close
Choose your channels

నాగ్ మూవీలో రంభగా బిగ్ బాస్ బ్యూటీ.. 'బంగార్రాజు'పై లేటెస్ట్ అప్డేట్!

Tuesday, August 3, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నాగ్ మూవీలో రంభగా బిగ్ బాస్ బ్యూటీ.. బంగార్రాజుపై లేటెస్ట్ అప్డేట్!

ఐదేళ్ల క్రితం కింగ్ నాగార్జున డ్యూయెల్ రోల్ లో నటించిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రాన్ని ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. కింగ్ నాగ్ డ్యూల్ రోల్ లో అదరగొట్టేశారు. ముఖ్యంగా బంగార్రాజు పాత్రకైతే నాగ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

ఇదీ చదవండి: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'పుష్ప'.. బాలీవుడ్ స్టార్ తో బన్నీ పోటీ!

ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించడం పై చాలా కాలంగా నాగ్, కళ్యాణ్ కృష్ణ మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఆగష్టు 20న ఈ చిత్రం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం బంగార్రాజు అనే టైటిల్ తో తెరకెక్కనుంది.

తాజా సమాచారం మేరకు ఈ మూవీలో బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ ఐటెం నంబర్ లో స్టెప్పులేయబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం స్పెషల్ సాంగ్ మాత్రమే కాదు చిన్నపాటి రోల్ కూడా మోనాల్ పోషించనుందట. స్వర్గంలో ఉండే రంభ పాత్రలో మోనాల్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ యమగోల, యమలీల చిత్రాల ఆధారంగా ఓ కామెడీ ట్రాక్ ని రెడీ చేశాడట. ఈ కామెడీ ట్రాక్ తో పాటు, స్పెషల్ సాంగ్ లో నాగ్ తో మోనాల్ చిందేయనుంది. ప్రస్తుతం మోనాల్ బుల్లితెరపై డాన్స్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. మరో వైపు ఆమె బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ తో డేటింగ్ చేస్తున్నట్లు కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు నాగార్జున.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీలో నటిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.