మెట్రో స్టేషన్‌లలో ‘బిగ్‌బాస్ మిమ్మల్ని చూస్తున్నాడు’!

  • IndiaGlitz, [Sunday,September 22 2019]

ఇదేంటి.. బిగ్‌బాస్ షో వరకే కదా జాగ్రత్తలు చెబుతున్నారేంటి అని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే.. ప్రమాదాలపై యూత్‌లో అవగాహన పెంచేందుకు బిగ్ బాస్‌ను ‘నాగ్’ వేదికగా చేసుకున్నారు. ఆదివారం నాడు అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ‘స్టార్‌-మా నెట్‌ వర్క్‌’ బిజినెస్‌ హెడ్‌ అలోక్‌ జైన్‌తో కలిసి ‘బిగ్‌ బాస్‌ మిమ్మల్ని చూస్తున్నాడు’ అనే పోస్టర్‌ను నాగార్జున ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ.. ప్రాణాలు చాలా విలువైనవని, వాటిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పుకొచ్చారు.

ఈ పోస్టర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో అవగాహన పెంచేలా పలు స్లోగన్స్ ఉన్నాయి. ముఖ్యంగా.. మెట్రో రైల్ ఎక్కే సమయంలో ఎల్లో లైన్ క్రాస్ చేయవద్దని, తోటి ప్రయాణికులను నెట్టవద్దని, డోర్లపై ఆనుకుని నిలబడవద్దని, రైలు ఎక్కేందుకు తొందర పడవద్దని ఇలా పలు సూచనలు ఉన్నాయి. దీంతోపాటు క్యూలైన్లను పాటించాలని, బ్యాక్ ప్యాక్ ను చేతిలో పట్టుకోవాలని కూడా సూచనలు పోస్టర్‌లో ఉండటం విశేషమని చెప్పుకోవచ్చు.

ఇదిలా ఉంటే.. అతి త్వరలో హైదరాబాద్‌లోని అన్ని మెట్రో స్టేషన్‌లలో బిగ్ బాస్ మిమ్మల్ని చూస్తున్నాడు ప్రచారం ప్రారంభమవుతుందని అక్కినేని నాగ్ చెప్పుకొచ్చారు.

More News

కోలీవుడ్ వైపు బ‌న్నీ చూపు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బ‌న్నీ సినిమాల‌కు ఇటు తెలుగు, అటు మ‌ల‌యాళంలో మంచి క్రేజ్ ఉన్నాయి.

మనం సైతం ఐదవ వార్షికోత్సవం

ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ ఐదవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.

ఇంకో 2-3 పథకాలున్నాయ్.. అవి తీసుకొచ్చానో అంతే!!

తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలను కేసీఆర్ సర్కార్ ప్రారంభించింది. మరికొన్ని పథకాలు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

గోదారిలో బోటు ప్రమాదం వెనుక పెద్ద స్కాం ఉంది

తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బోటు ప్రమాదం వెనుక పెద్ద స్కాం ఉందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు.

ఆ బాలీవుడ్ హీరోకి టాలీవుడ్ నిర్మాత భారీ రెమ్యున‌రేష‌న్‌

ప్ర‌స్తుతం ద‌క్షిణాది, బాలీవుడ్ సినిమాల మ‌ధ్య అంత‌రాలు త‌గ్గిపోతున్నాయి. బాలీవుడ్ స్టార్స్ మ‌న ద‌క్షిణాది సినిమాల్లో న‌టించడానికి ఆస‌క్తిని క‌న‌పరుస్తున్నారు.