కోవిడ్ ఎఫెక్ట్ : రూల్స్ అతిక్రమిస్తే అంతే.. బిగ్ బాస్ సెట్ సీల్!

  • IndiaGlitz, [Friday,May 21 2021]

కరోనా విలయతాండవానికి ముగింపు ఎప్పుడో ఎవరికీ అంతుచిక్కడం లేదు. దీనితో అవసరమైన చోట్ల ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూ విధిస్తున్నాయి. కోవిడ్ ని అదుపు చేసేందుకు ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. సినిమా రంగం విషయానికి వస్తే.. మూవీ షూటింగ్స్, థియేటర్స్ లో సినిమాల ప్రదర్శన నిలిచిపోయింది.

కోవిడ్ ప్రభావం తాజాగా మలయాళం బిగ్ బాస్ షోపై పడింది. చెన్నైలోని చెంబరంబాక్కం ఎవిపి ఫిలిం సిటీలో మలయాళం బిగ్ బాస్ సీజన్ 3 షూటింగ్ జరుగుతోంది. కోవిడ్ నిబంధనలు ఉల్లంగిస్తూ షూటింగ్ జరుపుతుండడంతో బుధవారం అధికారులు బిగ్ బాస్ సెట్ సీల్ చేశారు. దీనితో మధ్యలోనే మలయాళీ బిగ్ బాస్ సీజన్ 3కి బ్రేక్ పడింది.

కొవిడ్ కేసులు అత్యధికంగా నమోదు అవుతుండడంతో టెలివిజన్, సినిమా షూట్స్ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ మలయాళం బిగ్ బాస్ 3 షూటింగ్ కొనసాగించారు. ఈ సంగతి తెలుసుకున్న అధికారులు బృందంగా వెళ్లి సీల్ చేశారు. నిర్వాహకులపై రూ లక్ష ఫైన్ కూడా విధించారు.

తమిళ బిగ్ బాస్ 4 ముగిసిన సెట్ లోనే మలయాళీ బిగ్ బాస్ 3 షూట్ చేస్తున్నారు. సెట్ లో కొన్ని మార్పులు మాత్రమే చేశారు. మలయాళీ బిగ్ బాస్ మధ్యలోనే ఆగిపోవడం ఇది రెండవసారి. గత ఏడాది లాక్ డౌన్ సందర్భంగా సీజన్ 2 మధ్యలో నిలిచిపోయింది.

More News

బద్రి హీరోయిన్ బోల్డ్ షో.. బిగుతు అందాలు చూస్తే ఉక్కిరిబిక్కిరే..

సోషల్ మీడియాలో తన బోల్డ్ షోతో రచ్చ చేస్తోంది అమీషా పటేల్. సినీ అభిమానులకు అమీషా పటేల్ గురించి పరిచయం అవసరం లేదు.

బ్లాక్ ఫంగస్‌ కన్నా ప్రమాదకరం.. వైట్ ఫంగస్ లక్షణాలివే..

కరోనా మహమ్మారి వ్యాప్తిని ఎలా అరికట్టాలా.. అని తలలు పట్టుకుంటున్న ప్రభుత్వానికి కొత్తగా రకరకాల వ్యాధులు తోడవుతూ సవాల్ చేస్తున్నాయి. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ దేశాన్ని వణికిస్తుంటే..

కరోనా ఆయుర్వేద మందు పంపిణీ తాత్కాలికంగా నిలిపివేత..

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేద మందు పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశారు. మందు కోసం జనం పోటెత్తడంతో పంపిణీ చాలా కష్టంగా మారింది.

తన విలన్ కి మెగాస్టార్ రూ.2 లక్షల సాయం.. ఎమోషనల్ అయిన నటుడు

ఆపదలో ఉన్న వారికి సాయం అందించడం మెగాస్టార్ చిరంజీవికి అనుదిన కార్యక్రమంగా మారిపోయింది. ప్రతిరోజూ ఏదో ఒక సాయం చేస్తూ చిరంజీవి వార్తల్లో నిలుస్తున్నారు.

హీరోయిన్ న్యూడ్ వీడియో వివాదం.. 'నా డ్రైవర్ కూడా చూశాడు'

హీరోయిన్ రాధికా ఆప్టే 2005లోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సరిగ్గా ఐదేళ్ల తర్వాత వర్మ రక్తచరిత్ర చిత్రంతో టాలీవుడ్ లోకి ప్రవేశించింది.