close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: హమీదాతో డేట్‌కు శ్రీరామ్ సై... ఈ వీక్ వరస్ట్ పర్ఫార్మర్‌గా జెస్సీ

Saturday, October 2, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 5 తెలుగు: హమీదాతో డేట్‌కు శ్రీరామ్ సై... ఈ వీక్ వరస్ట్ పర్ఫార్మర్‌గా జెస్సీ

బిగ్‌బాస్ శుక్రవారం ఎపిసోడ్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. హౌస్‌మేట్స్ రూల్ సరిగా పాటించనందుకు గాను జెస్సీ కెప్టెన్సీకి పోటీపడే అవకాశాన్ని కోల్పోయాడు. ఇదే సమయంలో అతనిని వరస్ట్ ఆటగాడిగా నిర్ణయించారు. సన్నీ తన మార్క్ యాంకరింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్‌తో పాటు సరదా మిమిక్రీలు, సెటైర్లు ఆద్యంతం నవ్వులు పూయించాయి. మరి నేటి ఎపిసోడ్‌ సంగతి తెలియాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: హమీదాతో డేట్‌కు శ్రీరామ్ సై... ఈ వీక్ వరస్ట్ పర్ఫార్మర్‌గా జెస్సీ

నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో కాజల్ తనకు చెప్పిన కారణం సరిగ్గా లేదని శ్వేత ఆమెతో ముచ్చట్లు పెట్టింది. ఆ తరువాత నటరాజ్ మాస్టర్.. రవిని నత్తతో పోలుస్తూ లోబో ముందు కామెంట్ చేస్తుండగా.. అదే సమయంలో సరిగ్గా రవి అక్కడకి వచ్చాడు. అప్పుడు లోబో విషయం చెప్పగా.. 'ఏంటో ఉన్న జంతువులన్నీ ఈయన నాకే ఇస్తున్నాడు' అని ఫన్నీగా అనేసి వెళ్లిపోయాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: హమీదాతో డేట్‌కు శ్రీరామ్ సై... ఈ వీక్ వరస్ట్ పర్ఫార్మర్‌గా జెస్సీ

ఆ తరువాత ఈ విషయంపై హౌస్ మేట్స్ దగ్గర ఫీల్ అయ్యాడు రవి. 'నటరాజ్ మాస్టర్ చాలా ఇరిటేట్ చేస్తున్నాడు.. జంతువుల పేర్లు పెట్టి మాట్లాడుతున్నాడు' అని అనగా.. లోబో 'నేను ఆయనతో మాట్లాడతా' అని చెప్పాడు. వెంటనే రవి 'నా జోలికి రావొద్దని చెప్పు.. నా పేరు తీయొద్దని చెప్పు.. ఏదైనా చెప్పాలనుకుంటే ఫేస్ టూ ఫేస్ వచ్చి చెప్పమను' అంటూ ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత ప్రియాంక చీర కట్టుకొని రాగానే.. శ్రీరామచంద్ర 'వాలు కనుల దానా' అంటూ పాట అందుకున్నాడు.

ఆ తరువాత ఈ వారం హౌస్ లో బెస్ట్ పెర్ఫార్మర్, వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరో చెప్పమని అడిగారు బిగ్ బాస్. దీంతో శ్రీరామ్‌-హమీదా జంట.. లోబోను బెస్ట్‌, జెస్సీని వరస్ట్‌ పర్ఫామర్లుగా పేర్కొంది. యానీ మాస్టర్‌-శ్వేత.. శ్రీరామ్‌ను బెస్ట్‌, కాజల్‌ను వరస్ట్‌ పర్ఫామర్లుగా అభిప్రాయపడ్డారు. విశ్వ-రవి జోడీ.. మానస్‌ను బెస్ట్‌, జెస్సీని వరస్ట్‌ పర్ఫామర్లుగా పేర్కొంది. షణ్ముఖ్‌-సిరి.. మానస్‌ బెస్ట్‌, లోబో వరస్ట్‌ అని తేల్చారు. తర్వాత వచ్చిన నటరాజ్‌ మాస్టర్‌- లోబో... మానస్‌ను బెస్ట్‌, జెస్సీని వరస్ట్‌ పర్ఫామర్లుగా తెలిపారు. కాజల్‌-జెస్సీ.. మానస్‌ను బెస్ట్‌, లోబోను వరస్ట్‌గా అభిప్రాయపడ్డారు. ప్రియ- పింకీ.. మానస్‌ను బెస్ట్‌, లోబో వరస్ట్‌ అని తెలిపారు. సన్నీ- మానస్‌.. లోబోను బెస్ట్‌ అని పేర్కొంటూ వేరేవాళ్ల నుంచి ఇన్‌ఫ్లూయెన్స్‌ అవుతున్నావని జెస్సీని వరస్ట్‌ పర్ఫామర్లుగా తేల్చారు. ఓవరాల్ గా హౌస్ మేట్స్ అందరూ కలిసి బెస్ట్ పెర్ఫార్మర్ గా మానస్ ని ఎంపిక చేయగా.. వరస్ట్ పెర్ఫార్మర్ గా జెస్సీ, లోబోలకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. జెస్సీ, లోబోలకు టై అవ్వడంతో ఎవరో ఒకరిని వరస్ట్ పెర్ఫార్మర్ గా సెలెక్ట్ చేసి జైల్లో పెట్టమని కెప్టెన్ శ్రీరామచంద్రని బిగ్ బాస్ ఆదేశించారు.. దీంతో జెస్సీ పేరుని వరస్ట్ పర్ఫార్మర్‌గా ఫైనల్ చేసి అతడిని జైల్లో పెట్టారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: హమీదాతో డేట్‌కు శ్రీరామ్ సై... ఈ వీక్ వరస్ట్ పర్ఫార్మర్‌గా జెస్సీ

