close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: సీక్రెట్ టాస్క్‌లో జెస్సీ ఫెయిల్.. పెద్ద ‘‘ రచ్చ ’’ , వాడుకున్నారంటూ షణ్ముఖ్ ఆవేదన

Friday, October 22, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 5 తెలుగు: సీక్రెట్ టాస్క్‌లో జెస్సీ ఫెయిల్.. పెద్ద ‘‘ రచ్చ ’’ , వాడుకున్నారంటూ షణ్ముఖ్ ఆవేదన

బిగ్‌బాస్ 5 తెలుగులో కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం జరిగిన బంగారు కోడిపెట్ట టాస్క్‌కు బిగ్‌బాస్ ఫుల్‌స్టాప్ పెట్టారు. ఇక సీక్రెట్ టాస్క్‌లో గెలిచాననే ఆనందంతో వున్న జెస్సీకి ఊహించని షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్. గత కొన్ని రోజుల నుంచి సీక్రెట్ రూమ్‌లో వున్న లోబో హౌస్‌లోకి వచ్చాడు. దీంతో ఇంటి సభ్యులంతా ఏమోషనల్ అయ్యారు. శ్రీరామ్, విశ్వ, రవి, యానీలతో లోబో ఓ ప్లాన్ వేశాడు. మరి అదేంటో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.

కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం నిర్వహించిన కోడిగుడ్ల టాస్క్ ఈ రోజు కూడా కొనసాగింది. ఈరోజు ఎపిసోడ్ లో కాజల్ దాచుకున్న ఎగ్స్ ను రవి సహాయంతో సిరి దొంగిలించే ప్రయత్నం చేసింది. ఆ తరువాత షణ్ముఖ్‌తో ప్రియా ముచ్చట్లు పెట్టింది. కాజల్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందని ఎప్పుడూ అనిపించలేదా..? అని షణ్ముఖ్‌ని ప్రశ్నించింది ప్రియా. తన ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇలా ఆడితే బావుంటుందని చెప్తుంటుంది కానీ అది తప్పు అని చెప్పాడు షణ్ముఖ్. ఆ తరువాత కోడికూత వినిపించడంతో ఇంటి సభ్యులంతా ఎగ్స్ కోసం పోటీపడ్డారు. ఈ గ్యాప్ లో కాజల్ ఎగ్స్ కొన్నింటిని సిరి కొట్టేసింది.

బిగ్‌బాస్ 5 తెలుగు: సీక్రెట్ టాస్క్‌లో జెస్సీ ఫెయిల్.. పెద్ద ‘‘ రచ్చ ’’ , వాడుకున్నారంటూ షణ్ముఖ్ ఆవేదన

‘మిసెస్‌ ప్రభావతి ’ఎప్పుడు గుడ్లు పెడుతుందా అని ఇంటి సభ్యులు ఆశగా ఎదురుచూశారు. ఈ క్రమంలో మానస్‌కు రెడ్ కలర్ ఎగ్ లభించింది. దీనిని ఉపయోగించి ఐదు గుడ్లు పొందాలంటే.. ఇంటి సభ్యుల్లో ఎవరో ఒకర్ని ఎంపిక చేసుకుని వాళ్లతో కలిసి స్పైసీ నూడుల్స్‌ తినాలని బిగ్‌బాస్‌ టాస్క్‌ ఇచ్చారు. దీంతో మానస్‌.. సన్నీ సహకారం తీసుకుని ‘స్పైసీ నూడుల్స్‌’ టాస్క్‌లో పాల్గొన్నాడు. అయితే మానస్‌ కంటే సన్నీ కొంచెం ఎక్కువ తిని ఐదు కోడిగుడ్లు సొంతం చేసుకున్నాడు.

అయితే కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్‌ ముగిసిందని బిగ్‌బాస్‌ ప్రకటించడంతో హౌస్‌మేట్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఎవరి దగ్గర ఎన్ని కోడిగుడ్లు ఉన్నాయో లెక్కపెట్టమని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. కోడిగుడ్లు ఎక్కువగా సేకరించి మానస్‌, విశ్వ, సన్నీ, జెస్సీ, శ్రీరామ్‌లు టాప్‌ ఫైవ్‌లో నిలిచారు. ఇదే సమయంలో జెస్సీకి ఓ సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చినట్లు బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులందరికీ చెప్పాడు. సీక్రెట్‌ టాస్క్‌లో గెలిచాననే ఆనందంతో ఉన్న జెస్సీకి ఊహించని షాక్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. సీక్రెట్ టాస్క్ ను సరిగ్గా అర్ధం చేసుకోవడంలో, అమలు చేయడంలో జెస్సీ విఫలమవ్వడంతో అతడిని కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పించారు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం మానస్, విశ్వ, శ్రీరామ్, రవి, సన్నీలు పోటీ పడబోతున్నట్లు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. అటు జెస్సీ ఆడింది సీక్రెట్‌ టాస్క్‌ అని తెలిసి.. ప్రియ-ప్రియాంకలు షాక్‌ అయ్యారు. దీంతో కెప్టెన్సీ పోటీదారుల నుంచి జెస్సీ వెళ్లిపోయి.. ఆయన స్థానంలోకి రవి వచ్చాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: సీక్రెట్ టాస్క్‌లో జెస్సీ ఫెయిల్.. పెద్ద ‘‘ రచ్చ ’’ , వాడుకున్నారంటూ షణ్ముఖ్ ఆవేదన

