బిగ్‌బాస్ 5 తెలుగు: బనానా ఆటలో ‘‘వేట’’.... ఈ వారం నామినేషన్స్‌లో ఆ ఏడుగురు..!!!

  • IndiaGlitz, [Tuesday,October 19 2021]

ఆరువారాలు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ 5 తెలుగు.. ఏడో వారంలోకి అడుగుపెట్టింది. లోబో, శ్వేతలను గుర్తుచేసుకుని హౌస్‌మేట్స్ ఎమోషనల్ అయ్యారు. ఇక నామినేషన్స్ డే కావడంతో హౌస్‌లో ఎప్పటిలాగే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. స‌న్నీ.. శ్వేత‌ను గుర్తు చేస్తూ ఆమె ఎంతో బాధ‌తో వెళ్లిపోయింద‌ని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక బిగ్‌బాస్ ఆడించిన కోతుల టాస్క్ ఆకట్టుకుంది. మరి ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే ఈరోజు ఎపిసోడ్ గురించి చదివేయాల్సిందే.

బిగ్బాస్ హౌస్‌లో 43వ రోజు వగలాడి పాటతో ప్రారంభమైంది. రవి, యానీ మాస్టర్‌లు కాసేపు లోబోని గుర్తుచేసుకున్నారు ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా లోబో చేసిన అల్లరి, ఫుడ్ కోసం నానాపాట్లు పడటం వంటి వాటిపై జోకులు వేసుకున్నారు. సిరి-షణ్ముఖ్-జెస్సీ ముచ్చట్లు పెట్టారు. ర‌వి, కాజ‌ల్ ఇద్ద‌రూ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నార‌ని జెస్సీతో చెప్పుకొచ్చాడు ష‌ణ్ముఖ్‌. రవి గుడిలోకి వచ్చానంటూ కాసేపు నవ్విస్తూ..మోజ్ రూమ్‌లో ఉన్న జెస్సీ, ష‌ణ్ను, సిరి చుట్టూ మూడు ప్ర‌ద‌క్షిణ‌లు చేశాడు.

ఇక మొదటి నుండి మానస్ అంటే ప్రేమ చూపిస్తున్న ప్రియాంక... అతడు తనకు అన్నం తినిపించలేదని ఫీలైంది. ఈ విషయం సన్నీ దగ్గర చెప్పుకుని బాధపడింది. మనం నిజంగా ఒకరిని ప్రేమిస్తే వాళ్ళ కళ్ళలో మన బాధకనిపిస్తుందని... మానస్ తనను అర్థం చేసుకోలేకపోతున్నాడు అని మనస్తాపానికి గురైంది. ఈ విషయాన్ని సన్నీ మానస్‌తో చెప్పగా.. ఆడవాళ్ళ గురించి నాకు తెలియదని, అందుకే ఇప్పటి వరకు మూడు బ్రేకప్స్ అయ్యాయని అన్నాడు. తనకు అర్థం అయ్యేలా నీ గురించి చెప్పాలే అని సన్నీ మానస్‌తో అన్నాడు.

ఇక సోమవారం కావడంతో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ఈసారి నామినేషన్స్ ప్రక్రియని బిగ్ బాస్ కొత్తగా నిర్వహించాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న చెట్టుకు కంటెస్టెంట్స్ ముఖాలతో కూడిన కోతుల బొమ్మలు ఏర్పాటు చేశారు. జంగిల్ సౌండ్ రాగానే ఇంటి సభ్యుల్లో రెండు అరటి పండ్లు తీసుకున్న ఇద్దరు...వాళ్లు ఎవర్ని నామినేట్ చేస్తున్నారో చెప్పాల్సి ఉంటుంది. ఇద్దరిలో ఎవరు చెప్పిన కారణం సరైనదో వేటగాడు ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి. నామినేట్ అయిన వ్యక్తి ఫొటో తగిలించి ఉన్న కోతి బొమ్మను చెట్టునుంచి కట్ చేసి వేటగాడు నామినేషన్ బిన్ లో వేయాలి. గన్ షాట్ వినపించగానే ఏ వేటగాడు ఎక్కువసార్లు ముందుగా బయటకు వస్తారో ఆ వ్యక్తి నామినేషన్ నుంచి తప్పించుకోవచ్చు...

