళ్లిపోయింది.

ఈ విషయంలో లోబో కాస్త సీరియస్ అవుతూ.. షణ్ముఖ్ తో ముచ్చట్లు పెట్టాడు. 'ఇంటిలో చాలా మంది నన్ను తీసి పడేస్తారు.. జోకర్ అంటారు.. లఫంగ్ అంటారు.. అన్నీ లైట్ తీసుకుంటున్నా కదా.. అబ్బాయిలను ఏమైనా అనొచ్చు.. అమ్మాయిలను అంటే మాత్రం తప్పు.. అమ్మాయిలు చేసేది మాత్రం తప్పు కాదు. కొన్ని విషయాలు లైట్ తీసుకోవాలి'' అంటూ పరోక్షంగా శ్వేతను ఉద్దేశిస్తూ లోబో కామెంట్ చేశాడు. ఆ తరువాత తనకు పిల్లలు గుర్తొస్తున్నారంటూ లోబో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇక సీక్రెట్ టాస్క్‌లో భాగంగా రవి దొంగిలించిన నగల బాక్స్‌ను వెతుక్కుంటూ ఉంటుంది ప్రియా. కానీ ఆమెకి బాక్స్ మాత్రం దొరకదు. ఆ తరువాత హౌస్ మేట్స్ అందరూ కలిసి లహరి-శ్రీరామ్‌లకు పెళ్లి చేసేశారు.

అటూ షణ్ముఖ్-లోబో డిస్కషన్ కంటిన్యూ అవుతూ వుంటుంది. స్కిట్‌లో వాళ్లిద్దరికీ ఫ్యామిలీ మెంబర్ రోల్స్ ఇవ్వలేదంటే.. పెర్ఫార్మర్స్ అనే విషయం బిగ్ బాస్ కి తెలుసనీ.. చాలా హ్యాపీగా ఉందని షణ్ముఖ్ అన్నాడు. మరోపక్క రవి-కాజల్-లహరిలు హౌస్‌లో ఎవరి పెర్ఫార్మన్స్ బాగుందో మాట్లాడుకుంటూ ఉంటారు. షణ్ముఖ్ ఇంకా బాగా చేసి ఉండాల్సిందని.. లోబో-శ్వేతాకు ఎటాచ్ అయి ఉండిపోయాడంటూ రవి కామెంట్ చేశాడు.

ఆ తర్వాత రాత్రి హమీదతో కలిసి ముచ్చట్లు పెట్టాడు విశ్వ. హౌస్‌లో వీక్ కంటెస్టెంట్ ఎవరని హామీదను విశ్వ అడగ్గా.. ప్రియాంక పేరు చెప్పింది. అందరినీ బాగా ఇన్‌ప్లూయెన్స్ చేసే వ్యక్తి ప్రియా అని చెప్పింది. శ్రీరామచంద్ర ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాడని, మానస్ కూడా త్వరగా చేంజ్ అయిపోతాడని చెప్పింది. జెస్సీ.. తేడా క్యారెక్టర్ అని, అసలు ఏం అర్ధం కాడని అంది. షణ్ముఖ్ విషయంలో అసలు క్లారిటీ లేదని, రవి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని తన ఓపీనియన్ చెప్పడంతో ఎపిసోడ్ ముగుస్తుంది.

More News

వ్యవస్థలపై పాశుపతాస్త్రం: ఆలోచింపజేస్తున్న సాయిధరమ్ తేజ్ ‘‘రిపబ్లిక్’’ ట్రైలర్

మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రిపబ్లిక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.

'లవ్ స్టోరి' ప్రతి అమ్మాయి, మహిళ తప్పక చూడాల్సిన సినిమా - హీరోయిన్ సాయి పల్లవి

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా "లవ్ స్టోరి".

'బీస్ట్' నెల్సన్ దర్శకత్వంలో 'డాక్టర్ వరుణ్' గా శివ కార్తికేయన్

శివకార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెలుగు - తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ' డాక్టర్' .

దగ్గుబాటి బాబాయ్ - అబ్బాయ్ కలయికలో 'రానా నాయుడు'... త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

విక్టరీ వెంకటేశ్, రానా కలిసి నటిస్తే చూడాలన్నది దగ్గుబాటి అభిమానుల కల ఇన్నాళ్లకు నెరవేరనుంది. గతంలో రానా నటించిన ‘కృష్ణం వందే జగద్గురుం’ చిత్రంలో వెంకటేశ్ అతిథి పాత్రలో అలరించాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: ప్రియ, హమీదల మధ్య బాడీ షేమింగ్ రచ్చ... 'హగ్' కామెంట్స్‌పై లహరికి ప్రియ క్షమాపణలు

బిగ్‌బాస్ హౌస్‌లో ఈరోజు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడంతో హౌస్ హీటెక్కిపోయింది. ప్రతి ఒక్కరు విషయాన్ని పర్సనల్‌గా తీసుకోవడం, ఎఫైర్