సీక్రెట్ రూంలో ఉన్న లోబోని బిగ్ బాస్.. హౌస్ లోకి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తాడు. అయితే వట్టి చేతులతో కాకుండా లోబోకి రెండు స్పెషల్ ఎగ్స్ ఇచ్చి హౌస్‌లోకి పంపుతాడు. ఇందులో ఒకటి బ్లాక్ ఎగ్ మరొకటి గోల్డ్ ఎగ్. కెప్టెన్సీ పోటీదారులుగా అర్హత సాధించిన వారిలో ఒకరికి బ్లాక్ ఎగ్ ఇవ్వాలని లోబోకి చెబుతాడు. బ్లాక్ ఎగ్ పొందినవారు కెప్టెన్సీ పోటీదారుడిగా అర్హత కోల్పోతారు. మిగిలిన ఇంటి సభ్యుల్లో ఎవరో ఒకరికి గోల్డ్ ఎగ్ ఇవ్వాలి. గోల్డ్ ఎగ్ పొందిన వ్యక్తి కెప్టెన్సీ టాస్క్‌లో పోటీదారుడిగా అర్హత సాధిస్తారు. లోబో రీ ఎంట్రీ చూసి రవి, సన్నీ, ఆనీ, శ్రీరామ్ పరిగెత్తుకు వచ్చి హగ్ చేసుకున్నారు. ఇక లోబో తన నిర్ణయాన్ని అమలు చేసే సమయం వస్తుంది. బ్లాక్ ఎగ్ ని లోబో శ్రీరామ్ కి ఇస్తాడు. గోల్డ్ ఎగ్ ని కాజల్ కు ఇస్తాడు. దీనితో కాజల్ కెప్టెన్సీ పోటీ దారురాలిగా అర్హత సాధిస్తుంది.

ఇక బిగ్‌బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ మాత్రం జెస్సీ-సిరి-షణ్ణు మధ్య చిచ్చు పెట్టేసింది. నీకు సీక్రెట్ టాస్క్ ఇవ్వడం నువ్వు సిరి హెల్ప్ తీసుకోవడం మధ్యలో నన్ను ఎదవని చేయడం అని నోచ్చుకున్నాడు షణ్ముఖ్. మరోవైపు టాస్క్ సరిగా ఆడు అనే ఎదవ డైలాగ్స్ వినాల్సి వచ్చిందన్నాడు. ఫ్రెండ్ అని ఫీలయ్యాను కాబట్టే అని సిరి చెబుతుండగా... అందుకే ఇలా చేశారని కంటతడిపెట్టాడు షణ్ముక్. జెస్సీ క్లారిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నించినా షణ్ముఖ్ పట్టించుకోలేదు.

బిగ్‌బాస్ 5 తెలుగు: సీక్రెట్ టాస్క్‌లో జెస్సీ ఫెయిల్.. పెద్ద ‘‘ రచ్చ ’’ , వాడుకున్నారంటూ షణ్ముఖ్ ఆవేదన

'మీరే కెప్టెన్ లు అవ్వండి, కెప్టెన్సీ పోటీదారులవ్వండి. నా గురించి పట్టించుకోవద్దు. మీరు టాస్క్ బాగానే ఆడారు. నాకే ఆడడం రాలేదు' అంటూ పదే పదే ఆ విషయాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యాడు షణ్ముఖ్. 'దీన్నే వాడుకోవడం అంటారు' అంటూ సిరిపై మండిపడ్డాడు. దీంతో సిరి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. చివరకు షణ్ముఖ్ బాధతో భోజనం చేయడం కూడా మానేస్తాడు. సిరి ప్లేట్ లో భోజనం తీసుకువచ్చినా నేను తినను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇందులో నా తప్పేముంది.. జెస్సి నన్ను ఎంచుకున్నాడు.. నేను గేమ్ ఆడాను అని సిరి షణ్ముఖ్ కి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ షణ్ముఖ్ వినడు. సిగ్గులేకుండా నన్ను దిగజార్చారు అని వాదిస్తాడు. దీంతో సిరి కూడా కోపంగా వెళ్ళిపోతుంది. తాను ధరించిన షర్ట్ విప్పేసి విసిరికొడుతుంది.

బిగ్‌బాస్ 5 తెలుగు: సీక్రెట్ టాస్క్‌లో జెస్సీ ఫెయిల్.. పెద్ద ‘‘ రచ్చ ’’ , వాడుకున్నారంటూ షణ్ముఖ్ ఆవేదన

అనంతరం రవి, యానీ, శ్రీరామ్, విశ్వ అర్ధరాత్రి లోబోతో మీటింగ్ పెట్టారు. అందరూ గ్రూపులుగా ఆడుతున్నారని యానీ.. లోబోకి చెబుతుండగా.. 'మనం కూడా ఆడొచ్చు.. కానీ నువ్ అటు ఇటు జంప్ అవుతుంటావ్' అంటూ యానీకి కౌంటర్ ఇచ్చాడు. ఇక ఉదయాన్నే హౌస్ లో మరో ఆసక్తికర సంఘటన జరుగుతుంది. సన్నీ ప్లేట్ లో ప్రియా భోజనం చేస్తుంది. దీనితో సన్నీని అంతా ఆటపట్టిస్తారు. నేను ఈ ప్లేట్ ని అస్సలు కడగను అంటూ ప్రియా సరదాగా కామెంట్ చేస్తుంది. అంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.