close
Choose your channels

బిగ్ బాస్ దివి 'క్యాబ్ స్టోరీస్' ట్రైలర్.. ఏదో క్రైమ్ జరుగుతోంది!

Tuesday, May 25, 2021 • తెలుగు Comments

 బిగ్ బాస్ దివి క్యాబ్ స్టోరీస్ ట్రైలర్.. ఏదో క్రైమ్ జరుగుతోంది!

యంగ్ బ్యూటీ దివి తెలుగు బిగ్ బాస్ సీజన్ 4తో గుర్తింపు తెచ్చుకుంది. దివి నటించిన వెబ్ సిరీస్ ' క్యాబ్ స్టోరీస్' ఫస్ట్ సీజన్ రిలీజ్ కు రెడీ అయింది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. కెవిఎన్ రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఆసక్తిని పెంచే విధంగా ఉంది.

డైలాగ్స్ స్మూత్ గా ఉంటూనే ఆకట్టుకుంటున్నాయి. దివి ఓ క్యాబ్ లో ప్రయాణించే ప్యాసింజెర్ గా కనిపిస్తోంది. క్యాబ్ డ్రైవర్ గా నటుడు గిరిధర్ ఆకట్టుకుంటున్నాడు. 'తెలియక చేస్తే తప్పా.. తెలిశాక సారీ చెబితే తప్పా' అంటూ దివి చెబుతున్న క్యూట్ డైలాగ్ బావుంది.

ఇదీ చదవండి: చంద్ర మోహన్ చనిపోయారంటూ రూమర్స్.. ఇదీ అసలు సంగతి

'మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సర్.. ఒక్కడే అబ్బాయి, ఒక్కతే భార్య' అని గిరిధర్ చెప్పే డైలాగ్ ఫన్నీగా ఉంది. ట్రైలర్ లో ధన్ రాజ్, శ్రీహాన్, ఇతర పాత్రలని కూడా పరిచయం చేశారు. వీరంతా ఏదో క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతున్నట్లు ట్రైలర్ ని చూస్తే అర్థం అవుతోంది.

మొత్తంగా క్యాబ్ స్టోరీస్ ని ఎంటర్టైనింగ్ కంటెంట్ తోనే నింపినట్లు ఉన్నారు. స్పార్క్ ఓటిటి లో మే 28న క్యాబ్ స్టోరీస్ రిలీజ్ కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz