close
Choose your channels

బిగ్‌బాస్: ఎవరో అలిగారని నువ్వు డైవర్ట్ అవ్వకు.. షణ్ముఖ్‌కి తల్లి స్వీట్ వార్నింగ్

Saturday, November 27, 2021 • తెలుగు Comments

బిగ్‌బాస్: ఎవరో అలిగారని నువ్వు డైవర్ట్ అవ్వకు.. షణ్ముఖ్‌కి తల్లి స్వీట్ వార్నింగ్

బిగ్‌బాస్ 5 తెలుగులో వరుసగా కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్‌ని తీసుకుని వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఎపిసోడ్‌లో రవి భార్య , కూతుళ్లు .. షణ్ముఖ్ తల్లి ఎంట్రీ ఇచ్చారు. నీ మోజ్ రూమ్ చూడాలి నేను' అంటూ ఆమె అడగడంతో షణ్ముఖ్ తీసుకెళ్లి చూపించాడు. 'నీ గేమ్ నువ్ ఆడు.. ఎవరు అలిగినా కూడా నువ్ డైవర్ట్ అవ్వకు..' అంటూ పరోక్షంగా సిరి గురించి చెప్పింది షణ్ముఖ్ తల్లి. మరి హౌస్‌లో ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

బిగ్‌బాస్: ఎవరో అలిగారని నువ్వు డైవర్ట్ అవ్వకు.. షణ్ముఖ్‌కి తల్లి స్వీట్ వార్నింగ్

ముందు రోజు ఎపిసోడ్‌లో సన్నీ తల్లి కళావతి హౌస్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అది ఈ రోజు కూడా కంటిన్యూ అయ్యింది. కళావతి అందరితో చాలా కలివిడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా తన తల్లికి సన్నీ అన్నం తినిపించాడు. సన్నీతో మాట్లాడుతూ.. గేమ్ బాగా ఆడుతున్నావని మెచ్చుకుంది. అంతేకాకుండా తనను నాగార్జున దగ్గరికి తీసుకెళ్లాలని కోరింది. ఈ సందర్భంగా ఆమె ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఉన్న బాక్స్‌ను కొడుక్కు అందించడంతో సన్నీ ఫుల్‌ ఖుషీ అయ్యాడు.

బిగ్‌బాస్: ఎవరో అలిగారని నువ్వు డైవర్ట్ అవ్వకు.. షణ్ముఖ్‌కి తల్లి స్వీట్ వార్నింగ్

ఇక సన్నీ దగ్గర ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఉండటం వల్లే పింకీ అతడికి క్లోజ్‌ అవుతుందేమోనని మానస్‌ అనుమానం వ్యక్తం చేశాడు. 'పింకీ తనను వదిలి వెళ్లిపోయిన బాయ్‌ఫ్రెండ్‌ ప్లేస్‌లో నన్ను రీప్లేస్‌ చేద్దామని చూస్తోందని... అయితే అది కుదరదని, నేను అలాంటివాడిని కాదని కాజల్‌ దగ్గర చెప్పాడు. ఇక హగ్గులు ఇవ్వడం నచ్చలేదని సిరి తల్లి చెప్పిన మాటలకు బాగా ఫీలైన షణ్ను... ఇకపై హౌస్‌లో ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా ఉందామని, ఇంట్లో వాళ్లను బాధపెట్టడం వద్దని హితవు పలికాడు. తండ్రి లేని కూతురని నీకు దగ్గరై అడ్వాంటేజ్‌ తీసుకోలేదని ఈ మాట మీ అమ్మకు చెప్పని సిరికి సూచించాడు. ఆ తర్వాత ప్రియాంక సోదరి మధు రావడంతో ఆమె ఎమోషనల్ అయింది. రాగానే ఆమె వెళ్లి మానస్‌కి సారీ చెప్పింది. గేమ్ బాగా ఆడుతున్నావని.. ఇంకా ఫోకస్ చేయాలని సూచించింది.

బిగ్‌బాస్: ఎవరో అలిగారని నువ్వు డైవర్ట్ అవ్వకు.. షణ్ముఖ్‌కి తల్లి స్వీట్ వార్నింగ్

ఆ తరువాత రవి భార్య నిత్య వచ్చింది. కూతురు రాలేదా అని రవి ప్రశ్నించగా.. తాను చాలా ట్రై చేశానని కానీ తీసుకురాలేకపోయానని చెప్పింది నిత్య. దీనికి కాస్తంత బాధపడ్డ రవికి సర్‌ప్రైజ్ ఇస్తూ.. కాసేపటికి వియా వాయిస్ వినిపించడంతో.. రవి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. కూతురుని హత్తుకొని ముద్దాడాడు. ఆ తరువాత ''రవికి అంత సీన్ లేదని'' నిత్య షణ్ముఖ్ దగ్గర కామెంట్ చేసింది. రవి కూతురు వియా.. బిగ్ బాస్ అంకుల్ ఎక్కడ..? అని తండ్రిని అడిగింది. హౌస్ మేట్స్ అందరూ కలిసి వియుతో డాన్స్ చేస్తూ.. సరదాగా ఆటలు ఆడుకున్నారు. ఇక హౌస్ నుంచి వెళుతూ... వెళుతూ.. వియు తన తండ్రిని పట్టుకొని బాగా ఏడ్చేసింది. కూతురుకి సర్దిచెప్పి హౌస్ నుంచి పంపించాడు రవి.

బిగ్‌బాస్: ఎవరో అలిగారని నువ్వు డైవర్ట్ అవ్వకు.. షణ్ముఖ్‌కి తల్లి స్వీట్ వార్నింగ్

ఇక తన ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా పంపాలంటూ షణ్ముఖ్ చేసిన విజ్ఞప్తికి బిగ్‌బాస్ స్పందించినట్లున్నాడు. ఈ రోజు ఎపిసోడ్‌లో షణ్ముఖ్ తల్లి హౌస్‌లోకి వచ్చింది. తన తల్లిని చూసిన వెంటనే షణ్ముఖ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తరువాత తన కెప్టెన్సీ బ్యాండ్ ను తన తల్లి చేతికి పెట్టి మురిసిపోయాడు. ఆ తర్వాత 'నీ మోజ్ రూమ్ చూడాలి అని ఆమె అడగడంతో షణ్ముఖ్ దగ్గరుండి ఆమెకు అంతా చూపించాడు. 'నీ గేమ్ నువ్ ఆడు.. ఎవరు అలిగినా కూడా నువ్ డైవర్ట్ అవ్వకు..' అంటూ పరోక్షంగా సిరి గురించి వార్నింగ్ ఇచ్చింది షణ్ముఖ్ తల్లి. హౌస్‌లో అందరితో బాగుండాలని షణ్ముఖ్ తల్లి చెప్పింది. ఆ తరువాత సిరి ఎగురుకుంటూ మోజ్ రూమ్‌‌లోకి వచ్చింది. ఆ వెంటనే గేమ్‌ గేమ్‌లా చూడాలని ఎక్కువ ఎమోషనల్ అవ్వొద్దు అంటూ ఇద్దరికి వార్నింగ్ ఇచ్చింది షణ్ముఖ్ తల్లి. దీనికి సిరి బదులిస్తూ 'రేపటి నుంచి వేరేలా చూస్తారంటూ చెప్పింది

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz