close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: సన్నీ ఎటాకింగ్‌కి వణికిన సిరి, శ్రీరామ్, పింకీ... చివరికి నడవలేని స్ధితికి, డాక్టర్ ట్రీట్‌మెంట్

Thursday, December 2, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 5 తెలుగు: సన్నీ ఎటాకింగ్‌కి వణికిన సిరి, శ్రీరామ్, పింకీ... చివరికి నడవలేని స్ధితికి, డాక్టర్ ట్రీట్‌మెంట్

బిగ్‌బాస్ 5 తెలుగు తుది అంకానికి చేరుకోవడంతో ఫైనల్ బెర్త్‌ల కోసం టాస్క్‌లు మొదలయ్యాయి. టికెట్ టు ఫినాల్ టాస్క్‌ సందర్భంగా సిరి- సన్నీల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. ప్రతీసారి నన్ను కావాలని కెలుకుతావని సన్నీ మండిపడ్డాడు. అటు శ్రీరామ్, షణ్ముఖ్‌లు సైతం సిరికి సపోర్ట్ చేయడంతో వివాదం ముదిరి పాకాన పడింది. ఈ లోపు ఇంట్లోకి డాక్టర్ రావాల్సి వచ్చింది. మరి హౌస్‌లో ఏం జరిగింది. ఎవరి కోసం డాక్టర్ రావాల్సి వచ్చింది. ఇలాంటి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: సన్నీ ఎటాకింగ్‌కి వణికిన సిరి, శ్రీరామ్, పింకీ... చివరికి నడవలేని స్ధితికి, డాక్టర్ ట్రీట్‌మెంట్

టికెట్ టు  ఫినాలే టాస్క్‌లో భాగంగా నిన్న ప్రారంభమైన ఐస్ వాటర్ ఛాలెంజ్‌లో కంటెస్టెంట్లు పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఇంటి సభ్యులు ఐస్ వాటర్‌లో కాళ్లు పెట్టి తమ బకెట్‌లో వున్న బంతులు కాపాడుకుంటేనే.. పక్కవారి బాల్స్‌లోని కొట్టేయాలి. గేమ్‌లో భాగంగా సిరి తన బాల్స్ లాక్కోవడంతో సన్నీ మండిపడ్డాడు. ఇప్పుడు నేను ఆడతా చూడు అంటూ ... ఎటాక్ చేశాడు. ముఖ్యంగా సిరి, శ్రీరామ్‌, పింకీలకు చుక్కలు చూపించాడు సన్నీ. వారిపై బ్యాక్‌ టూ బ్యాక్‌ ఎటాక్‌ చేయడంతో తమ కాళ్లని కంటిన్యూగా ఐస్‌లోనే పెట్టాల్సి వచ్చింది.

అందరిలోకి సిరిని ఎక్కువ టార్గెట్ చేశాడు. దీంతో ఆమె ఐస్ టబ్ లో నుంచి బయటకు రాకుండా అలానే ఉండిపోయింది. తన కాళ్లు ఐస్‌లోనే ఉన్నాయని, తనపై అన్యాయంగా ఎటాక్‌ చేశాడని ఎమోషనల్ అయ్యింది. దీంతో సన్నీ తన ఉగ్ర స్వరూపాన్ని శాంతింపజేసి ఆమె బంతుల్ని ఏరి బకెట్‌లో వేశాడు. అయితే కంటిన్యూగా ఐస్ నీళ్లలో సిరి, శ్రీరామ్‌, పింకీ కాళ్లు వుండటంతో ఐస్‌ కారణంగా గాయమైంది. చివరికి డాక్టర్లు వచ్చి వారికి ట్రీట్‌మెంట్ చేశారు. అయితే ఐస్ బకెట్‌లో నుంచి వచ్చిన తర్వాత శ్రీరామ్‌కి పింకీ జండూ బామ్ రాసి కాళ్లపై వేడి నీళ్లు పోసింది. ఎవరికీ వేడి నీళ్లు పోయొద్దని బిగ్‌బాస్ చెప్పినప్పటీకీ ప్రియాంక అలా చేయడంతో హౌస్‌మేట్స్ షాకయ్యారు. పింకీ వైద్యం కారణంగా శ్రీరామ్‌కి నొప్పి మరింత ఎక్కువైంది. దీనంతటికీ సన్నీ కారణమన్నట్లుగా షణ్ముఖ్ చూడడంతో సన్నీకి మరింత కోపమొచ్చింది. కానీ ఏమాత్రం రియాక్ట్ కాకుండా.. గార్డెన్‌లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన్ని మానస్‌, కాజల్‌ ఓదార్చారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: సన్నీ ఎటాకింగ్‌కి వణికిన సిరి, శ్రీరామ్, పింకీ... చివరికి నడవలేని స్ధితికి, డాక్టర్ ట్రీట్‌మెంట్

