close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: నటరాజ్ మాస్టర్ ఔట్.. వెళ్తూ వెళ్తూ అతను 'గుంట నక్క' ఎవరో తేల్చేసారు

Monday, October 4, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 5 తెలుగు: నటరాజ్ మాస్టర్ ఔట్.. వెళ్తూ వెళ్తూ అతను గుంట నక్క ఎవరో తేల్చేసారు

బిగ్‌బాస్ 5 తెలుగు ఆదివారం ఎపిసోడ్ ఆద్యంతం సందడిగా ఫన్నీగా సాగింది. అయితే ఎలిమినేషన్ ప్రక్రియ మాత్రం ఉత్కంఠగా, ఎమోషన్‌లతో కంటతడిపెట్టించింది. ఈ వారం అందరూ ఊహించినట్లుగానే నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడంతో ఇంటిసభ్యులు కంటతడిపెట్టారు. వెళ్తూ వెళ్తూ ఆయన కంటెస్టెంట్ల గురించి చెప్పారు. మరి ఆ వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

ఇవాళ షో ప్రారంభమైన వెంటనే హౌస్‌మేట్స్ నాగార్జునకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆయన నటించిన 'నిన్నే పెళ్లాడతా' మూవీ విడుదలై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇంటిసభ్యులు అందరూ కలిసి ఆ చిత్రంలోని పాటలకు డాన్స్ చేసి నాగ్‌ను అలరించారు. వాళ్ల పెర్ఫార్మన్స్ చూసిన నాగ్ గూస్ బంప్స్ వచ్చాయని.. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని ఏమోషన్ అయ్యారు. అనంతరం కంటెస్టెంట్లను రెండు టీమ్‌లుగా విడగొట్టి.. ఓ గేమ్ ఆడించారు కింగ్. శ్రీరామ్‌, నటరాజ్‌, యానీ, ప్రియ, మానస్‌, జెస్సీ, సిరి, రవి A టీమ్‌ కాగా మిగతావారు B టీమ్‌లో ఉంటారని చెప్పారు.

ఆట విషయానికి వస్తే.. ప్రతి జట్టులోనుంచి ఒక్కొక్కరు బాక్స్‌లో నుంచి చీటీ తీయాలి. అందులో ఉన్న సినిమా పేరును హింట్‌ ఇస్తూ డ్రాయింగ్‌ వేయాలి. అది చూసి సదరు టీమ్‌ మెంబర్స్‌ సరైన ఆన్సర్‌ చెప్పాలి. కరెక్ట్‌ ఆన్సర్‌ గెస్‌ చేస్తే డ్రాయింగ్‌ వేసిన కంటెస్టెంట్‌ వారికి నచ్చినవాళ్లతో డ్యాన్స్‌ చేయొచ్చు. ఈ క్రమంలో విశ్వ- ప్రియాంక సింగ్‌ నరుడా.. ఓ నరుడా సాంగ్‌కు రెచ్చిపోయి మరీ డ్యాన్స్‌ చేశారు. పింకీ విశ్వ చొక్కా విప్పేయగా.. అతడు ఆమెను ఎత్తుకుని, హత్తుకుని మరీ స్టెప్పులేసి అందరినీ షాక్‌కు గురిచేశాడు. అయితే ఇది పాటలా కాకుండా మరో వైపు డైవర్ట్ అవుతున్నట్లు భావించి పాట ఆపేయండనని కోరడం విశేషం. ఈ గేమ్‌లో టీమ్‌ A గెలిచింది. తర్వాత యానీ మాస్టర్‌ సేఫ్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: నటరాజ్ మాస్టర్ ఔట్.. వెళ్తూ వెళ్తూ అతను గుంట నక్క ఎవరో తేల్చేసారు

తర్వాత హౌస్‌మెట్స్‌తో నాగ్‌ 'దాక్కోదాక్కో మేక' గేమ్‌ ఆడించాడు. ఇందులో ఎవరు పులి, ఎవరు మేక అని పేర్లు చెప్పిన నాగ్‌ 30 సెకన్లలో మేకను పట్టుకోకపోతే పులి చచ్చిపోతుందని, పులికి పనిష్మెంట్‌ ఉంటుందన్నాడు. ఒకవేళ మేకను పట్టుకుంటే మేక చచ్చిపోవడంతో పాటు వారికి పనిష్మెంట్‌ ఉంటుందని తెలిపాడు. మొదటగా పులిగా వచ్చిన శ్రీరామ్‌.. హమీదాను వేటాడి పట్టుకున్నాడు. దీంతో హమీదా తనకు విధించిన శిక్షలో భాగంగా డ్యాన్స్‌ చేసి అందరినీ పడగొట్టింది.

తర్వాత జెస్సీని పట్టుకోవడంలో విఫలమైన శ్వేతను నాలుకతో ముక్కును టచ్‌ చేయాలని పనిష్మెంట్ ఇచ్చాడు నాగ్‌. కానీ శ్వేత ఎంత ప్రయత్నించినా ముక్కును అందుకోలేకపోగా సిరి చాలా ఈజీగా నాలుకతో ముక్కును అంటుకుంది. అనంతరం పులిలా వచ్చిన ప్రియాంక.. మానస్‌ను వెంటాడగా అతడు దొరక్కుండా ఉండేందుకు ట్రై చేశాడు. ఈ క్రమంలో అతను స్విమ్మింగ్‌ పూల్‌లో పడటంతో నాగ్‌తో సహా అందరూ షాకయ్యారు. ఇక గేమ్‌లో ఓడిపోయిన మానస్‌ పదిసార్లు కప్ప గెంతులు వేశాడు.

తర్వాత ప్రియ.. సన్నీని పట్టుకోలేకపోవడంతో ఆమెను హూలా హూప్‌తో డ్యాన్స్‌ చేయమన్నాడు నాగ్‌. హూప్‌ను తిప్పడం సాధ్యపడని ప్రియ దాంతో డ్యాన్స్‌ చేయడానికి అష్టకష్టాలు పడింది. ఆ తర్వాత సిరి.. షణ్నును పట్టేసుకోగా ఓడిపోయిన షణ్ముఖ్‌తో బెల్లీ డ్యాన్స్‌ చేయించాడు నాగ్‌. పులిలా వచ్చిన కాజల్‌.. లోబో మీద పంజా విసరడంతో అతడు 15 పుషప్స్‌ చేశాడు. అనంతరం రవి.. యానీ మాస్టర్‌ను అలవోకగా పట్టుకున్నాడు. దీంతో యానీ.. రవి చేతిలో ఓడిపోయానని డైలాగ్‌ చెప్తూ తీన్మార్‌ స్టెప్పులేసింది. తర్వాత నామినేషన్స్ లో ఉన్న హౌస్ మేట్స్ చేతిలో మూడు కవర్లు పెట్టారు. ఎవరికైతే ఫుల్ హార్ట్ వస్తుందో వాళ్లు సేఫ్ అయినట్లు అని చెప్పారు నాగ్. ఈ టాస్క్ లో సిరికి ఫుల్ హార్ట్ రావడంతో ఆమె సేఫ్ అయింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: నటరాజ్ మాస్టర్ ఔట్.. వెళ్తూ వెళ్తూ అతను గుంట నక్క ఎవరో తేల్చేసారు

ఆ తరువాత గార్డెన్ ఏరియాలో ఉన్న రెండు కుర్చీలపై నటరాజ్ మాస్టర్, లోబోలను కూర్చోమని చెప్పారు నాగార్జున. ఈ టాస్క్ లో లోబో సేఫ్ అవ్వగా.. నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. దీంతో ఇంటి సభ్యులు గుక్కపెట్టారు. యానీ మాస్టర్ అయితే ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయింది. లోబో.. నటరాజ్ మాస్టర్ ని పట్టుకొని ఏడ్చేశాడు.

ఆ తరువాత స్టేజ్ పైకి వెళ్లిన నటరాజ్ మాస్టర్ తో ఓ గేమ్ ఆడించారు నాగార్జున. జంతువుల ఫొటోలతో ఉన్న బోర్డుని ఆయన ముందుంచి హౌస్ మేట్స్ కి సూటయ్యే జంతువుల ఫోటోల ముందు వాళ్ల ఫోటోలు పెట్టమని చెప్పారు.

పాము- సిరి, ఎలుక-లోబో, ఊసరవెల్లి-విశ్వ, మొసలి-శ్రీరామ్, చిలక-ప్రియాంక, గాడిద-మానస్, గుంటనక్క-రవి అని చెప్పి నటరాజ్ మాస్టర్ అందరి దగ్గరా వీడ్కోలు తీసుకున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.