జైల్లోకి వెళ్లిన జెస్సీ.. 'తప్పు చేసింది వాళ్లు కానీ ప్రతీసారి నన్నే పంపిస్తున్నారు..' అని షణ్ముఖ్‌తో చెప్పి ఫీల్ అయ్యాడు. దీనికి నువ్వు 'కార్నర్ అయ్యావ్' అని షణ్ముఖ్ అన్నాడు. ఆ తరువాత శ్వేతాతో కూర్చొని షణ్ముఖ్ డిస్కషన్ పెట్టాడు. లోబోని జైల్లోకి పంపించకుండా ప్రతీసారి జెస్సీని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించాడు. ప్రియాంకను లోబో తప్పుగా పట్టుకున్నా.. ఆ విషయం ఎవరూ మాట్లాడలేదని.. నిజానికి ఆమె(ప్రియాంక) మాట్లాడాలి కానీ ఆమె అసలు మాట్లాడలేదు.. బహుశా తనకు కూడా ఓకేనెమో అంటూ ఇద్దరు నోరు జారారు.

ఇక హౌస్‌లో స్పెషల్ షో జరిగింది. దీనికి సన్నీ వీజేగా వ్యవహరిస్తూ శ్రీరామ్ ని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది. హౌస్ మేట్స్ ని ఆడియెన్స్ గా కనిపించమని ఆదేశించారు బిగ్ బాస్. ఈ క్రమంలో సన్నీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా 'బాలు గారి సాంగ్స్ వింటూ పెరిగాను.. ఆయన పాడిన పాటలు నాకు పాడడం చాలా ఇష్టం' అని ఆన్సర్ ఇచ్చాడు శ్రీరామ్. ఆ తరువాత కాజల్.. 'సిరి ఆర్ హమీద??' ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయమని అడగ్గా.. లంచ్ టీమ్ లో సిరి, డిన్నర్ టీమ్ లో హమీద అని చెప్పాడు శ్రీరామ్. 'లంచ్, డిన్నర్ ఓకే మరి టిఫిన్స్ ఎవరు సర్' అని సన్నీ ఫన్ చేసే ప్రయత్నం చేశాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: హమీదాతో డేట్‌కు శ్రీరామ్ సై... ఈ వీక్ వరస్ట్ పర్ఫార్మర్‌గా జెస్సీ

తనకు ఎలాంటి అమ్మాయి కావాలనే విషయంలో కొన్ని క్వాలిటీస్ వుండాలని చెప్పాడు శ్రీరామ్. ''ప్రియా గారిలో ఉన్న బార్బీ డాల్ లాంటి ఎలిగెన్స్.. పింకీకి ఉన్న సెన్సిటివిటి, బాగా వంట చేసే టాలెంట్.. యానీ మాస్టర్ కి ఉన్న మెచ్యూరిటీ.. హమీద లాంటి ఇంటెన్స్.. శ్వేతాలో ఉన్న ఫ్రెండ్లీనెస్.. కాజల్ లో ఉన్న ప్రేమ.. సిరిలో ఉన్న అల్లరితనం కావాలని' శ్రీరామ్ చెప్పారు. వెంటనే 'నేను సిరికి కూడా చెప్పాను.. ఆమె కమిటెడ్ కాకపోయి ఉంటే కచ్చితంగా ట్రై చేసేవాడ్ని' అని అనగా.. సిరి తెగ మురిసిపోయింది. వెంటనే కలగజేసుకున్న రవి.. 'అన్నా.. నీ టేస్ట్ ఇంత బ్యాడా' అని సెటైర్ వేయగా.. అందరూ నవ్వేశారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: హమీదాతో డేట్‌కు శ్రీరామ్ సై... ఈ వీక్ వరస్ట్ పర్ఫార్మర్‌గా జెస్సీ

ఇదే సమయంలో 'నీ గుండెలో ఎవరైనా అమ్మాయ్ ఉందా..?' అని శ్రీరామ్ ని ప్రశ్నించింది ప్రియా. పదేళ్లుగా సంగీతమే ఉంది. నేను కూడా వెయిట్ చేస్తున్నా ఎవరు వస్తారా అని.. ఆ అమ్మాయి కోసం 'యువర్ మై ఎవ్రిథింగ్' పాట అందుకున్నాడు శ్రీరామ్. ఆ తరువాత శ్వేతా.. 'ఇక్కడున్న ఎవరైనా ఒక అమ్మాయిని డేట్ కి తీసుకువెళ్లాలనుకుంటే ఎవరిని తీసుకెళ్తావ్' అని అడిగింది. దానికి శ్రీరామ్.. హమీద అని బదులిచ్చాడు. ఆ తరువాత ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. ఆ తరువాత లోబో, సన్నీ కలిసి హౌస్ మేట్స్ అందరినీ ఇమిటేట్ చేసి ఫన్ క్రియేట్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.