ఏం రాంగ్ ప్రూవ్ చేయాలనుకుంటున్నారు.. ఇంకా ఎంత బ్లేమ్ చేస్తారు అంటూ కాజల్ దగ్గర ఎమోషనల్ అయ్యాడు సన్నీ. 'నువ్వు తప్పు చేయలేదు... కావాలని ఎక్కువసేపు సిరి ఐస్ టబ్‌‌లో ఉందని, వాళ్ల గేమ్ వాళ్లు ఆడుకుంటున్నారని సన్నీని ఓదార్చింది. గేమ్ మధ్యలో రవి పేరు తీసుకొచ్చారని... ఆయనని నామినేట్ చేసింది వాళ్లే.. ఇన్ఫ్లుయెన్సర్, మానిప్యులేటర్ అని ట్యాగ్స్ ఇచ్చింది వాళ్లే.. ఈరోజేమో ఇలా' అంటున్నారని మానస్ తన అక్కసు వెళ్లగక్కాడు. మరోవైపు సిరి తనకు నొప్పిగా ఉందని షణ్ముఖ్‌తో చెప్పింది. దీనికి షన్నూ స్పందిస్తూ.. నాకు కూడా నొప్పి వుందని.. నేను ఆడలేదా, నాకు ఇంత వీక్ ఫ్రెండ్ ఉందని సిగ్గేస్తుందంటూ క్లాస్ పీకాడు. ఇక 'ఎండ్యూరెన్స్' గేమ్ లో అందరికంటే ఎక్కువ పాయింట్స్ సన్నీకి వచ్చాయి. ఆ తరువాత శ్రీరామ్, సిరిలు నిలిచారు. అందరికంటే తక్కువ పాయింట్స్ ప్రియాంకకు వచ్చాయి.

బిగ్‌బాస్ 5 తెలుగు: సన్నీ ఎటాకింగ్‌కి వణికిన సిరి, శ్రీరామ్, పింకీ... చివరికి నడవలేని స్ధితికి, డాక్టర్ ట్రీట్‌మెంట్

ఇక సెకండ్ ఛాలెంజ్ కోసం అందరూ కలిసి 'ఫోకస్' ను ఎన్నుకున్నారు. దీని ప్రకారం.. బిగ్ బాస్ ఇంటి సభ్యుల్ని పేరు పెట్టి పిలిచినప్పుడు గార్డెన్ ఏరియాలో ఉన్న చైర్స్ పై కూర్చొని 29 నిమిషాలు లెక్కించడం మొదలుపెట్టాల్సి ఉంటుంది. సరిగ్గా 29 నిమిషాలు పూర్తయ్యాయి అనుకున్నప్పుడు గార్డెన్ ఏరియాలో బెల్‌ని మోగించాల్సి ఉంటుంది. ఎవరైతే 29 నిమిషాలకు సరిగ్గా.. లేదా అందరికన్నా దగ్గరగా బెల్ మోగిస్తారో.. వారు ఈ ఛాలెంజ్‌లో గెలుస్తారని బిగ్ బాస్ చెప్పాడు. ఇందులో మానస్‌-పింకీ , సన్నీ-కాజల్‌, సిరి-షణ్ముఖ్‌ ఒక జంటగా పాల్గొన్నారు. రేపు కూడా ఈ గేమ్ కొనసాగనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.