అమ్మ రాజశేఖర్‌ను కొంత వరకూ మరిపిస్తున్న అరియానా..

  • IndiaGlitz, [Tuesday,November 10 2020]

ఓపెనింగే.. అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయినందుకు సొహైల్ ఒకవైపు, అరియానా మరోవైపు ఏడుపు సీన్.. అటు సొహైల్‌ని మెహబూబ్.. ఇటు అరియానాను అవినాష్ ఓదార్చారు. ఇంక ఆ తరువాత మోనాల్ హిందీలో పాట అందుకోవడంతో బిగ్‌బాస్ తెలుగులో మాట్లాడమని వార్న్ చేశారు. కేవలం ఐదు నిమిషాల్లోనే రెండు సార్లు అమ్మడికి బిగ్‌బాస్ నుంచి వార్నింగ్ రావడంతో మెహబూబ్ ఆమెను జైల్లో పెట్టాడు. జైల్లో కూర్చొన్న మోనాల్.. కాస్తైనా బాధగా లేకుండా రెట్టించిన ఉల్లాసం.. ఉత్సాహంగా కమలాలు వలుచుకుంటూ తినకుంటూ కూర్చొంది. ఇక అఖిల్ వచ్చేసి కాసేపు మోనాల్‌ను ఆటపట్టించాడు. నెక్ట్స్ నామినేషన్ పర్వం స్టార్ట్. అంతకు ముందు అవినాష్‌తో అరియానా ఈ సారి నన్ను నలుగురు నామినేట్ చేస్తారని చెప్పింది. కానీ ఒక్క అవినాష్ మినహా అరియానాను హౌస్‌మేట్స్ మొత్తం నామినేట్ చేసేశారు. ఒక్క అఖిల్ తప్ప మిగిలిన వాళ్లంతా టీ స్టాండ్ టాస్క్‌లో అరియానా బిహేవియర్‌కే నామినేట్ చేశారు. అఖిల్ మాత్రం పాన్ డబ్బా టాస్క్‌లో గడసరి పిల్ల రోల్ ఇచ్చారు కానీ నువ్వు కేరెక్టర్ నుంచి బయటకు వెళ్లిపోయి అవినాష్‌తో పదే పదే మీటింగ్ పెట్టావని నామినేట్ చేశాడు. దీనికి అరియానా కూడా యాక్సెప్ట్ చేసింది. ఇక మెహబూబ్.. కొందరికి ఫేవర్ చేస్తున్నావంటూ అరియానాను నామినేట్ చేశాడు. తరువాత హారికను నామినేట్ చేశాడు.

ఆ తరువాత సొహైల్ కూడా కొంచెం పాజిటివ్ రీజన్ చెప్పే నామినేట్ చేశాడు. కానీ దాన్ని కూడా అరియానా తీసుకోలేకపోయింది. తరువాత సొహైల్ అభిని నామినేట్ చేశారు. టీ స్టాండ్ టాస్క్‌లో గివ్ అప్ ఇచ్చాడని రీజన్ చెప్పాడు. అవినాష్.. హారిక, మోనాల్‌ను నామినేట్ చేశాడు. తరువాత అభి.. అరియానా, సొహైల్‌ను నామినేట్ చేశాడు. కానీ అరియానా మాత్రం నేను గేమ్‌ని గేమ్‌ లాగే ఆడగలుగుతున్నానంటూ కాస్త యాటిట్యూడ్ చూపినట్టు అనిపించింది. మోనాల్‌.. అరియానాను నామినేట్ చేసింది. ఇక్కడ కూడా అరియానా.. వాదనకు దిగింది. తరువాత మెహబూబ్‌ని నామినేట్ చేసింది. హారిక.. మెహబూబ్‌ను నామినేట్ చేసింది. తరువాత అఖిల్.. అభి, అరియానాను నామినేట్ చేశాడు. అరియానా.. మోనాల్‌ను నామినేట్ చేసింది. ఆ తరువాత సొహైల్‌తో కామెడీగా హారికతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుని వెళ్లి సొహైల్‌ని నామినేట్ చేసింది. లాస్య.. మెహబూబ్, అరియానాను నామినేట్ చేసింది.

నేను ఎలా ఆడాలో నువ్వెలా చెబుతావని ప్రశ్నించాడు. అఖిల్‌తో పూర్తిగా విభేదించాడు. కాగా.. ఈ వారం నామినేషన్స్‌లో అరియానా, అభి, సొహైల్, మెహబూబ్, హారిక ఉన్నారు. నామినేషన్స్ పర్వం ముగిశాక అఖిల్ వెళ్లి చాక్లెట్ ఇచ్చి అభిని కన్విన్స్ చేసేందుకు ట్రై చేయడం చాలా బాగా అనిపించింది. కానీ అభి మాత్రం మళ్లీ అఖిల్‌తో వాదనకు దిగాడు. ఇది సీరియస్ వేలో కొనసాగకున్నా.. అఖిల్ నామినేట్ చేయడం అభిపై ఇంపాక్ట్‌ను చూపించిందన్నది మాత్రం అర్థమైంది. ఇక అరియానా హౌస్ మొత్తం నన్ను నామినేట్ చేసింది. ఈ సారి నేను వెళ్లిపోతా అని అరియానా.. అవినాష్‌కి చెప్పింది. అంతా ఒక గ్రూప్‌గా ఫామ్ అయిందని చెప్పింది. తరువాత సొహైల్ దగ్గర కూడా అఖిల్.. అభిని నామినేట్ చేసిన కారణం చెప్పి.. అది తను జెన్యూన్‌గానే చేశానని కానీ అభికి అర్థం కావడం లేదని వాపోయాడు. దీనికి సొహైల్ నచ్చజెప్పాడు. మొత్తంగా నామినేషన్స్‌లో అమ్మ లేని లోటైతే తెలిసింది. ఆయన తనను ఎవరైనా నామినేట్ చేస్తే చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అయితే అరియానా ఆ లోటును కొంతవరకూ పూడ్చగలిగిందనే చెప్పాలి.

More News

దుబ్బాక: తొలిరౌండ్‌లో ఆధిక్యంలో బీజేపీ...

దుబ్బాక ఉపఎన్నిక ఫలితం నేడు తేలనుంది. తొలి రౌండ్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది.

దుబ్బాక కౌంటింగ్ ప్రారంభం.. పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ముందంజ..

సిద్దిపేట: నేడు దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తేలనుంది. ఇప్పటికే కౌంటింగ్ ప్రారంభమైంది.

ర‌వితేజ చిత్రంలో హాట్ యాంక‌ర్‌

తెలుగు బుల్లితెర అభివృద్ధి చెందుతున్న త‌రుణంలో గ్లామ‌ర్ హంగులు అద్దిన తెలుగు యాంక‌ర్స్‌లో అన‌సూయ ముందు వ‌రుస‌లో ఉంటారు.

ఆ రెండు చోట్ల ప్లాన్ చేస్తున్న కాజ‌ల్‌!

దశాబ్దంపైగా తెలుగు, తమిళ చిత్రాలతో పాటు అడపాదడపా చేసిన హిందీ చిత్రాలతో హీరోయిన్‌గా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకుంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

ఏపీలో కొత్త జిల్లాలు.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వివరాలు!

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు కొనసాగుతోంది. వచ్చే ఏడాది జనవరి కల్లా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.