సిరి, షణ్ముక్ అరటి పండ్లు దక్కించుకున్నారు. గన్ షాట్ వినిపించగానే సన్నీ డేరా నుంచి ముందుగా బయటకు వచ్చాడు. షణ్ముక్, సిరి ఇద్దరూ యానీ మాస్టర్‌ని నామినేట్ చేస్తున్నట్టు సన్నీకి చెప్పారు. రెండోసారి జంగిల్ సౌండ్ రాగానే సిరి, యానీ అరటిపండు అందిపుచ్చుకున్నారు. యానీ...సిరిని, సిరి..మానస్ ని నామినేట్ చేశారు. అయితే వేటగాడైన సన్నీ సిరి పేరు ఫైనల్ చేశాడు. మూడోసారి జంగిల్ సౌండ్ వచ్చినప్పుడు కూడా బనానా సిరి, కాజల్ అందిపుచ్చుకున్నారు. వేటగాళ్ల టీమ్ నుంచి మళ్లీ సన్నీ ముందొచ్చాడు. సిరి మళ్లీ మానస్‌ని, కాజల్... ప్రియని నామినేట్ చేయగా...వేటగాడు ప్రియ పేరు ఫైనల్ చేశాడు.

నాలుగో సారి సిరి తను దక్కించుకున్న అరటిపండు ప్రియాంక సింగ్‌కి ఇచ్చింది. బొమ్మల టాస్క్‌లో కాజల్ ప్రవర్తన నచ్చలేదంటూ ప్రియాంక సింగ్ ఆమెను నామినేట్ చేసింది. ప్రియా ...రవిని నామినేట్ చేసింది. అయితే సన్నీ.. రవి పేరు చెప్పాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. మరోవైపు ప్రియాంక సింగ్ కూడా తను చెప్పిన సరైన కారణం పరిగణనలోకి తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన రీజన్ తాను చెబితే... సోఫాపై టవల్ ఆరేసిన కారణం తీసుకోవడం ఏంటంటూ మండిపడింది. ఇక శ్వేత హౌస్ నుంచి ఎలిమినేట్ కావడానికి కారణం రవి అని రీజన్ చెప్పి సన్నీ రవిని నామినేట్ చేశాడు. దీంతో సన్నీ ఫ్రెండ్స్‌ని సేవ్ చేసుకునే గేమ్ ఆడుతున్నాడంటూ షణ్ముఖ్-రవి మాట్లాడుకున్నారు. అటు ఐదోసారి కూడా సిరి అరటిపండు దక్కించుకుని ప్రియాంక సింగ్‌కి ఇచ్చింది. మరో అరటి పండు తీసుకున్న రవి కూడా కాజల్‌నే నామినేట్ చేశాడు. ఇద్దరూ ఒకే వ్యక్తిని నామినేట్ చేయడంతో కాజల్ ఈసారి నామినేషన్లోకి రాక తప్పలేదు. మొత్తం మీద కాజల్, రవి, సిరి, యానీ, ప్రియ, శ్రీరామ్, జస్వంత్‌లతో పాటు సీక్రెట్ రూమ్‌లో ఉన్న లోబో నేరుగా నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించారు.

More News

అజయ్, శ్రద్ధా దాస్ 'అర్థం' ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన దేవ్ కట్ట

'దేవి', 'పెదరాయుడు' చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర, శ్రద్ధా దాస్... అజయ్, ఆమని, సాహితీ అవంచ ప్రధాన తారలుగా

డిసెంబర్ 24న విడుదలకానున్న‘శ్యామ్ సింగ రాయ్’

ప్రస్తుతం తెలుగులో నాని నటిస్తోన్న శ్యామ్ సింగ రాయ్ సినిమా భారీ అంచనాలున్నాయి. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌లో

ఆది సాయి కుమార్ ''తీస్ మార్ ఖాన్" చిత్రం ఫస్ట్ లుక్ విడుదల

లవర్ బాయ్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఆది సాయికుమార్... పలు యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా  నటించి  మాస్ ఆడియెన్స్ కు కూడా చేరువయ్యాడు.

ఎన్నెన్నో జన్మల బంధం... స్టార్ మా లో...

కొత్తదనం వున్న కథలు... ప్రతి ఇల్లూ తనది అనుకునే ఎన్నో కుటుంబాల్ని తెలుగు ప్రేక్షకులకు తన ధారావాహికలతో పరిచయం చేస్తున్న స్టార్ మా ఈ సారి

ఆమె నా కూతురు కాదు, ఆస్తుల్ని కాజేసేందుకే ఈ ప్రచారం: ‘‘ పెళ్లి సందD ’’ హీరోయిన్ శ్రీలీలపై ఆరోపణలు

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో గౌరి రోణంకి ద‌ర్శ‌కత్వం వహించిన చిత్రం ‘‘ పెళ్లి సందD ’’. ప్ర‌ముఖ హీరో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్, శ్రీ‌లీల జంట‌గా న‌టించారు.