బిగ్ బాస్-3 ప్రోమో రిలీజ్.. ఆయనెవరో తెలిసిపోయింది!

  • IndiaGlitz, [Friday,June 21 2019]

తెలుగులో బిగ్‌బాస్ 1,2 షోలు ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వన్‌కు జూనియర్ ఎన్టీఆర్.. టూకు నేచురల్ స్టార్ నానీ హోస్ట్‌‌గా వ్యవహరించిన విషయం విధితమే. సెకండ్ సీజన్ మొదట పెద్దగా హిట్టవ్వకపోయినప్పటికీ రానురాను డోస్ పెంచిన నానీ సూపర్ డూపర్ హిట్ చేసేశారు. అయితే సీజన్ దగ్గరపడుతుండటంతో త్రీకి ఎవరు వ్యాఖ్యాత అనేది దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ బిగ్‌బాస్‌కు సంబంధించిన ఓ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో హోస్ట్ ఎవరన్న విషయం ‘మా’ టీవీ యాజమాన్యం హింట్ ఇచ్చేసింది

ప్రోమోలో ఏముంది..!?

45 సెకన్ల వీడియోలో మనసు కోతి వంటిది... అలాంటి మనసున్న కొందరు వ్యక్తులు ఓ ఇంట్లో చేరితే వాళ్లను అధికారంతో నడిపించేది ఎవరు? శక్తి గల ఆ వ్యక్తి ఎవరు? అంటూ ఆ ప్రోమో సాగుతుంది. అయితే వీడియో చివర్లో పెద్ద కోట్ ధరించిన వ్యక్తి పూర్తిగా ముఖం కప్పుకుని కనిపిస్తాడు. ఆయన లాంగ్ కోట్ ధరించడం.. ముఖం పూర్తిగా కప్పేసి ఉండటంతో ఎవరన్న విషయం కనిపెట్టడానికి కాస్త కష్టమైన అయితే.. ఒకటికి రెండు ఈ సార్లు ప్రోమో చూస్తే ఆయనెవరో ఇట్టే కనిపెట్టేయచ్చు.

ఆ ముసుగులో ఉన్నది కింగే..!

ఈ ప్రోమో చూసిన నెటిజన్లు, బిగ్‌బాస్ ప్రియులు.. ఆ ముసుగులో ఉన్న వ్యక్తిని బాడీ లాంగ్వేజి ఆధారంగా ఆయన అక్కినేని నాగార్జున అని చెబుతున్నారు. ముఖ్యంగా ‘డాన్‌’ సినిమాలో నాగ్ గెటప్ కూడా ఇలాగే ఉందని ఆ హైట్, వాకింగ్ స్టయిల్ మొత్తం అంతా నాగ్‌నే తలపిస్తున్నాయని నెటిజన్లు కనిపెట్టేశారు.

వాస్తవానికి ఎప్పట్నుంచో బిగ్‌బాస్-3కి హోస్ట్ అక్కినేని నాగార్జున అని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజా ప్రోమోతో మరింత క్లూ ఇచ్చినట్లైంది. మరీ ముఖ్యంగా ఇప్పటికే ‘మా’ టీవీలో ప్రసారమయ్యే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమాన్ని నాగార్జున.. బిందాస్‌గా నడిపి పెద్ద ఎత్తున రేటింగ్స్ తెచ్చిపెట్టారు. అక్కినేని అయితేనే మళ్లీ ఈ షోకి న్యాయం చేస్తారని భావించిన ‘మా’ నాగ్‌ను ఫిక్స్ చేసిందని టాక్. అయితే ఇంతకీ ఆ వ్యక్తి నాగార్జునా కాదా..? అనే విషయం తెలియాలంటే ‘మా’ క్లారిటీ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.

More News

చంద్రబాబుకు ముందే తెలుసా.. ఇదంతా భారీ ప్లానా!?

టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలో చేరతారని చంద్రబాబుకు ముందే తెలుసా..? చంద్రబాబే ఆ నలుగుర్ని బీజేపీలో చేర్పించారా..?

విదేశాల్లో ఉన్న చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు!

టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్ రావు..

సీక్రెట్‌ నిశ్చితార్థంపై రెజీనా క్లారిటీ ఇచ్చేసింది!

గత కొన్ని రోజులుగా హీరోయిన్ రెజీనాకు రహస్యంగా ఎంగేజ్మెంట్ అయిపోయిందని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

విజ‌య్ దేవ‌ర‌కొండ కోసం దుల్క‌ర్ సాంగ్‌

మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్, త‌న స్నేహితుడు ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ

ప‌వ‌న్ నిర్మాత‌గా చ‌ర‌ణ్ సినిమా

ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిర్మాత‌గా కొత్త సినిమా ఉంటుందా? అంటే అవున‌నే స‌మాధానం సినీ వ‌ర్గాల్లో విన‌ప‌డుతున్నాయి.